Asianet News TeluguAsianet News Telugu

నీట్ పీజీ, ఎం‌డి‌ఎస్ స‌హా వివిధ ప‌రీక్ష‌ల తేదీల‌ను ప్ర‌క‌టించిన నేషనల్ బోర్డ్..

వ‌చ్చే విద్యా సంవ‌త్సారినికి సంబంధించిన ఈ ప్ర‌వేశ‌ ప‌రీక్ష‌లు డిసెంబ‌ర్ 4న ప్రారంభ‌మై 2021, జ‌న‌వ‌రి 28న ముగుస్తాయి. ప్రవేశ పరీక్షలు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (సిబిటి) మోడ్‌లో నిర్వహించనున్నారు.

NBE announces NEET PG, MDS, DNB PDCET 2021, FMGE Dec 2020 exam dates  check details here
Author
Hyderabad, First Published Sep 17, 2020, 4:13 PM IST

న్యూ ఢీల్లీ: ఫారిన్ మెడికల్ గ్రాడ్యుయేట్స్ ఎగ్జామినేషన్ (ఎఫ్‌ఎమ్‌జిఇ) 2020, డిఎన్‌బి పోస్ట్ డిప్లొమా సెంట్రలైజ్డ్ ఎంట్రన్స్ టెస్ట్ (పిడిసిఇటి) 2021, కోసం నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ పరీక్ష తేదీలను నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ విడుదల చేసింది. 7

వ‌చ్చే విద్యా సంవ‌త్సారినికి సంబంధించిన ఈ ప్ర‌వేశ‌ ప‌రీక్ష‌లు డిసెంబ‌ర్ 4న ప్రారంభ‌మై 2021, జ‌న‌వ‌రి 28న ముగుస్తాయి. ప్రవేశ పరీక్షలు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (సిబిటి) మోడ్‌లో నిర్వహించనున్నారు.

ఎఫ్ఎంజీఈ ప‌రీక్ష‌ను ఏడాదకి రెండు సార్లు నిర్వ‌హిస్తారు. ప్ర‌తిఏడాది జూన్‌లో ఒక‌సారి, డిసెంబ‌ర్‌లో మ‌రోసారి నిర్వ‌హిస్తారు. 

ఎన్‌బిఇ విడుదల చేసిన పరీక్షా తేదీలు

ఎఫ్‌ఎమ్‌జిఇ  పరీక్ష తేదీ 4 డిసెంబర్ 2020
నీట్ పిజి 2021 పరీక్ష తేదీ జనవరి 10 జనవరి 2021
నీట్ ఎం‌డి‌ఎస్ పరీక్ష తేదీ  16 డిసెంబర్ 2020, 
డీఎన్‌బీ పీడీసెట్  పరీక్ష తేదీ 28 జనవరి  2021

also read  ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖలో భారీగా ఉద్యోగాలు: డిగ్రీ/డిప్లొమా అర్హత ఉంటే చాలు.. ...

ఎఫ్‌ఎమ్‌జిఇ  2020 డిసెంబర్ సెషన్ గురించి
విదేశీ వైద్య గ్రాడ్యుయేట్లు దేశంలో ప్రాక్టీస్ చేయడానికి మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఎంసిఐ) లేదా ఏదైనా రాష్ట్ర వైద్య మండలితో తాత్కాలిక లేదా శాశ్వత రిజిస్ట్రేషన్ పొందటానికి సంవత్సరానికి రెండుసార్లు, జూన్ మరియు డిసెంబర్లలో ఎఫ్‌ఎమ్‌జిఇ నిర్వహిస్తారు.

నీట్ పిజి, ఎండిఎస్ 2021 గురించి
నీట్ పీజీ ప్ర‌వేశ ప‌రీక్ష ద్వారా దేశంలోని 6102 మెడిక‌ల్ కాలేజీల్లో 10,821 మాస్టర్ ఆఫ్ సర్జరీ (ఎంఎస్) సీట్లు, 19,953 డాక్టర్ ఆఫ్ మెడిసిన్ (ఎండి) సీట్లు, 1,979 పిజి డిప్లొమా సీట్ల‌ను భ‌ర్తీ చేస్తారు.అయితే, నీట్ ఎండిఎస్ ఆధారంగా మొత్తం 6,501 సీట్లలో 50% ఆల్ ఇండియా కోటా (AIQ), 50% స్టేట్ కోటా, సెంట్రల్ విశ్వవిద్యాలయాలలో  భ‌ర్తీ చేసుకుంటాయి.

డీఎన్‌బీ పీడీసెట్ 2021 పరీక్ష గురించి
 భారతదేశంలోని 597 ఆసుపత్రులలో 1073 సీట్లలో ప్రవేశానికి ఎన్‌బిఇ డిఎన్‌బి పిడిసిఇటి 2021 పరీక్షను నిర్వహిస్తుంది. డీఎన్‌బీ పీడీసెట్ 2021 ప్రవేశ పరీక్ష తరువాత రోల్ నంబర్, మార్కులు, ర్యాంకులు, అర్హత స్టేటస్ పేర్కొంటూ మెరిట్ జాబితా తయారు చేస్తారు. పైన పేర్కొన్న పరీక్షల అధికారిక బ్రోచర్ ఎన్‌బి‌ఈ నిర్ణీత సమయంలో nbe.edu.in లో విడుదల చేస్తుంది.  

పూర్తి వివ‌రాల‌కు వెబ్‌సైట్‌: natboard.edu.in

Follow Us:
Download App:
  • android
  • ios