ISL 2022 Final: హైదరాబాద్ ఎఫ్‌సీతో కేరళ బ్లాస్టర్స్‌ టైటిల్ ఫైట్... అక్కడ అలా? ఇక్కడ ఇలా...

ISL 2022 Finalకి కేరళ బ్లాస్టర్స్‌ ఎఫ్‌సీకి సోషల్ మీడియా ద్వారా మద్ధతు తెలుపుతున్న ఫుట్‌బాల్ ఫ్యాన్స్... స్టేడియంలో మలయాళీ ఫ్యాన్స్ సందడి... హైదరాబాద్ ఎఫ్‌సీకి కానరాని మద్ధతు...

ISL 2022 Final:  Kerala Blasters FC vs Hyderabad FC, Where to Watch Live Streaming

ఇండియన్ సూపర్ లీగ్ 2022 ఫైనల్ మ్యాచ్‌ మరికొద్ది నిమిషాల్లో ఆరంభం కానుంది. మొట్టమొదటిసారి ఐఎస్‌ఎల్‌ ఫైనల్‌కి అర్హత సాధించిన హైదరాబాద్ ఎఫ్‌సీ, కేరళ బ్లాస్టర్స్ ఎఫ్‌సీతో ఫైనల్ మ్యాచ్ ఆడనుంది. గోవాలోని ఫటోర్డా స్టేడియంలో ఆదివారం సాయంత్రం 7 గంటల 30 నిమిషాలకు ఫైనల్ మ్యాచ్ ప్రారంభం కానుంది...

ఎక్కడ చూడాలి?
ఇండియన్ సూపర్ లీగ్ 2022 ఫైనల్ మ్యాచ్‌ని స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్ లైవ్ టెలికాస్ట్ చేస్తోంది. స్టార్ స్పోర్ట్స్ 2, స్టార్ స్పోర్ట్స్ 3 ఛానెల్స్‌తో పాటు తెలుగులో స్టార్ స్పోర్ట్స్ 1 తెలుగు ఛానెల్‌లో ఫైనల్ మ్యాచ్ ప్రత్యేక్ష ప్రసారం కానుంది...

అలాగే మొబైల్‌లో ఐఎస్‌ఎల్ ఫైనల్ మ్యాచ్‌ను లైవ్ చూడాలనుకుంటే డిస్నీ ప్లస్ హాట్‌ స్టార్‌లో వీక్షించవచ్చు. 

అక్కడ బీభత్సమైన క్రేజ్...
భారత దేశంలో కేరళలో ఫుట్‌బాల్‌కి బీభత్సమైన క్రేజ్ ఉంటుంది. క్రికెట్‌ కంటే ఎక్కువగా ఫుట్‌బాల్ మ్యాచులను చూసేందుకు కేరళ ప్రజలు ఇష్టపడతారు. రెండోసారి ఫైనల్‌ చేరిన కేరళ బ్లాస్టర్స్‌ ఎఫ్‌సీకి అక్కడి జనాల నుంచి భారీ సపోర్ట్ దక్కుతుంది...

కేరళ బ్లాస్టర్స్ జట్టు టైటిల్ గెలవాలని ఆకాంక్షిస్తూ కేబీఎఫ్‌సీ ఎల్లో జెర్సీ, బ్యాడ్స్‌తో ఫుట్‌బాల్ ఫ్యాన్స్.. ఇప్పటికే స్టేడియానికి చేరుకుంటున్నారు. కరోనా ఆంక్షలు తొలగించడంతో ఫైనల్ మ్యాచ్ చూసేందుకు నూరు శాతం కెపాసిటితో ప్రేక్షకులను అనుమతించాలని నిర్ణయం తీసుకున్నారు. 

