Asianet News TeluguAsianet News Telugu

లోన్ తీసుకొని చదువు.. ఉద్యోగం తో అప్పు తీర్చి.. ఆ తర్వాత యూపీఎస్సీ సాధించి..

సివిల్ సర్వీస్ లో మంచి ర్యాంకు సాధించాలనే పట్టుదల ఆమె నరనరాల్లో నాటుకు పోయింది. దాని కోసమే కష్టపడింది. మధ్యలో ఎదురైన సమస్యలన్నింటినీ తెలివిగా పరిష్కరించుకుంటూ ముందుకు సాగింది. చివరకు అనుకున్నది సాధించగలిగింది.

UPSC 523 ranker sathender kaur About his interview
Author
Hyderabad, First Published Oct 25, 2021, 5:15 PM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

యూపీఎస్సీ లో మంచి ర్యాంకు సాధించడం అంత సులువేమీ కాదు. అది కూడా ఓ మహిళ... తన చదువు కోసం చేసిన అప్పులన్నింటినీ తీర్చుకొని.. ఆ తర్వాత.. యూపీఎస్సీ కోసం ప్రిపేర్ అయ్యింది. ఉన్నత స్థాయికి వెళ్లాలి అనుకునేవారందరికీ.. ఈ లూథియానాకు  చెందిన ఈ మహిళ ఆదర్శంగా నిలుస్తుంది. ఆమె పేరు  సతీందర్ కౌర్. బీసీఎం చేసిన వెంటనే ఆమె  యూపీఎస్సీ కోసం కసరత్తు ప్రారంభించారు. అయితే.. మొదటి ప్రయత్నంలో ఆమె అనుకున్నది సాధించలేకపోయారు. ఈలోగా.. చదువు కోసం చేసిన లోన్ తీర్చాల్చి వచ్చింది. 

దాని కోసం ఉద్యోగం చేయడం మొదలుపెట్టింది. ఉద్యోగం చేసి విద్య కోసం చేసిన అప్పులు తీర్చింది. ఆ తర్వాత.. ఆమెకు పెళ్లి జరిగింది. పెళ్లి తర్వాత భర్త ధృవ్ శర్మ ఆమెకు పూర్తి మద్దతుగా నిలిచారు. భర్త మద్దతుతో 2017లొ ఉద్యోగం మానేసి ఆమె మళ్లీ.. యూపీఎస్సీ కోసం  సిద్ధం కావడం మొదలుపెట్టింది. నాలుగో ప్రయత్నంలో 563వ ర్యాంకు సాదించింది.

తాను చదువు కోసం చేసిన లోన్ తీర్చడానికి చాలా కష్టపడిందట. డబ్బు లేక చాలా ఇబ్బందులు పడ్డానని ఆమె చెప్పింది. చిన్నప్పటి నుంచి అమ్మాయిలకు కేవలం బ్యాంకు, టీచర్ ఉద్యోగాలు మాత్రమే సెట్ అవుతాయని ఆమె అందరూ చెబుతూ ఉండేవారట. కానీ అవి ఆమెకు నచ్చలేదు. సివిల్ సర్వీస్ లో మంచి ర్యాంకు సాధించాలనే పట్టుదల ఆమె నరనరాల్లో నాటుకు పోయింది. దాని కోసమే కష్టపడింది. మధ్యలో ఎదురైన సమస్యలన్నింటినీ తెలివిగా పరిష్కరించుకుంటూ ముందుకు సాగింది. చివరకు అనుకున్నది సాధించగలిగింది.

పెళ్లి తర్వాత ఆడపిల్లల కెరీర్ ముగిసిపోతుంది అనడంలో ఎలాంటి నిజం లేదని  సతీందర్ కౌర్ చెబుతున్నారు. ఆమె ఎదుగుదలకు తన భర్త తోడుగా ఉన్నాడని ఆమె గర్వంగా చెబుతోంది. ఆయన మద్దతుతోనే తాను ఇది సాధించగలిగానని ఆమె చెప్పడం గమనార్హం. పెళ్లి తర్వాత తన బాధ్యతలను కూడా తన కెరీర్ కోసం.. తన భర్తే తీసుకున్నాడని ఆమె చెప్పింది. తన విజయం క్రెడిట్ మొత్తం తన భర్తకే ఇస్తానని ఆమె చెప్పడం గమనార్హం.

పెళ్లి తర్వాత 2018లొ ఆమె ప్రిలిమ్స్  రాశారు. అయితే.. అందుులో ఆమె సెలక్ట్ కాలేదు. దీంతో.. ఉద్యోగం మానేసి తప్పు చేశానా అని చాలా డిప్రెషన్ గురయ్యారట. నెలకు రూ.50వేలు జీతం వచ్చే ఉద్యోగాన్ని మానేసి తప్పు చేశానా అని బాధపడ్డారట. కానీ ఇప్పుడు యూపీఎస్సీ 2020లో మంచి ర్యాంకు సాధించిన తర్వాత ఆనందంగా ఉందని చెబుతోంది. మధ్యలో మళ్లీ ఉద్యోగం లో చేరదామా అని అనిపించేందట. మళ్లీ.. గ్యాప్ వచ్చిన తర్వాత మంచి ఉద్యోగం రాదేమో అని వెనకడుగు వేసిందట. కానీ చివరకు తాను సివిల్ సర్వీస్ కొట్టింది.

