ఐసిఏఆర్-ఏఐఈఈఏ 2020 పరీక్షల తేదీలను ప్రకటించిన ఎన్‌టీఏ..
ఢీల్లీ యునివర్సిటి ప్రవేశ పరీక్ష, ఐపిఎంఎటి, ఎన్‌ఆర్‌టిఐ పరీక్షలు ఒకే తేదీన ఉండటం వలన ఎన్‌సిఎ అధికారిక నోటిఫికేషన్ ప్రకారం ఐసిఎఆర్ ఎఇఇఇఎ-యుజి పరీక్షలు వాయిదా పడింది.
నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టిఎ) ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ (ఐసిఎఆర్) ఎఐఇఇఎ అండర్ గ్రాడ్యూయేట్ పరీక్షలను వాయిదా వేసిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఎన్‌టిఎ అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్, పిహెచ్‌డి పరీక్షల సవరించిన పరీక్షల షెడ్యూల్‌ను విడుదల చేసింది.
ఢీల్లీ యునివర్సిటి ప్రవేశ పరీక్ష, ఐపిఎంఎటి, ఎన్‌ఆర్‌టిఐ పరీక్షలు ఒకే తేదీన ఉండటం వలన ఎన్‌సిఎ అధికారిక నోటిఫికేషన్ ప్రకారం ఐసిఎఆర్ ఎఇఇఇఎ-యుజి పరీక్షలు వాయిదా పడింది.
సెప్టెంబర్ 7, 8 తేదీలలో షెడ్యూల్ చేసిన యుజి పరీక్షలను ఇప్పుడు 16, 17, 22 తేదీలలో నిర్వహించనున్నారు. పిజి, పిహెచ్‌డి పరీక్షలను సెప్టెంబర్ 23న నిర్వహిస్తారు.
ఆల్ ఇండియా ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ ఫర్ అడ్మిషన్ (AIEEA) - UG 2020 సెప్టెంబర్ 16, 17, 22 తేదీలలో జరుగుతుంది, ఆల్ ఇండియా ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ ఫర్ అడ్మిషన్ (AIEEA) - PG 2020, ఆల్ ఇండియా కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ (AICE) –JRF / SRF (పీహెచ్‌డీ) 2020 సెప్టెంబర్ 23న జరుగుతుంది.
నోటిఫికేషన్ ప్రకారం అభ్యర్థులు తాజా అప్ డేట్ కోసం www.nta.ac.in ఇంకా https://icar.nta.nic.in వెబ్‌సైట్‌లను సందర్శించాలని సూచించారు. పరీక్షకు సంబంధించిన ఏవైనా వివరణల కోసం అభ్యర్థులు 8287471852, 8178359845, 9650173668, 9599676953, 8882356803 ఫోన్ చేయవచ్చు లేదా icar@nta.ac.in కి మెయిల్ చేయాలని కోరారు.
ఈ పరీక్షలకు అడ్మిట్ కార్డులు పరీక్షల తేదీకి 10 రోజుల ముందు విడుదల చేయనున్నారు. అభ్యర్థులు తమ అడ్మిట్ కార్డులను ఆన్‌లైన్‌లో icar.nta.nic.in లేదా nta.ac.in లో డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.