Asianet News TeluguAsianet News Telugu

ఎంసెట్‌ అగ్రికల్చర్‌ ఎంట్రన్స్ పరీక్షల తేదీలు విడుదల.. వెంటనే హాల్ టికెట్‌ డౌన్ లోడ్ చేసుకోండీ..

 లాక్‌డౌన్‌ సడలింపులతో తెలంగాణ రాష్ట్రంలో వాయిదా పడ్డ వివిధ ఎంట్రన్స్ పరీక్షల షెడ్యూల్‌ తిరిగి ఖరారు చేశారు. అగ్రికల్చర్ అండ్ మెడికల్ స్ట్రీమ్ కోసం ఎంసెట్‌ పరీక్ష సెప్టెంబర్ 28, సెప్టెంబర్ 29 న నిర్వహించనున్నారు.

ts eamcet 2020 agriculture and medical admitcard out exams on september 28 and 29
Author
Hyderabad, First Published Sep 22, 2020, 12:02 PM IST

కరోనా వైరస్ వ్యాప్తి‌, లాక్‌డౌన్‌ కారణంగా వివిధ ఎంట్రన్స్ పరీక్షలు వాయిదా పడ్డాయి. లాక్‌డౌన్‌ సడలింపులతో తెలంగాణ రాష్ట్రంలో వాయిదా పడ్డ వివిధ ఎంట్రన్స్ పరీక్షల షెడ్యూల్‌ తిరిగి ఖరారు చేశారు. అగ్రికల్చర్ అండ్ మెడికల్ స్ట్రీమ్ కోసం ఎంసెట్‌ పరీక్ష సెప్టెంబర్ 28, సెప్టెంబర్ 29 న నిర్వహించనున్నారు.

ఎంసెట్‌ పరీక్షకు హాజరు కావాల్సిన అభ్యర్థులందరూ హాల్ టికెట్‌ను అధికారిక వెబ్‌సైట్ eacmet.tsche.ac.in నుండి డౌన్‌లోడ్ చేసుకోవాలి. ఇంజనీరింగ్ స్ట్రీమ్ కోసం ఎంసెట్‌ పరీక్ష ఇప్పటికే సెప్టెంబర్ 9, 10, 11, 14 తేదీలలో జరిగాయి.

దీని కోసం జవాబు కీలు కూడా విడుదల చేశారు. తెలంగాణ రాష్ట్రంలో ఇంజనీరింగ్, అగ్రికల్చర్, మెడికల్ (ఫార్మసీ, వెటర్నరీ మొదలైనవి) లో వివిధ ప్రొఫెషనల్ కోర్సుల ఎంట్రన్స్ కోసం  ఈ ఎంసెట్‌ పరీక్ష నిర్వహిస్తారు.

కోవిడ్-19 వ్యాప్తి, లాక్ డౌన్  కారణంగా ఈ సంవత్సరం ఎంట్రన్స్ పరీక్షలను చాలాసార్లు వాయిదా వేయాల్సి వచ్చింది. ఈ సంవత్సరం ఎంసెట్‌ పరీక్షను తెలంగాణ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ (టిఎస్‌సిహెచ్‌ఇ) తరపున జవహర్‌లాల్ నెహ్రూ టెక్నలాజికల్ విశ్వవిద్యాలయం హైదరాబాద్ నిర్వహిస్తోంది. 4

2020-2021 విద్యా సంవత్సరానికి తెలంగాణ రాష్ట్రంలోని విశ్వవిద్యాలయం / ప్రైవేట్ కళాశాలల్లో అందించే వివిధ ప్రొఫెషనల్ కోర్సుల్లో అడ్మిషన్ కోసం ఈ ఎంసెట్‌  ఎంట్రన్స్ పరీక్ష అవసరం.మొత్తం 84 పరీక్ష కేంద్రాల్లో 67 తెలంగాణ, 17 ఏపీ పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు.

మొత్తం 7,970 మంది పరీక్షకు హాజరు కానున్నారు. రెండు రోజులపాటు రెండు సెషన్స్‌లో పరీక్షలు జరగనున్నాయి. 


ఎంసెట్‌  2020 హాల్ టికెట్‌ను డౌన్‌లోడ్ చేయడం ఎలా:
1.టి‌ఎస్  ఎంసెట్‌  అధికారిక వెబ్‌సైట్‌ను ఓపెన్ చేయండి
2.హాల్ టికెట్ ఆక్టివేట్ అయిన తర్వాత దాన్ని డౌన్‌లోడ్ చేయడానికి కనిపించే లింక్‌పై క్లిక్ చేయండి.
3.అవసరమైన వివరాలను ఎంటర్ చేసి సబ్మిట్ పై క్లిక్ చేయండి.
4.తరువాత హాల్ టికెట్ యాక్సెస్ చేసుకోవచ్చు అలాగే ప్రింట్ అవుట్ కూడా తీసుకొవచ్చు.

Follow Us:
Download App:
  • android
  • ios