ఇక ఇంటర్వ్యూలో తనకు ఊహించని ప్రశ్నలు ఎదురయ్యానని ఆమె చెప్పడం గమనార్హం. తన ఇంటర్వ్యూ 30 నిమిషాలపాటు సాగిందని.. అక్కడ ప్రశ్నలు అడిగేవారు దాదాపు 50 నుంచి 60ఏళ్ల అనుభవం కలిగి ఉన్నవారు అని ఆమె చెప్పారు. నిజాయితీతో సమాధానాలు చెబితే.. అనుకున్నది సాధించడం సులువు అవుతుందని  ఆమె చెప్పారు.

ఈ ప్రశ్నలు ఇంటర్వ్యూలో అడిగారు

డేటా కొత్త నూనె, దీని అర్థం ఏమిటి?

చాలా మంది ప్రజల ఆర్థిక వ్యవస్థను చమురు లాగానే నడుపుతుంది. అదేవిధంగా, డేటా భవిష్యత్తులో కొత్త చమురు అవుతుంది. ఇది కొన్ని దేశాల ఆర్థిక వ్యవస్థ యొక్క కెరీర్.

మొత్తం డేటాను ప్రభుత్వంతో పంచుకోవాలా వద్దా?

లేదు, అంతర్గత భద్రత మరియు విదేశీ సంబంధాలకు సంబంధించి రహస్య డేటా ఉన్నట్లుగా. ఆ డేటాను షేర్ చేయకూడదు.

ప్రకటనల వల్ల ప్రయోజనం ఏమిటి, ప్రభుత్వం వైపు నుండి ఎలాంటి సందేశాలు వెళ్తాయి?

ప్రభుత్వం దృష్టి రెండు రకాలు. ఒకటి మీ ప్రేక్షకులతో వారు ఏమి చేస్తున్నారో వారితో కనెక్ట్ అవ్వడం. మీరు పాలసీని తీసుకొచ్చారా లేదా ప్రజలకు తెలుసుకునేలా పథకాన్ని ప్రారంభించారా. రెండవది, ప్రభుత్వం నుండి వచ్చే ప్రకటనలు, స్వచ్ఛ భారత్ అభియాన్ వంటి సామాజిక సందేశాలు ఉన్నాయి.

ప్రైవేట్ రంగానికి లాభం మాత్రమే ఉద్దేశ్యమా?

లాభం ఉంది కానీ సామాజిక సందేశం కూడా ఉంది. కొన్ని సామాజిక సందేశాలపై ప్రకటనలు వస్తాయి. కొన్ని ఉత్పత్తులు సర్రోగేట్ మాధ్యమం ద్వారా ప్రకటనలను అందిస్తాయి. సిగరెట్లు మరియు ఆల్కహాల్ లాగా. ఎవరి లాభం మాత్రమే ఉద్దేశ్యం.

ప్రకటన నమూనా అంటే ఏమిటి?

ప్రతి ప్రకటన చేయడానికి, ముందుగా ఒక వ్యూహం రూపొందించబడింది. అప్పుడు దాని కోసం ఆలోచన అభివృద్ధి చెందుతుంది. దాని ప్రకారం ప్రకటన తయారు చేయబడింది. నాకు మోడల్ గురించి తెలియదు.

మిడిల్ ఈస్ట్‌లో చాలా గందరగోళం ఉంది, చాలా మతాలు ఉన్నాయి, ఆ మతాలు ఎలా కలిసిపోతాయి. వీటిలో ఐక్యత ఎలా వస్తుంది?

చరిత్ర గొప్ప పాఠం నేర్పుతుంది. ప్రతి మతం యొక్క సానుకూల అంశాన్ని మనం హైలైట్ చేయాలి. పూర్వకాలంలో సూఫీ మతం వారధిగా ఉండటంతో, అది చాలా మందిని దేవుడితో అనుసంధానం చేసి, చాలా మందికి విడివిడిగా ప్రాముఖ్యతనిచ్చింది. ప్రవాస భారతీయులు భారతదేశ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటారు.

కష్టాలకు భయపడను

యువత ఏ రంగంలోనైనా కష్టపడి పనిచేయాలని సతీందర్ కౌర్ చెప్పారు. మీరు సివిల్ సర్వీస్‌లో చేరాలని కలలుగన్నట్లయితే మరియు పరీక్షకు సిద్ధమవుతున్నట్లయితే, మీ కలను గుర్తుంచుకోండి మరియు దానిని నెరవేర్చడానికి మీ రెండు వందల శాతం సహకరించండి. ఒక్కసారి ఫెయిల్ అయితే ఈ పరీక్ష మనకే కాదు అని అనిపించకూడదు. ప్రతి పోటీలోనూ ఇబ్బందులు ఉంటాయి. అతనికి భయపడి వదులుకోవద్దు.

Follow Us:
Download App:
  • android
  • ios