Asianet News TeluguAsianet News Telugu

ప్రారంభమయిన ఇంటర్మీడియట్‌ పరీక్షలు...నేడు ఫస్ట్ ఇయర్ పరీక్ష...

నేడు ఇంటర్‌ మొదటి సంవత్సరం మొదటి పరీక్ష, రేపు ద్వీతీయ సంవత్సరం మొదటి పరీక్ష జరగనుంది. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్ష నిర్వహించనున్నారు. 

telangana state intermediate exams started from wednesday
Author
Hyderabad, First Published Mar 4, 2020, 11:24 AM IST

హైదరాబాద్‌ : తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఇంటర్మీడియట్‌ పరీక్షలు ప్రారంభమయ్యాయి. నేడు ఇంటర్‌ మొదటి సంవత్సరం మొదటి పరీక్ష, రేపు ద్వీతీయ సంవత్సరం మొదటి పరీక్ష జరగనుంది. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్ష నిర్వహించనున్నారు.

ఇంటర్‌ పరీక్షలకు ప్రథమ, ద్వితీయ సంవత్సరం కలిపి మొత్తం 9 లక్షల 65 వేల 893 మంది విద్యార్థులు ఇంటర్ పరీక్షలకు హాజరుకానున్నారు. ఈ రోజు ఇంటర్‌ ఫస్టియర్‌ పరీక్షకు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 4 లక్షల 80 వేల 516 మంది విద్యార్థులు హాజరౌతున్నారు.

also read  TS EAMCET : ఎంసెట్‌ నోటిఫికేషన్ 2020 విడుదల...వెంటనే అప్లై చేసుకోండీ

ఏదైనా సమస్యలు, ఫిర్యాదుల పరిష్కారానికి అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ప్రతి జిల్లాలో ఇంటర్ విద్యా ఆధికారి కార్యాలయంలో కంట్రోల్ రూమ్ లు ఏర్పాటు చేశారు. అదేవిధంగా ఇంటర్ బోర్డు వెబ్ సైట్ లో బిగ్ ఆర్ఎస్ ద్వారా ఆన్ లైన్ లో ఫిర్యాదులను కూడా స్వీకరించనున్నారు.

హైదరాబాద్ ఇంటర్ బోర్డు కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. కంట్రోల్ రూమ్ నంబర్ 040-24600110 ఫోన్ చేసి కూడా ఫిర్యాదులు తెలియజెయొచ్చు.

ఈ నెంబర్ కు ఉదయం 6 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ఫోన్ చేయొచ్చు. విద్యార్థులు ఒత్తిడికి లోనైతే 73372 25803 నంబర్ కు ఫోన్ చేయాలని సైకలాజిస్టులు సూచించారు.

Follow Us:
Download App:
  • android
  • ios