Asianet News TeluguAsianet News Telugu

కాలేజీలో చదువే మధ్యలోనే వదిలేద్దామనుకున్నవాడు... UPSC టాపర్ అయ్యాడు..!

కాలేజీ చదువు మధ్యలోనే ఆపేసి ఇంటికి వెళ్లిపోదామని అనుకున్నాడట. కానీ అలా చేస్తే.. జీవితంలో ముందుకు వెళ్లలేనని అర్థం చేసుకున్నాడు. దీంతో.. పట్టుదలతో చదవడం మొదలుపెట్టాడు.  ఇప్పుడు యూపీఎస్సీ సాధించాడు.
 

UPSC 562 ranker Vikas Senthiya About His Interview
Author
Hyderabad, First Published Nov 16, 2021, 3:33 PM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

గ్రాడ్యుయేషన్ మొదటి సెమిస్టర్ లో కాలేజీ మానేద్దామని అనుకున్నాడు.. అాలాంటి వ్యక్తి.. ఇప్పుడు.. యూపీఎస్సీలో టాపర్ గా నిలిచాడు. అతనే మధ్య ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వికాస్ సెంథియా.  ఇప్పుడు యూపీఎస్సీలో 542వ ర్యాంకు తెచ్చుకొని.. ఐపీఎస్ గానీ, ఐఆర్డీఎస్ క్యాడర్ అందుకోబోతున్నాడు. 

వికాస్.. చిన్నతనం చదువంతా.. హిందీ మాద్యమంలోనే సాగింది.  కాలేజీకి వెళ్లే సరికి.. చదువు మొత్తం ఇంగ్లీష్ లో ఉండిపోయింది. దీంతో.. కనీసం నోట్స్ కూడా రాసుకోలేకపోయాడు. దీంతో.. క్లాస్ ఏమీ అర్థం కాకపోయేది. దీంతో... కాలేజీ చదువు మధ్యలోనే ఆపేసి ఇంటికి వెళ్లిపోదామని అనుకున్నాడట. కానీ అలా చేస్తే.. జీవితంలో ముందుకు వెళ్లలేనని అర్థం చేసుకున్నాడు. దీంతో.. పట్టుదలతో చదవడం మొదలుపెట్టాడు.  ఇప్పుడు యూపీఎస్సీ సాధించాడు.

వికాస్ సెంథియా మధ్యప్రదేశ్‌లోని భింద్ జిల్లాలోని గౌరం గ్రామ నివాసి. అతని గ్రామం మెహగావ్ అసెంబ్లీ నియోజకవర్గంలో సింధ్ నది ఒడ్డున ఉంది. ఈ ప్రాంతాన్ని చంబల్ అని కూడా అంటారు. తాను 12వ తరగతి వరకు ఓ మోస్తరు విద్యార్థినేనని చెప్పారు. 12వ తరగతిలో మంచి మార్కులు రావడంతో.. సిటీకి వెళ్లి పెద్ద చదువులు చదవమని తండ్రి కోరాడట.

తండ్రి కోరిక మేరకు ఢిల్లీ యూనివర్శిటీకి వెళ్లాడు. అయితే.. అక్కడ ఇంగ్లీష్ సరిగా అర్థం కాక ఇబ్బంది పడ్డాడు. ఇంగ్లీష్ రాకపోతే.. ఎంత ఇబ్బంది ఉంటుందో.. అది తాను  ఎదుర్కొన్నానని.. తనలాగా.. లాంగ్వేజ్ సమస్యలతో బాధపడేవారు చాలా మందే ఉన్నారని వికాస్ చెబుతున్నాడు.

గ్రాడ్యుయేషన్ తర్వాత యూపీఎస్సీ గురించి తెలియగానే కుటుంబ సభ్యులతో మాట్లాడానని, వారు కూడా సపోర్ట్ చేశారని వికాస్ చెప్పారు. తర్వాత యూపీఎస్సీ ప్రయత్నించారు. కుటుంబ సభ్యులు తనను నమ్మి చదువుల కోసం పంపినప్పుడు.. ఏదో ఒకటి చూపించాలని భావించానని అంటున్నాడు. 

యుపిఎస్‌సి సుదీర్ఘ ప్రయాణమని, హెచ్చు తగ్గులు ఉన్నాయని వికాస్ చెప్పారు. యోగా చేయడం వల్ల .. కాస్త ప్రశాంతత పొందానని ఆయన చెప్పారు. కాగా.. తన విజయానినకి తన తల్లిదండ్రులు, స్నేహితులు ఎంతగానో సహకరించారని ఆయన చెప్పారు.

ప్రిపరేషన్ సమయంలో.. రెండు, మూడు ఇంగ్లీష్ పుస్తకాల నుంచి రిఫరెన్స్ తీసుకొని.. ప్రిపేర్ అయ్యానని.. అలా చేయడం వల్లే..తాను అనుకున్నది సాధించగలిగానని ఆయన చెప్పడం విశేషం. ముందు ఇంగ్లీష్ లో నోట్స్ ప్రిపేర్ చేసుకొని... తర్వాత హిందీలోకి దానిని ట్రాన్సిలేట్ చేసుకొని. అర్థం చేసుకునేవాడనని అతను చెప్పడం గమనార్హం.

పరీక్షకు ఎలా ప్రిపేర్ అవ్వాలి..? పేపర్ ప్రాట్రన్  ఎలా ఉంటుంది అనే విషయాన్ని ముందుగా తెలుసుకోవాలట. ఆ తర్వాత ప్రిపరేషన్ మొదలుపెడితే.. సాధించడం సులభమౌతుందని వికాస్ తన స్వీయ అనుభవాన్ని తెలియజేశాడు.

ఒక్కొక్కరికి ఒక్కోలా జరుగుతుందని వికాస్ చెప్పాడు. కొందరికి ప్రిలిమ్స్ కఠినంగా అనిపిస్తాయి, మరికొందరికి మెయిన్స్ , మరికొందరికి ఇంటర్వ్యూ. ప్రతి ఒక్కరికి వారి స్వంత కంఫర్ట్ జోన్ ఉంటుంది, అందులో వారు సుఖంగా ఉంటారు. నా దృక్కోణంలో, మెయిన్స్ , ఇంటర్వ్యూ కంటే ప్రిలిమ్స్ చాలా కఠినమైనవి. ఇంటర్వ్యూకు ముందు మాక్ ఇంటర్వ్యూ ఇచ్చాడు. గరిష్టంగా ఏమి జరుగుతుందో అని అతను ఆశ్చర్యపోయానని చెప్పాడు. ప్రశ్న లేకపోతే, నేను చెబుతాను. ఇలా ఆలోచిస్తే భయం పోతుంది. మిమ్మల్ని మీరు బాగా వ్యక్తీకరించగలరు. ఇంటర్వ్యూలో ఆత్మవిశ్వాసం వస్తుంది. ఇది అత్యంత ముఖ్యమైనది.

Follow Us:
Download App:
  • android
  • ios