Russia Ukraine Crisis: రష్యా-ఉక్రెయిన్ వార్ నేపథ్యంలో ఇప్పటికే ఉక్రెయిన్ లో వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు. లక్షలాది మంది బిక్కుబిక్కుమంటూ ఇంకా బంకర్లలోనే తలదాచుకుంటున్నారు. అయితే రష్యా దళాలు మారియుపోల్ నగరంలోని మానవతా కారిడార్‌ను లక్ష్యంగా చేసుకున్నాయని ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీ తెలిపారు.
Russia Ukraine Crisis: ఉక్రెయిన్ పై రష్యా దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. ఉక్రెయిన్ లో పరిస్థితులు దారుణంగా మారాయి. ఈ క్రమంలోనే ఉక్రెయిన్‌లోని పలు నగరాల నుంచి తాజాగా దాదాపు 40,000 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించామనీ, అయితే రష్యా దళాలు మారియుపోల్ నగరంలోని మానవతా కారిడార్‌ను లక్ష్యంగా చేసుకున్నాయని ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీ తెలిపారు. “ఈ రోజు మాకు ప్రధాన పనులలో ఒకటి మానవతా కారిడార్‌ల సంస్థ.. సుమీ, ట్రోస్టియానెట్స్, క్రాస్నోపిల్ల్యా, ఇర్పిన్, బుచా, హోస్టోమెల్, ఇజియం.. ఈ రోజు మేము ఇప్పటికే దాదాపు 40,000 మంది మా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. వారికి పోల్టావా, కైవ్, చెర్కాసీ, జపోరిజ్జియా, డ్నిప్రో, ఎల్వివ్‌లలో భద్రత కల్పించాము” అని జెలెన్స్కీ వెల్లడించారు.
మానవతా దృక్పథంతో ఆహారం, మందులు పంపిణీ చేశామన్నారు. అయితే మారియుపోల్ మరియు వోల్నోవాఖా పూర్తిగా నిరోధించబడి ఉన్నాయి, కారిడార్ పని చేయడానికి ఉక్రేనియన్ అధికారులు ఉత్తమమైన అన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ రష్యన్ దళాలు కాల్పులు ఆపలేదు అని పేర్కొన్నారు. దీనితో సంబంధం లేకుండా, ఆహారం, నీరు మరియు మందులతో కూడిన ట్రక్కుల కాన్వాయ్‌ను పంపాలని తాను ఇప్పటికీ నిర్ణయించుకున్నట్లు జెలెన్స్కీ చెప్పారు.
ఉక్రెయిన్ పై రష్యా దాడులు మరింతగా పెంచింది. దీని కారణంగా ఉక్రెయిన్ లో పరిస్థితులు దారుణంగా మారాయి. ఇక అంతర్జాతీయ సమాజం రష్యా తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఈ క్రమంలోనే ఆ దేశంపై ఆంక్షలు విధిస్తున్నాయి. ప్రస్తుతం రష్యా విదేశీ మారకద్రవ్య నిల్వలు దాదాపు $285 బిలియన్లుగా అంచనా వేయబడ్డాయి. అయితే, పాశ్చాత్య దేశాలు, అమెరికా, వారి మిత్రదేశాలు విధించిన ఆర్థిక ఆంక్షల కారణంగా రష్యా ఒత్తిడిలోకి జారుకుంటున్నది. అయినప్పటికీ రష్యా వెనక్కి తగ్గకుండా.. ఆంక్షలు అంటే.. యుద్ధంతో సమానమని హెచ్చరిస్తున్నది. యూరోపియన్ యూనియన్ దేశాలు ఆంక్షలు విధింపును ఖండిస్తూ.. ఆయా దేశాలకు కౌంటర్ ఇస్తూ.. రష్యా సైతం చర్యలు తీసుకుంటున్నది. రష్యా-ఉక్రెయిన్ ల మధ్య జరుగుతున్న యుద్ధ పరిస్థితులను నివేదిస్తున్న మీడియా సంస్థలను నియంత్రిస్తూ.. దేశంలో కొత్త మార్గదర్శకాలను అమలు చేస్తోంది రష్యా. ఈ చర్యలపై అంతర్జాతీయంగా మీడియా సంస్థలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.
ఇదిలావుండగా, ఉక్రెయిన్-రష్యా యుద్ధ ప్రభావం ఇప్పుడు ఆ రెండు దేశాలపైనే కాకుండా అంతర్జాతీయంగా తీవ్ర ప్రభావం చూపుతున్నది. పశ్చిమ దేశాలు రష్యాపై ఆంక్షలు విధింపు కారణంగా వాణిజ్య సప్లై చైన్ కు అడ్డంకులు ఏర్పడ్డాయి. దీంతో అనేక చాలా దేశాల్లో రష్యా, ఉక్రెయిన్ దేశాలను నుంచి ఎతుమతులు నిలిచిపోవడంతో.. దిగుమతి దేశాలపై ప్రభావం పడుతోంది. ఈ యుద్ధం కారణంగా ఇప్పటికే ముడి చమురు ధరలు రికార్డు స్థాయికి పెరిగాయి. అంతర్జాతీయ మార్కెట్ ఒడిదుడుకులను ఎదర్కొంటున్నది. ఈ క్రమంలోనే ప్రపంచం దేశాలు రెండు దేశాల వివాదాలను శాంతియుత చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని సూచిస్తున్నాయి. అయితే, ఇప్పటికే పలుమార్లు రష్యా-ఉక్రెయిన్ ల మధ్య శాంతి చర్చలు జరిగాయి. కానీ అవి సఫలం కాలేదు.
