న్యూఢిల్లీ: సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్లాస్టిక్స్ ఇంజనీరింగ్ & టెక్నాలజీ(సి‌ఐ‌పి‌ఈ‌టి) కాలేజీల్లో డిప్లొమా, పోస్ట్ డిప్లొమా, పీజీ డిప్లొమా కోర్సుల్లో ప్ర‌వేశాల కోసం నిర్వ‌హించే సీపెట్ జేఈఈ అడ్మిట్ కార్డుల‌ను సీపెట్‌ అన్‌లైన్‌ ద్వారా అందుబాటులోకి తీసుకొచ్చింది.

సి‌ఐ‌పి‌ఈ‌టి కేంద్ర పెట్రోలియం, ఫెర్టిలైజ‌ర్‌ శాఖ ఆధ్వ‌ర్యంలో ప‌నిచేస్తుంది. దేశవ్యాప్తంగా 27 సి‌ఐ‌పి‌ఈ‌టి కేంద్రాలు ఉన్నాయి. ఈ కంప్యూట‌ర్ ఆధారిత పరీక్ష‌ ఆగ‌స్టు 5న నిర్వహించనున్నారు.

also read ఓ.యూ డిస్టన్స్ ఎడ్యుకేషన్(2020-21) నోటిఫికేష‌న్ విడుద‌ల‌.. వెంటనే అప్లై చేసుకోండీ.. ...

దీనికి సంబంధించి  ప‌రీక్ష కేంద్రం, స‌మ‌యం వంటి వివ‌రాల‌ను అడ్మిట్ కార్డులో పొందుప‌ర్చిన‌ట్లు తెలిపారు. సి‌ఐ‌పి‌ఈ‌టి ప‌రీక్ష‌ కోసం ద‌ర‌ఖాస్తు చేసిన అభ్య‌ర్థులు అధికారిక వెబ్‌సైట్ eadmission.cipet.gov.in సందర్శించి అడ్మిట్ కార్డులు డౌన్‌లోడ్ చేసుకోవ‌చ్చ‌ని వెల్ల‌డించింది.

పరీక్షలో ఎంపికైన అభ్య‌ర్థుల జాబితాను ఆగ‌స్టు 8న వెబ్‌సైట్ లో లిస్ట్ పెట్టనున్నారు.