Asianet News TeluguAsianet News Telugu

10th అర్హతతో కానిస్టేబుల్‌ ఉద్యోగాలు.. నెలకు రూ.69 వేల వరకు జీతం.. ఇప్పుడే ధరఖాస్తు చేసుకోండీ..

బోర్డర్‌ సెక్యూరిటీ ఫోర్స్‌ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ ద్వారా స్పోర్ట్స్‌ కోటాలో కింద గ్రూప్ సీ కానిస్టేబుల్ పోస్టులని భర్తీ చేయనుంది. 

bsf released notification for 269 constable posts who have passed ssc can apply for it salary upto rs.69100 per month
Author
Hyderabad, First Published Aug 17, 2021, 5:39 PM IST

ప్రభుత్వ ఉద్యోగం లేదా పోలీస్ ఫోర్స్  ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌. బోర్డర్‌ సెక్యూరిటీ ఫోర్స్ (బి‌ఎస్‌ఎఫ్) తాజాగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అయితే ఈ నోటిఫికేషన్‌ ద్వారా స్పోర్ట్స్‌ కోటా కింద గ్రూప్-సీ కానిస్టేబుల్ జనరల్ డ్యూటీ పోస్టులని భర్తీ చేయనుంది.

అయితే ఈ నియామక ప్రక్రియ పూర్తయ్యేనాటికి పోస్టుల సంఖ్య పెరగవచ్చు లేదా తగ్గవచ్చు. పురుషులు, మహిళ అభ్యర్ధులు ఎవరైనా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఏ దశలోనైన నియమకాన్ని రద్దు చేయు లేదా వాయిదా వేసే హక్కు బి‌ఎస్‌ఎఫ్ కి ఉంటుంది.

ఈ పోస్టుల కోసం ఆగస్టు 9 నుంచి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమవుతుంది. సెప్టెంబర్ 22 దరఖాస్తులు చేసుకోవడానికి చివరి తేదీ. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన మరిన్ని పూర్తి వివరాల కోసం  https://rectt.bsf.gov.in/ అధికారిక వెబ్‌సైట్‌  చూడవచ్చు. ఆన్ లైన్ విధానంలోనే ధరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

మొత్తం ఖాళీలు: 269
బాక్సింగ్ (మెన్)- 10, బాక్సింగ్ (వుమెన్)- 10, జూడో (మెన్)- 8, జూడో (వుమెన్)- 8, స్విమ్మింగ్ (మెన్)- 12, స్విమ్మింగ్ (వుమెన్)- 4, క్రాస్ కంట్రీ (మెన్)- 2, క్రాస్ కంట్రీ (వుమెన్)- 2, కబడ్డీ (మెన్)- 10, వాటర్ స్పోర్ట్స్ (మెన్)- 10, వాటర్ స్పోర్ట్స్ (వుమెన్)- 6, వుషూ (మెన్)- 11, జిమ్నాస్టిక్స్ (మెన్)- 8, హాకీ (మెన్)- 8, వెయిట్ లిఫ్టింగ్ (మెన్)- 8, వెయిట్, లిఫ్టింగ్ (వుమెన్)- 9, వాలీబాల్ (మెన్)- 10, రెజ్లింగ్ (మెన్)- 12, రెజ్లింగ్ (వుమెన్)- 10, హ్యాండ్ బాల్ (మెన్)- 8, బాడీ బిల్డింగ్ (మెన్)- 6, ఆర్చరీ (మెన్)- 8, ఆర్చరీ (వుమెన్)- 12, తైక్వాండో (మెన్)- 10, అథ్లెటిక్స్ (మెన్)- 20, అథ్లెటిక్స్ (వుమెన్)- 25, ఈక్వెస్ట్రియన్ (మెన్)- 2, షూటింగ్ (మెన్)- 3, షూటింగ్ (వుమెన్)- 3, బాస్కెట్ బాల్ (మెన్)- 6, ఫుట్‌బాల్ (మెన్)- 8

also read గుడ్ న్యూస్.. బ్యాంక్ ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల.. డిగ్రీ పూర్తయిన వారు ఇలా అప్లయ్ చేసుకోండీ..

విద్యార్హతలు: గుర్తింపు పొందిన బోర్డు, యూనివర్సిటీ నుంచి 10వ తరగతి పాసై ఉండాలి.

స్పోర్ట్స్ క్వాలిఫికేషన్: ఛాంపియన్‌షిప్, నేషనల్ గేమ్స్, అంతర్జాతీయ క్రీడోత్సవాల్లో పాల్గొన్నవారు, మెడల్స్ సాధించినవారు దరఖాస్తు చేసుకోవచ్చు.

ఎత్తు: పురుషులు 170 సెంటీమీటర్లు, మహిళలు 157 సెంటీమీటర్లు ఉండాలి.

వయస్సు: 1 ఆగస్టు 2021 నాటికి 18 నుంచి 23 ఏళ్ల మధ్య ఉండాలి.

వేతనం: నెలకు రూ.21,700 బేసిక్ వేతనంతో మొత్తం రూ.69,100 వేతనం లభిస్తుంది.

ఎంపిక విధానం: డాక్యుమెంట్ వెరిఫికేషన్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, డీటెయిల్డ్ మెడికల్ ఎగ్జామినేషన్.

దరఖాస్తు ప్రారంభం: 9 ఆగస్ట్  2021

దరఖాస్తుకు చివరి తేదీ: 22 సెప్టెంబర్ 2021

అధికారిక వెబ్‌సైట్‌:https://rectt.bsf.gov.in/

Follow Us:
Download App:
  • android
  • ios