కరోనా వైర‌స్ ఈ పేరు వింటేనే ప్రజలు భయపడుతున్నారు. అగ్రదేశాలతో సహ ఎన్నో దేశాలలో ఈ కరోనా వైరస్ సోకి లక్షల మంది మృత్యువాత పడ్డారు. అత్యధిక మంది ఈ వైరస్ బారిన పడి చికిత్స పొందుతునారు. భారత దేశంలో అన్నీ రంగాలని దెబ్బ తీసింది.

కరోనా వైరస్ వ్యాప్తి నియంత్ర‌ణ కోసం దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ అమల్లో ఉన్నవిద్యా రంగం, విద్యార్ధులపై మరింత ప్రభావం చూపెడుతుంది. ఈ నేప‌థ్యంలో సీబీఎస్‌ఈ బోర్డు కీలక నిర్ణయం తీసుకున్న‌ట్లు తెలుస్తోంది. పెండింగ్‌లో ఉన్న టెన్త్‌ క్లాస్ పరీక్షలను రద్దు చేస్తున్నట్టు ప్ర‌క‌టించింద‌ని ప‌లు జాతీయ మీడియా చానెళ్ల‌లో వార్త‌లు వ‌స్తున్నాయి.

వాస్త‌వానికి దేశ‌మంతట సీబీఎస్ఈ ప‌దో త‌ర‌గ‌తి ప‌రీక్ష‌లు కరోనా వైరస్ వల్ల లాక్ డౌన్ కు ముందే పూర్త‌యిపోయాయి. అయితే ఈ ప‌రీక్ష‌లు జ‌రుగుతున్న స‌మ‌యంలోనే ఢిల్లీలోని కొన్ని ప్రాంతాల్లో సీఏఏ నిర‌స‌న‌ల సంద‌ర్భంగా అల్ల‌ర్లు జ‌రిగాయి.

ఆ స‌మ‌యంలో తీవ్ర‌మైన హింస చెల‌రేగి దాదాపు 40 మందికి పైగా మ‌ర‌ణించారు. దీంతో ఈశాన్య ఢిల్లీలో సీబీఎస్ఈ ప‌రీక్ష‌లు కొన్ని వాయిదా పడ్డాయి. ప్రస్తుతం యధాతధంగా సాగుతున్న అన్ని ప‌రీక్ష‌లు ముగిశాక వాయిదా పడ్డ పరీక్షలు తిరిగి నిర్వహించాలని బోర్డు భావించిన‌ప్ప‌టికీ ఆ స‌మ‌యానికే దేశంలో క‌రోనా కేసులు పెర‌గ‌డంతో కేంద్ర ప్ర‌భుత్వం లాక్ డౌన్ విధించింది.

దీంతో ఆ ప‌రీక్ష‌లతో పాటు దేశ వ్యాప్తంగా 12వ త‌ర‌గ‌తి ప‌రీక్ష‌లు కూడా కొన్ని వాయిదా ప‌డుతూ వ‌చ్చాయి. లాక్ డౌన్ ముగిశాక వాయిదా పడ్డ స‌బ్జెక్టుల‌ ప‌రీక్ష‌లు నిర్వ‌హిస్తామ‌ని గ‌తంలో సీబీఎస్ఈ అధికారులు చెప్పారు. అయితే ప్ర‌స్తుతం లాక్ డౌన్ పొడిగింపు వల్ల నెల‌కొన్న ప‌రిస్థితులలో పెండింగ్ లో ఉన్న టెన్త్ ప‌రీక్ష‌ల‌ను పూర్తిగా ర‌ద్దు చేసిన్న‌ట్లు తెలుస్తోంది. దీని పై అధికారికంగా ప్రకటన వెల్లడించాల్సి ఉంది.