న్యూ ఢీల్లీ: ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ బాంబే లేదా ఐఐటి బాంబే, గేట్ 2021 పరీక్ష బ్రౌచర్ ఆగస్టు 7న అధికారిక వెబ్‌సైట్ gate.iitb.ac.in.లో విడుదల చేసింది.

గేట్ 2021 పరీక్షా కొత్త బ్రోచర్‌లో వివిధ మార్పులు చేసింది, కొన్ని పరీక్షా నగరాలను అదనంగా చేర్చడం తొలగించడం చేసింది. ఇంతకుముందు గేట్ 2021  అర్హత ప్రమాణాల సడలింపు, క్వ‌శ్చన్స్‌ పేపర్ చేరికకు సంబంధించిన మార్పులను ప్రకటించింది.


పరీక్షా విధానంలో మార్పులు
గేట్ 2021లో, కొత్త‌గా మ‌ల్టిపుల్ ప్రశ్నలకు సమాధానం ఇవ్వాలి.ఇప్ప‌టివ‌ర‌కు ఉన్న మ‌ల్టిపుల్ చాయిస్ ప్ర‌శ్న‌లు (ఎంసీక్యూ), న్యూమ‌రిక‌ల‌ర్ ఆన్స‌ర్‌టైప్ ప్ర‌శ్న‌ల‌కు (ఎన్ఏటీ)  తోడు కొత్త‌గా బ‌హుళ ఎంపిక‌ ప్ర‌శ్న‌ల‌ను జ‌త‌చేసింది. వీట‌న్నింటికి అభ్య‌ర్థులు స‌మాధానాలు రాయాల్సి ఉంటుంది. 

మార్కుల విభజన ఈ క్రింది విధంగా ఉంటుంది:

స‌బ్జెక్ట్  ప్రశ్నలు - 72 మార్కులు

also read బీటెక్‌ అర్హతతో ఐ‌టి‌ఐ లిమిటెడ్ లో ఉద్యోగాలు.. వెంటనే అప్లయ్ చేసుకోండీ.. ...

జనరల్ ఆప్టిట్యూడ్ - 15 మార్కులు

ఇంజనీరింగ్ మ్యాత్స్ - 13 మార్కులు

గేట్ 2021- ఝాన్సీ  (ఐఐటి కాన్పూర్), ధెంకనాల్ (ఐఐటి ఖరగ్పూర్), చంద్రపూర్ (ఐఐటి బొంబాయి) , ముజఫర్ నగర్ (ఐఐటి రూర్కీ) కోసం కొన్ని పరీక్షా నగరాలు చేర్చింది. కాగా పాల (ఐఐటి మద్రాస్) ను జాబితా నుండి తొలగించారు. మొత్తం 195 భారతీయ పరీక్షా నగరాలు ఉన్నాయి. విదేశాల్లోని 5 సెంట‌ర్ల‌లో  ఆన్‌లైన్ ప‌రీక్ష‌ను నిర్వ‌హించ‌నున్నారు. కాగా, క‌రోనా నేప‌థ్యంలో విదేశాల్లోని కొన్ని ప‌రీక్ష‌ కేంద్రాల‌ను తొల‌గించే అవ‌కాశం ఉన్న‌ది. 


గేట్ 2021 కంప్యూటర్ ఆధారిత పరీక్షగా ఫిబ్రవరి 5 నుండి 7 వరకు, 12 నుండి 14 వరకు జరుగుతుంది. గేట్ 2021 కోసం రిజిస్ట్రేషన్లు సెప్టెంబర్ 14, 2020 నుండి ప్రారంభమవుతాయి. ఎం.టెక్ ప్రవేశాలు, పిఎస్‌యు నియామకాలకు విద్యార్థులు గేట్ స్కోర్‌లను ఉపయోగిస్తారు.