T-seva కేంద్రాల ఏర్పాటుకు దరఖాస్తుల ఆహ్వానం

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా టీ సేవ(t seva) ఆన్‌లైన్ కేంద్రాలు ఏర్పాటు చేసుకునేందుకు అర్హులైన ఆసక్తిగల అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు టీ సేవ డైరెక్టర్ అడపా వెంకట్ రెడ్డి తెలిపారు. ఏప్రిల్ 30లోగా అభ్యర్థులు దరఖాస్తులు చేసుకోవాలని కోరారు.

applications invited for T Seva centres

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా టీ సేవ(t seva) ఆన్‌లైన్ కేంద్రాలు ఏర్పాటు చేసుకునేందుకు అర్హులైన ఆసక్తిగల అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు టీ సేవ డైరెక్టర్ అడపా వెంకట్ రెడ్డి తెలిపారు. ఏప్రిల్ 30లోగా అభ్యర్థులు దరఖాస్తులు చేసుకోవాలని కోరారు.

స్వర్ణ తెలంగాణ స్వయం ఉపాధి పథకం కింద దరఖాస్తు చేసుకునే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళా అభ్యర్థులకు రిజిస్ట్రేషన్ ఫీజులో 25శాతం రాయితీ ఇవ్వనున్నారు. దరఖాస్తు ఫారాల కోసం ఫోన్ నెంబర్లు 8179955744, 9505800050 నెంబర్లను సంప్రదించవచ్చు. 

నిరుద్యోగ యువకులు స్వయం ఉపాధి పొందేందుకు తెలంగాణ ప్రభుత్వం టీ సేవ కేంద్రాలను అందుబాటులోకి తెచ్చింది. టీ సేవ ఆన్ లైన్ కేంద్రాలు ఏర్పాటు చేసుకుని ఉపాధి పొందేందుకు ఆసక్తిగల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. 

మరిన్ని వివరాల కోసం http://www.tsevacentre.com/ను సంప్రదించవచ్చు. కాగా, టీ సేవ ద్వారా వినియోగదారులకు బస్, ట్రైన్ టికెట్లు బుక్ చేయడం, బిల్లులు కట్టడం వంటి సేవలను అందించవచ్చు.
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios