యుపిఎస్‌సి సివిల్ సర్వీసెస్ పరీక్ష 2019 ఫలితాలు వెళ్లడయ్యాయి. యూ‌పి‌ఎస్‌సి 2019 పరీక్షలో ప్రదీప్ సింగ్ ఫస్ట్ ర్యాంకు పొందారు. రెండో ర్యాంకులో జతిన్ కిషోర్,  మూడో ర్యాంకులో ప్రతిభా వర్మ ఉన్నారు. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూ‌పి‌ఎస్‌సి ) మంగళవారం సివిల్ సర్వీసెస్ పరీక్ష 2019 ఫలితాన్ని తన అధికారిక వెబ్‌సైట్‌లో ప్రకటించింది.

యూ‌పి‌ఎస్‌సి సివిల్ సర్వీసెస్ 2019 పరీక్షకు ఆన్‌లైన్‌లో అర్హత సాధించిన అభ్యర్థుల జాబితాను ఆన్‌లైన్‌లో upsc.gov.in చూడవచ్చు. ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్, ఇండియన్ ఫారిన్ సర్వీస్, ఇండియన్ పోలీస్ సర్వీస్, ఇతర కేంద్ర సేవలకు అభ్యర్థుల ఎంపిక కోసం కమిషన్ ప్రతి సంవత్సరం సివిల్ సర్వీసెస్ పరీక్షను నిర్వహిస్తుంది.

సివిల్ సర్వీసెస్ పరీక్ష రెండు దశలలో నిర్వహిస్తారు: 1) ప్రధాన పరీక్షకు అభ్యర్థుల ఎంపిక ప్రేలిమినరీ (ఆబ్జెక్టివ్ రకం) 2) వివిధ సేవలకు అభ్యర్థుల ఎంపిక కోసం సివిల్ సర్వీసెస్ మెయిన్ పరీక్ష (రాత, ఇంటర్వ్యూ) ఉంటాయి.

also read భార‌త‌దేశ విద్యావిధానం 2020లో కొత్త మార్పులు..! ...

ఈ ఏడాది సివిల్ స‌ర్వీసుల‌కు ఎంపికైన వారిలో 304 మంది జ‌న‌ర‌ల్ అభ్య‌ర్థులు కాగా  78 మంది ఈడ‌బ్ల్యూఎస్‌, 251 మంది ఓబీసీ, 129 మంది ఎస్సీ, 67 మంది ఎస్టీ క్యాట‌గిరీల‌కు చెందినవారు ఉన్న‌ట్లు యూపీఎస్సీ అధికారులు వెల్ల‌డించారు. సివిల్ సర్వీసెస్ పరీక్ష 2019 ఫలితాలను రాత పరీక్ష, పర్సనాలిటీ పరీక్ష ఆధారంగా ఈ జాబితాను విడుదల చేశారు.

యుపిఎస్సి సివిల్ సర్వీసెస్ పరీక్ష 2019 ఫలితాలను ఎలా తేలుసుకోవాలంటే : 

https://www.upsc.gov.in/ హోమ్‌పేజీలో “సివిల్ సర్వీసెస్ పరీక్ష ఫైనల్ ఫలితాలు, 2019” లింక్ పై క్లిక్ చేయండి. తరువాత కొత్త పేజీ కనిపిస్తుంది. క్రిందికి స్క్రోల్ చేసి మీ ఫలితాలను చూడవచ్చు. ఫలితాలను భవిష్యత్ ఉపయోగం  కోసం డౌన్‌లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకోండి.

గత సంవత్సరం యుపిఎస్సి 2019 ఏప్రిల్ 5న సివిల్ సర్వీసెస్ పరీక్ష 2018 ఫలితాలను తన అధికారిక వెబ్‌సైట్‌లో ప్రకటించింది. ఇందులో 55.3% మార్కులతో కనిషక్ కటారియా మొదటి స్థానంలో నిలిచారు. తరువాత అక్షత్ జైన్ 53.3% మార్కులతో రెండో స్థానం దక్కించుకున్నాడు. జునైద్ అహ్మద్ 53.18% మార్కులతో మూడవ స్థానంలో నిలిచాడు.