ఇండియన్ సూపర్ లీగ్ 2021 సీజన్ విజేతగా నిలిచింది ముంబై సిటీ. అద్భుతమైన ఆటతీరుతో తొలిసారి ఫైనల్‌ చేరిన ముంబై సిటీ, తుదిపోరులో కూడా సరైన సమయంలో ఆధిపత్యం కనబర్చినా, కెరీర్‌లో మొట్టమొదటి టైటిల్ సొంతం చేసుకుంది.

వరుసగా రెండో టైటిల్ గెలవాలని ఆశపడిన డిఫెండింగ్ ఛాంపియన్ ఏటీకే మోహన్ బగాన్‌కి ఫైనల్‌కి షాక్ తప్పలేదు. ఆట ప్రారంభమైన 18వ నిమిషంలో ఏటీకే మోహన్ బగాన్ ప్లేయర్ విలియమ్స్ తొలి గోల్ సాధించాడు. ముంబై సిటీ ప్లేయర్ తేరి 29వ నిమిషంలో గోల్ చేయడంతో ఇరు జట్ల స్కోరు 1-1తో సమం అయింది.

అయితే మ్యాచ్ ఆఖరి నిమిషంలో అద్భుతమైన గోల్ చేసిన బిపిన్, ముంబై సిటీకి టైటిల్ అందించాడు. 2-1 తేడాతో ఫైనల్‌లో గెలిచిన ముంబై సిటీ, మోహన్ బగాన్‌కి షాక్ ఇచ్చింది. ఫైనల్ ఆఖరి నిమిషంలో గోల్ చేసిన బిపిన్ సింగ్, ‘హీరో ఆఫ్ ది మ్యాచ్’గా నిలిచాడు.