కేరళ బ్లాస్టర్స్ ఎఫ్‌సీ, ఐఎస్‌ఎల్ ఫైనల్‌లో విజయం సాధించాలని ఆకాంక్షిస్తూ, మలయాళ సూపర్ స్టార్ మమ్మూట్టీ ట్వీట్ కూడా చేశారు. అలాగే మలయాళ హీరోలు, సెలబ్రిటీలు కూడా కేరళ బ్లాస్టర్స్‌ను సపోర్ట్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు... ఐఎస్‌ఎల్ ఫైనల్ మ్యాచ్‌కి అక్కడ ఐపీఎల్ ఫైనల్ రేంజ్‌లో సందడి కనిపిస్తోంది.

ఇక్కడ ఇలా... 
ఫైనల్ మ్యాచ్‌కి ముందు కేరళ బ్లాస్టర్స్‌కి దక్కుతున్న సపోర్ట్‌తో పోలిస్తే హైదరాబాద్ ఎఫ్‌సీని ఎవ్వరూ పట్టించుకోకపోవడం విశేషం. హైదరాబాద్‌లో క్రికెట్‌కి, కబడ్డీకి తప్ప ఫుట్‌బాల్‌కి పెద్దగా క్రేజ్ ఉండదు. ఫుట్‌బాల్ మ్యాచులను ఆసక్తిగా వీక్షించేవారి సంఖ్య కూడా తక్కువే. దీంతో స్టేడియంలో హైదరాబాద్ ఎఫ్‌సీ సపోర్టర్ల సంఖ్య కూడా చాలా తక్కువగా ఉంది... హైదరాబాద్ ఎఫ్‌సీ ఫైనల్ చేరినా, ఇక్కడ ప్రో కబడ్డీ మ్యాచ్‌కి ఉండే సందడి కూడా లేకపోవడం విశేషం.


పట్టించుకోని రానా దగ్గుపాటి...
హైదరాబాద్ ఎఫ్‌సీ సహ యజమాని అయిన టాలీవుడ్ నటుడు రానా దగ్గుపాటి కూడా ఐఎస్‌ఎల్ ఫైనల్‌ని పట్టించుకోకపోవడం విశేషం. రానా దగ్గుపాటి, ఐఎస్‌ఎల్ ఫైనల్ గురించి ఒక్క పోస్టు కానీ, ట్వీట్ కానీ చేయకపోవడం అరకోర ఉన్న ఫుట్‌బాల్ ఫ్యాన్స్‌ని ఆశ్చర్యానికి గురి చేస్తోంది...

 

బ్రెజిల్‌ ప్లేయర్ జోవో విక్టర్, హైదరాబాద్ ఎఫ్‌సీకి కెప్టెన్‌గా వ్యవహరిస్తుంటే, గోల్‌కీపర్ లక్ష్మీకాంత్ కట్టిమని వైస్ కెప్టెన్‌గా ఉన్నాడు...   మొదటి సెమీ ఫైనల్ మ్యాచ్‌లో హైదరాబాద్ ఎఫ్‌సీ, ఏటీకే మోహన్ బగాన్‌పై 3-1 తేడాతో విజయాన్ని అందుకుంది.  సెమీ ఫైనల్ 2 మ్యాచ్‌లో డిఫెండింగ్ రన్నరప్ ఏటీకే మోహన్ బగాన్‌తో జరిగిన మ్యాచ్‌లో 1-0 తేడాతో ఓడింది హైదరాబాద్ ఎఫ్‌సీ... ఓవరాల్‌గా హైదరాబాద్ ఎఫ్‌సీ ఖాతాలో మూడు గోల్స్ ఉండగా, 2 గోల్స్ మాత్రమే సాధించిన ఏటీకే మోహన్ బగాన్ ఫైనల్‌కి అర్హత సాధించలేకపోయింది...

మరో సెమీ ఫైనల్‌లో జంషెడ్‌ పూర్‌ ఎఫ్‌సీతో తలబడిన కేరళ బ్లాస్టర్స్... ఓ గోల్ తేడాతో ఫైనల్‌కి అర్హత సాధించింది. మొదటి సెమీస్‌లో జంషెడ్ పూర్‌ని 0-1 తేడాతో ఓడించిన కేరళ బ్లాస్టర్స్, రెండో సెమీస్‌లో 1-1 తేడాతో డ్రా చేసుకోగలిగింది. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios