ఇంజనీరింగ్ కాలేజీల్లో కొత్త కోర్సులు..
టెక్నాలజికి ఉన్న ప్రాముఖ్యత వల్ల కొన్ని కొత్త మార్పులు రాబోతున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక డిమాండ్ ఉండే కోర్సులను ప్రవేశపెట్టేందుకు ఏఐసీటీఈ, జేఎన్‌టీయూ ముందుకొస్తున్నాయి.
టెక్నాలజి రోజు రోజుకి విస్తృతంగా అభివృద్ది చెందుతుంది. టెక్నాలజికి ఉన్న ప్రాముఖ్యత వల్ల కొన్ని కొత్త మార్పులు రాబోతున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక డిమాండ్ ఉండే కోర్సులను ప్రవేశపెట్టేందుకు ఏఐసీటీఈ, జేఎన్‌టీయూ ముందుకొస్తున్నాయి.
ప్రధానంగా డేటా సైన్స్, అర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ), రోబోటిక్ టెక్నాలజీ, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్(ఐవోటీ) వంటి టెక్నాలజీ కోర్సులకు భారీ డిమాండ్ ఏర్పడుతోంది. దీంతో వివిధ విద్యా సంస్థలు కూడా వీటి నిర్వహణకు సిద్దం అవుతున్నాయి.
ఒక్క సీటు అదనంగా కేటాయించేందుకు కూడా ఇష్టపడని ఏఐసీటీఈ మొత్తం సీట్లలో కోర్సులు మార్చుకునే వెసులుబాటు కాలేజీలకే ఇచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా ఎలక్ట్రికల్, సివిల్, మెకానికల్ కోర్సులను పలు కాలేజీలు పూర్తిగా, కొన్ని కాలేజీలు 50 శాతం వరకూ రద్దు చేసుకున్నాయి.
also read బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్(బిఎస్ఎఫ్)2020 నోటిఫికేషన్ విడుదల .. వెంటనే అప్లయి చేసుకోండీ.. ...
ఏఐసీటీఈ తాజా నిర్ణయంతో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 204 ఇంజనీరింగ్ కళాశాలల్లో దాదాపు 17 వేలకు పైగా సీట్లు సీఎస్ ఎమర్జింగ్ టెక్నాలజీ కోర్సుల్లో మార్చుకునేందుకు ఏఐసీటీఐకి దరఖాస్తు చేసుకుని అనుమతులు కూడా పొందాయి. ఈ ఏడాదిలో కొత్తగా 5 ప్రైవేట్ వర్సిటీలను తెలంగాణలో ప్రారంభించారు.
వీటిలో మేడ్చల్ జిల్లాలోని మల్లారెడ్డి వర్సిటీ, అనురాగ్ వర్సిటీ, వరంగల్ ఎస్‌ఆర్, హైదరాబాద్‌లోని మహీంద్ర, మెదక్‌లోని ఓక్సిన్ వర్సిటీలు ఉన్నాయి. ఈ విద్యాసంవత్సరంలో ఇవి అందించే ఇంజినీరింగ్ కోర్సుల్లో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్ అండ్ యానిమేషన్, బిజినెస్ సిస్టమ్స్, ఐవోటీ లాంటి ఎమర్జింగ్ టెక్నాలజీ కోర్సులు ఉండటం విశేషం.