సైనిక స్కూల్స్ లో ప్రేవేశాలు.. నవంబర్ 19 ధరఖాస్తుల చివరి తేదీ...

 అఖిల భారత సైనిక పాఠశాలల ప్రవేశ పరీక్ష-2021 (ఏఐఎస్‌ఎస్‌ఈఈ)ని వచ్చే ఏడాది జనవరి 10వ తేదీన (ఆదివారం) నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్‌టీఏ) నిర్వహించనుంది.  

sainik schools entrance test for class 6th and 9th  last date november 19

ఢిల్లీ : సైనిక పాఠశాలల్లో ఆరు, తొమ్మిది తరగతుల ప్రవేశాల కోసం అఖిల భారత సైనిక పాఠశాలల ప్రవేశ పరీక్ష-2021 (ఏఐఎస్‌ఎస్‌ఈఈ)ని వచ్చే ఏడాది జనవరి 10వ తేదీన (ఆదివారం) నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్‌టీఏ) నిర్వహించనుంది.

దేశవ్యాప్తంగా ఉన్న 33 సైనిక పాఠశాలల్లోకి ఏఐఎస్‌ఎస్‌ఈఈ ద్వారా ప్రవేశాలు ఉంటాయి. గత నెల 20వ తేదీన ప్రారంభమైన దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ఈ నెల 19వ తేదీతో ముగుస్తుంది.

అధికారిక వెబ్ సైట్ https://aissee.nta.nic.inలో వివరాలు నమోదు చేసుకున్న తర్వాత అభ్యర్థులు దరఖాస్తును పంపాలి. ఎన్‌టీఏ వెబ్‌సైట్‌ www.nta.ac.inలోనూ దీనికి సంబంధించి పూర్తి వివరాలను చూడవచ్చు.

2021-22 విద్యా సంవత్సరం నుంచి ఓబీసీ-ఎన్‌సీఎల్‌ కేటగిరీ కింద కూడా ప్రవేశాలు కల్పిస్తున్నారు. మొత్తం 33 సైనిక పాఠశాలల్లో ఆరవ తరగతిలోకి బాలికలకు కూడా ప్రవేశాలు కల్పిస్తున్నారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios