ఎయిమ్స్‌ పీజీ అడ్మిట్‌ కార్డు2020 విడుదల..

ప్రతి సంవత్సరంలగానే, ఎయిమ్స్ ఎంట్రన్స్ ఎగ్జామ్ 2020 అడ్మిట్ కార్డులు ఎయిమ్స్ ఇన్స్టిట్యూట్ ద్వారా ఆన్‌లైన్ లో విద్యార్థులకు అందుబాటులో ఉంచారు. కరోనా వైరస్  ప్రస్తుత పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని  చర్యలు తీసుకుంటున్నారు. విద్యార్థులు తమ హాల్ టిక్కెట్లను సులభంగా డౌన్‌లోడ్ చేసుకోవడానికి అధికారిక వెబ్‌సైట్‌ aiimsexams.org నుంచి అడ్మిట్‌కార్డులను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని ప్రకటించింది. 

aiims pd entrance exams admitcards  2020 released to download click here

హైదరాబాద్‌: ఎయిమ్స్ పిజి అడ్మిట్ కార్డ్ 2020 తాజా అప్ డేట్ ప్రకారం, ఎయిమ్స్ అధికారికంగా పిజి ఎంట్రన్స్ ఎగ్జామ్ 2020 అడ్మిట్ కార్డులను విడుదల చేసింది.దేశంలో అత్యున్నత వైద్య విజ్ఞాన సంస్థ అయిన ఎయిమ్స్‌లో పీజీ కోర్సుల్లో సీట్ల భర్తీ కోసం నిర్వహించే ఎంట్రన్స్ పరీక్షకు సంబంధించిన అడ్మిట్‌కార్డులను రిలీజ్ చేసింది.

అంతకుముందు నోటిఫికేషన్ ప్రకారం ఎయిమ్స్ ఎంట్రన్స్ ఎగ్జామ్ 2020 హాల్ టిక్కెట్లు జూన్ 3 న సాయంత్రం 5 గంటలకు విడుదల చేయాల్సి ఉంది కానీ రెండు రోజులు ఆలస్యం అయ్యింది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న వివరాల ప్రకారం పిజి ఎంట్రన్స్ ఎగ్జామ్ కోసం అడ్మిట్ కార్డులను ఇన్స్టిట్యూట్ ఆన్‌లైన్ ద్వారా aiimsexam.org వెబ్‌సైట్‌లో విడుదల చేసింది.

హాల్ టిక్కెట్లు డౌన్‌లోడ్ లింక్ ద్వారా డౌన్‌లోడ్ చేసుకోవడానికి అందుబాటులో ఉంచారు. అధికారిక పోర్టల్‌లోకి లాగిన్ అవ్వడం ద్వారా ఎయిమ్స్ పరీక్ష 2020 అడ్మిట్ కార్డులను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. 

ప్రతి సంవత్సరంలగానే, ఎయిమ్స్ ఎంట్రన్స్ ఎగ్జామ్ 2020 అడ్మిట్ కార్డులు ఎయిమ్స్ ఇన్స్టిట్యూట్ ద్వారా ఆన్‌లైన్ లో విద్యార్థులకు అందుబాటులో ఉంచారు. కరోనా వైరస్  ప్రస్తుత పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని  చర్యలు తీసుకుంటున్నారు. విద్యార్థులు తమ హాల్ టిక్కెట్లను సులభంగా డౌన్‌లోడ్ చేసుకోవడానికి అధికారిక వెబ్‌సైట్‌ aiimsexams.org నుంచి అడ్మిట్‌కార్డులను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని ప్రకటించింది. 


ఎయిమ్స్ పిజి అడ్మిట్ కార్డ్ 2020 లో ఏదైనా లోపాలు, స్పెల్లింగ్ తప్పులు, ఇతర ఏదైన్ ఉంటే అభ్యర్థులు ఈమెయిల్ ద్వారా పరీక్షా కంట్రోలర్స్ ఎయిమ్స్ కార్యాలయంతో సంప్రదించాలని సూచించారు. దీనికి సంప్రదింపు వివరాలు కూడా తెలిపారు.

కోవిడ్-19 మహమ్మారి కారణంగా ఎయిమ్స్ పిజి ఎంట్రన్స్  పరీక్ష మే నెలలో వాయిదా పడింది. జూన్ 1 న, ఎయిమ్స్ నోటిఫికేషన్‌ను సవరించి విడుదల చేసింది. జూన్ 11, 2020 న పెండింగ్‌లో ఉన్న ఎంట్రన్స్  పరీక్షలు జరుగుతాయని, దాని కోసం అడ్మిట్ కార్డులు విడుదల చేయనున్నారు. ఆరేండ్ల కాలవ్యవధి కలిగిన ఎండీ, ఎంఎస్‌, ఎసీహెచ్‌/డీఎం/ఎండీఎస్‌ కోర్సులు, ఎమ్మెస్సీ నర్సింగ్‌, బీఎస్సీ పోస్ట్‌ బేసిక్‌ (నర్సింగ్‌), డీఎం/ఎం.సీహెచ్‌/ఎండీ (హాస్పిటల్‌ అడ్మినిస్ట్రేషన్‌) ఫెలోషిప్‌ ప్రోగామ్‌లో ప్రవేశాల కోసం ప్రవేశపరీక్షను నిర్వహించనుంది. 

ఎయిమ్స్‌ ఫెలోషిప్‌- మధ్యాహ్నం 1 గంటల నుంచి 2 గం. వరకు

డీఎం, ఎం.సీహెచ్‌, ఎండీ (హాస్పిటల్‌ మేనేజ్‌మెంట్‌), బీఎస్సీ (పోస్ట్‌ బేసిక్‌), ఎమ్మెసీ నర్సింగ్‌- మధ్యాహ్నం 1 గంటల నుంచి 2.30 గం. వరకు

ఎండీ, ఎంఎస్‌, డీఎం, ఎం.సీహెచ్‌, ఎండీఎస్‌ (ఆరేండ్లు)- మధ్యాహ్నం 1 గం. నుంచి 4 గం. వరకు 

ఎయిమ్స్  ఇన్స్టిట్యూట్ ఎగ్జామ్ ప్రదేశం, కేంద్రాల కేటాయింపు గురించి ఒక ప్రకటనను కూడా విడుదల చేసింది. "అభ్యర్థులు ఎంపిక చేసిన ప్రకారం, లభ్యతకు కట్టుబడి పరీక్షా నగరాన్ని కేటాయించింది." పరీక్షా పోర్టల్‌లోకి లాగిన్ అవ్వడం ద్వారా ఫైనల్ రిజిస్ట్రేషన్ పోర్టల్ లో మై పేజీని సందర్శించడం ద్వారా అభ్యర్థులకు కేటాయించిన పరీక్ష నగరాన్ని తనిఖీ చేయవచ్చు.
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios