సారాంశం

మ్యాచ్ సమయంలో గోల్స్ చేయలేకపోయిన ఇరుజట్లు...

6-5 తేడాతో పెనాల్టీ షూటౌట్‌లో గోవా ఎఫ్‌సీపై ముంబై సిటీ విజయం...

ఇండియన్ సూపర్ లీగ్ చరిత్రలో తొలిసారి ఫైనల్ చేరిన ముంబై సిటీ...

ఇండియన్ సూపర్ లీగ్ 2020-21 సీజన్‌లో ముంబై సిటీ అద్భుత విజయాన్ని అందుకుని, ఫైనల్‌కి దూసుకెళ్లింది. సెకండ్ లెగ్ తొలి సెమీస్‌లో గోవా ఎఫ్‌సీతో జరిగిన మ్యాచ్‌ డ్రాగా ముగిసింది.

ఇరు జట్లు హోరా హోరీగా పోరాడడంతో అదనంగా 30 నిమిషాల సమయం కేటాయించినా, గోల్ చేయలేకపోయారు రెండు జట్ల ఆటగాళ్లు. దీంతో మ్యాచ్ ఫలితాన్ని తేల్చేందుకు పెనాల్టీ షూటౌట్‌ను ఎంచుకున్నారు రిఫరీలు..

ఐదు పెనాల్టీ షూటౌట్‌ల తర్వాత ఇరు జట్లు 2-2 స్కోరుతో సమంగా నిలాచియి. దీంతో మరో 5 పెనాల్టీ షూటౌట్లు ఇవ్వగా 6-5 తేడాతో ముంబై సిటీకి ఉత్కంఠ విజయం దక్కింది.

ఇండియన్ సూపర్ లీగ్ చరిత్రలో ముంబై సిటీ ఫైనల్ చేరడం ఇదే తొలిసారి కావడం విశేషం. ఏటీకే మోహన్ బగాన్, నార్త్ వెస్ట్ యూనైటెడ్ మధ్య జరిగిన సెమీస్‌లో గెలిచిన జట్టు ముంబై సిటీతో ఫైనల్‌ మ్యాచ్ ఆడుతుంది.