Asianet News TeluguAsianet News Telugu

Govt Jobs 2022: రాత పరీక్ష లేకుండా ఉద్యోగాలు.. నెలకు రూ.24,780 వరకూ జీతం..!

ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ లో ప‌లు పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల అయ్యింది. ఈ నోటిఫికేష‌న్ ద్వారా కాంట్రాక్ట్ ప్రాతిపదికన 1625 జూనియర్ టెక్నీషియన్ ఖాళీల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తుల‌ను ఆహ్వానిస్తారు.
 

Apply for 1,625 vacancies for Jr Technician posts
Author
Hyderabad, First Published Apr 3, 2022, 1:34 PM IST

ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (Electronics Corporation of India Limited) లో ప‌లు పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల అయ్యింది. ఈ నోటిఫికేష‌న్ (Notification) ద్వారా కాంట్రాక్ట్ ప్రాతిపదికన 1625 జూనియర్ టెక్నీషియన్ ఖాళీల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తుల‌ను ఆహ్వానిస్తారు. ఈ పోస్టుల‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ ఏప్రిల్ 1న ప్రారంభ‌మైంది. ద‌ర‌ఖాస్తుల‌ను ఆన్‌లైన్‌లో స‌మ‌ర్పించాలి. ద‌ర‌ఖాస్తు చేసుకొనే అభ్య‌ర్థి వ‌య‌సు 30 ఏళ్లు మించి ఉండ‌కూడ‌ద‌ని నోటిఫికేష‌న్‌లో పేర్కొన్నారు. ఎంపికైన అభ్య‌ర్థుల‌కు పోస్టుల ఆధారంగా రూ. 20,480 నుంచి రూ. 24,780 వ‌ర‌కు నెల‌వారీ వేత‌నం అందిస్తారు. నోటిఫికేష‌న్ వివ‌రాలు, ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ కోసం అధికారిక వెబ్‌సైట్ https://careers.ecil.co.in/login.php ను సంద‌ర్శించాల్సి ఉంటుంది. ద‌ర‌ఖాస్తుల స‌మ‌ర్ప‌ణ‌కు ఏప్రిల్ 11, 2022 వ‌ర‌కు అవకాశం ఉంది.

మొత్తం పోస్టులు: 1625

ఎలక్ట్రానిక్స్ మెకానిక్: 814 పోస్టులు.. జీతం: రూ. 20,480

ఎలక్ట్రిషియన్: 184 పోస్టులు.. జీతం: రూ. 22,528

ఫిట్టర్: 627 పోస్టులు.. జీతం రూ. 24,780

ముఖ్య సమాచారం

అర్హతలు: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఎలక్ట్రానిక్స్ మెకానిక్ /ఎలక్ట్రీషియన్ /ఫిట్టర్ ట్రేడ్‌లో 2 సంవత్సరాల ITI సర్టిఫికేట్ ఉండాలి.
ఎంపిక విధానం: అభ్య‌ర్థుల నుంచి ద‌ర‌ఖాస్తులు స్వీక‌రిస్తారు. అనంతరం మెరిట్ ఆధారంగా 1:4 అభ్య‌ర్థుల‌ను షార్ట్ లిస్ట్ చేస్తారు. అనంతరం హైదరాబాద్‌లో నిర్వహించే డాక్యుమెంట్ వెరిఫికేష‌న్ అన‌త‌రం పోస్టింగ్ ఇస్తారు.
ద‌ర‌ఖాస్తు విధానం: ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ పూర్తిగా ఆన్‌లైన్ ప‌ద్ధ‌తిలో ఉంటుంది.
పూర్తి వివరాలకు వెబ్‌సైట్:https://careers.ecil.co.in/login.php

ద‌ర‌ఖాస్తు విధానం

- ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ పూర్తిగా ఆన్‌లైన్ ప‌ద్ధ‌తిలో ఉంటుంది.

- ముందుగా అధికారిక వెబ్‌సైట్ http://careers.ecil.co.in/login.php ను సంద‌ర్శించాలి.

- నోటిఫికేష‌న్ పూర్తిగా చ‌ద‌వాలి.

- త‌రువాత click here to apply లింక్ క్లిక్ చేయాలి.

- త‌ప్పులు లేకుండా ద‌ర‌ఖాస్తు ఫాం నింపాలి.

- అనంత‌రం స‌బ్‌మిట్‌ చేసి, ఒక కాపీని భ‌విష్య‌త్ అవ‌స‌రాల కోసం భ‌ద్ర‌ప‌రుచుకోవాలి.

- ద‌ర‌ఖాస్తుకు ఏప్రిల్ 11, 2022 వ‌ర‌కు అవ‌కాశం ఉంది.
 

Follow Us:
Download App:
  • android
  • ios