Asianet News TeluguAsianet News Telugu

ఓ.యూ డిస్టన్స్ ఎడ్యుకేషన్(2020-21) నోటిఫికేష‌న్ విడుద‌ల‌.. వెంటనే అప్లై చేసుకోండీ..

ఉస్మానియా యూనివర్సిటీలో డిగ్రీ, పీజీ కోర్సుల‌తో పాటు పీజీ డిప్లొమా కోర్సుల కోసం దూర‌విద్యా  చేయాల‌నుకునేవారి కోసం ఎడ్యుకేషన్ నోటిఫికేష‌న్ ప్ర‌వేశాల‌కు బీఏ, బీకామ్‌, బీబీఏ, ఎంబీఏ, ఎసీఏ, ఎంఏ, ఎమ్మెస్సీ, డిప్లొమా కోర్సులు అందుబాటులో ఉన్నాయి. 

osmania distance education admission 2020 21 notification released apply now
Author
Hyderabad, First Published Jul 29, 2020, 1:02 PM IST

హైద‌రాబాద్‌: ప్రొఫెసర్. జీ రాంరెడ్డి సెంట‌ర్ ఫ‌ర్ డిస్టెన్స్ ఎడ్యుకేష‌న్‌ (20-21) నోటిఫి‌కేష‌న్ విడుద‌ల చేసింది. ఉస్మానియా యూనివర్సిటీలో డిగ్రీ, పీజీ కోర్సుల‌తో పాటు పీజీ డిప్లొమా కోర్సుల కోసం దూర‌విద్యా  చేయాల‌నుకునేవారి కోసం ఎడ్యుకేషన్ నోటిఫికేష‌న్ ప్ర‌వేశాల‌కు బీఏ, బీకామ్‌, బీబీఏ, ఎంబీఏ, ఎసీఏ, ఎంఏ, ఎమ్మెస్సీ, డిప్లొమా కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ద‌ర‌ఖాస్తు  ప్ర‌క్రియ ఆగ‌స్టు 1న ప్రారంభ‌మ‌వుతుంద‌ని, చివరి తేదీ అక్టోబ‌ర్ 31 వ‌ర‌కు అప్ల‌య్ చేసుకోవ‌చ్చ‌ని తెలిపింది.

 పి‌జి  కోర్సులు: ఎంబీఏ (రెండేండ్లు), ఎంబీఏ (మూడేండ్లు) 

అర్హ‌త‌: డిగ్రీ తప్పని సరి పూర్తి చేసి ఉండాలి. అదేవిధంగా టీఎస్ఐసెట్ లేదా ఏపీఐసెట్‌లో అర్హ‌త సాధించి ఉండాలి. లేదా పీజీఆర్ఆర్‌సీడీఈ నిర్వ‌హించిన‌ ప్ర‌వేశ ప‌రీక్ష ఉత్తీర్ణులై ఉండాలి.

ఎం.ఏ, ఎం.కాం‌, ఎం.ఎస్‌సి

ఎం.ఏలో ఫిలాస‌ఫీ, సోషియాల‌జీ, ప‌బ్లిక్ ప‌ర్స‌న‌ల్ మేనేజ్‌మెంట్‌, ప‌బ్లిక్ అడ్మినిస్ట్రేష‌న్స్ కోర్సులు ఉన్నాయి.

ఎంఏ లాంగ్వేజెస్ లో ఉర్దూ, హిందీ, తెలుగు, సంస్కృతం, ఇంగ్లిష్‌


ఎంఏ ఎక‌నామిక్స్‌, పొలిటిక‌ల్ సైన్స్‌, చ‌రిత్ర‌, సైకాల‌జీ 

అర్హ‌త‌: స‌ంబంధిత స‌బ్జెక్ట్‌లో డిగ్రీ తప్పని సరి పూర్తిచేసి ఉండాలి. 

also read  ఇంజనీరింగ్ కాలేజీల్లో కొత్త కోర్సులు.. ...


ఎం.కాం‌, ఎం.ఎస్‌సి (మ్యాథ‌మెటిక్స్‌), ఎం.ఎస్‌సి (స్టాటి‌స్టిక్స్‌)

అర్హ‌త‌: స‌ంబంధిత స‌బ్జెక్టులో డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. 

బీఏ అర్హ‌త‌: ఇంట‌ర్‌లో ఉత్తీర్ణులై ఉండాలి.

బీఏ- మ్యాథ‌మెటిక్స్ అండ్ స్టాటిస్టిక్స్‌ అర్హ‌త‌: ఇంట‌ర్‌లో మ్యాథ్స్ ఒక ఆప్ష‌న‌ల్ సబ్జెక్టుగా తప్పని చ‌దివి ఉండాలి.

బీ.కాం (జ‌న‌ర‌ల్‌)- ఇంట‌ర్ పూర్తిచేసి ఉండాలి. 

పీ.జీ డిప్లొమా- మ్యాథ‌మెటిక్స్‌, ఇంగ్లిష్ లాంగ్వేజ్ టీచింగ్‌, బిజినెస్ మేనేజ్‌మెంట్‌, బ‌యో ఇన్ఫ‌ర్మాటిక్స్‌, కంప్యూట‌ర్ అప్లికేష‌న్స్‌

అర్హ‌త‌లు: డిగ్రీ పూర్తి చేసి ఉండాలి.  

బ‌యో ఇన్ఫ‌ర్మాటిక్స్ కోర్సు కోసం బి‌ఎస్‌సి , ఎం‌ఎస్‌సి, బి‌ఎస్‌సి అగ్రిక‌ల్చ‌ర్‌, బీ.ఫార్మ‌సీ, బీవీఎస్‌సి, ఎంబీబీఎస్‌, బీడీఎస్‌, బీఏఎంఎస్‌, బీయూఎంఎస్‌, బీహెచ్ఎమ్మెస్‌, బీఈ కోర్సులో 50 శాతం మార్కులు సాధించి ఉండాలి. 

ఆన్‌లైన్‌ విధానంలో ద‌ర‌ఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

మరింత సమాచారం కోసం అధికారిక వెబ్‌సైట్‌: www.oucde.net చూడండి.

Follow Us:
Download App:
  • android
  • ios