Asianet News TeluguAsianet News Telugu

ఇంటర్‌ అర్హతతో ఇండియన్ నేవీలో ఉద్యోగాలు.. దరఖాస్తు ఎలా చేసుకోవాలంటే..!

పెళ్లి కానీ పురుష అభ్య‌ర్థులకు నుండి ఇండియన్ నేవీ క్యాడెట్ ఎంట్రీ స్కీమ్ కింద ఎజిమళ (కేరళ) నేవల్ అకాడమీ దరఖాస్తులు ఆహ్వానిస్తున్నది. భార‌త నౌకా ద‌ళం క్యాడెట్ ఎంట్రీ స్కీమ్‌లో భాగంగా నాలుగేళ్ల బీటెక్ (10+2) కోర్సులో ప్ర‌వేశాల‌కు నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. 

indian navy recruitment 2020 released apply online for b-tech cadet entry scheme 2021
Author
Hyderabad, First Published Sep 24, 2020, 2:28 PM IST

ఇండియన్ నేవీలో నిరుద్యోగులకు ఉద్యోగావకాశం. పెళ్లి కానీ పురుష అభ్య‌ర్థులకు నుండి ఇండియన్ నేవీ క్యాడెట్ ఎంట్రీ స్కీమ్ కింద ఎజిమళ (కేరళ) నేవల్ అకాడమీ దరఖాస్తులు ఆహ్వానిస్తున్నది. భార‌త నౌకా ద‌ళం క్యాడెట్ ఎంట్రీ స్కీమ్‌లో భాగంగా నాలుగేళ్ల బీటెక్ (10+2) కోర్సులో ప్ర‌వేశాల‌కు నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది.

జేఈఈ మెయిన్ రాసిన అభ్య‌ర్థులు ఇండియన్ నేవీలో ఉద్యోగాల కోసం ద‌ర‌ఖాస్తు చేసుకోవచ్చు. ఎంపికైన అభ్యర్థులకు బీటెక్ డిగ్రీతోపాటు ఉద్యోగం కూడా కల్పిస్తారు. ద‌ర‌ఖాస్తు ప్రక్రియ అక్టోబర్‌ 6 నుంచి ప్రారంభ‌మ‌వుతాయి.

ఎంపికైన అభ్య‌ర్థుల‌ను కోర్సు పూర్త‌యిన త‌ర్వాత ఎడ్యుకేష‌న్‌, ఎగ్జిక్యూటివ్, టెక్నిక‌ల్ బ్రాంచీలకు పంపిస్తారు. ఆసక్తి గల అభ్యర్థులు పూర్తి వివరాల కోసం https://www.joinindiannavy.gov.in/ వెబ్‌సైట్‌ చూడొచ్చు.


ఇండియన్ నేవీలో ఉన్న మొత్తం ఖాళీ పోస్టులు: 34
ఎడ్యుకేష‌న్ బ్రాంచీ- 5
ఎగ్జిక్యూటివ్ అండ్ టెక్నిక‌ల్ బ్రాంచీ- 29
ఉండాల్సిన అర్హత: 70శాతం మార్కులతో ఇంటర్ (ఇంగ్లిష్, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ) ఉత్తీర్ణతతో పాటు జేఈఈ మెయిన్-2020కు హాజరై ఉండాలి. నిర్దేశించిన శారీరక ప్రమాణాలు తప్పని సరి ఉండాలి.
అభ్యర్ధుల వయసు: 02 జులై 2001 నుంచి 01 జనవరి 2004 మధ్య జన్మించి ఉండాలి.
అభ్యర్ధుల ఎంపిక: జేఈఈ మెయిన్ ఆల్ ఇండియా ర్యాంకు ఆధారంగా ఎస్ఎస్‌బీ ఇంట‌ర్వ్యూకి పిలుస్తారు.
దరఖాస్తు చేసుకునే విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు ప్రారంభ తేదీ: అక్టోబర్‌ 06, 2020
దరఖాస్తు చివరి తేది: అక్టోబర్‌ 20, 2020
అధికారిక వెబ్‌సైట్‌: https://www.joinindiannavy.gov.in/

Follow Us:
Download App:
  • android
  • ios