పాపం.. ఈతకి వెళ్తే.. పురుషాంగాన్ని పట్టేసిన సముద్రజీవి

https://static.asianetnews.com/images/authors/d7f5adfb-1610-5d53-be8e-55db5850d97e.jpg
First Published 7, Sep 2018, 2:06 PM IST
youth genital gets stung by stingray while swimming in China
Highlights

ఓ సముద్ర జీవి తోకలోని మొనదేలిన భాగం పురుషాంగానికి గుచ్చుకోవడంతో బాధతో విలవిల్లాడాడు.

పాపం.. ఇలాంటి సంఘటన మరెవ్వరికీ ఎదురుకాకూడదు. సరదా కోసం ఈతకి వెళితే.. ఓ కుర్రాడు అనుకోని ప్రమాదం వచ్చిపడింది. సముద్రంలోని జీవి ఒకటి ఆ కుర్రాడి పురుషాంగాన్ని పట్టేసింది. ఇక ఆ కుర్రాడి బాధ వర్ణనానీతం. నొప్పితో గిలగిల కొట్టుకున్నాడు. ఈ సంఘటన చైనాలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే.. సముద్రంలో సరదాగా ఈతకెళ్లిన ఓ చైనీస్ యువకుడికి ఊహించని ఘటన ఎదురైంది. ఓ సముద్ర జీవి తోకలోని మొనదేలిన భాగం పురుషాంగానికి గుచ్చుకోవడంతో బాధతో విలవిల్లాడాడు. ఈ ఘటన సన్యా నగరంలో హనియన్ రిసార్ట్‌లో చోటు చేసుకుంది. స్థానికంగా డెవిల్ ఫిష్‌గా పిలిచే సముద్ర జీవి వెడల్పుగా ఉంటుంది. దీని వెన్నెముక భాగం తోకలా ఉండి, దాని మధ్యలో కొండిలా ఉంటుంది. ఈ మొనదేలిన భాగమే యువకుడి పురుషాంగానికి గాలంలా పట్టేసింది. 

నీటిలో ఉన్నప్పుడు ఏం జరిగిందో అర్థం కాని ఆ యువకుడు కాసేపటి తర్వాత ఒడ్డుకు చేరుకుని బాధతో విలవిల్లాడాడు. బీచ్‌లో సేదతీరుతున్న వారు వెంటనే ఫైర్ ఫైటర్లకు, వైద్య సిబ్బందికి సమాచారం అందించారు. వెంటనే రంగంలోకి దిగిన ఫైర్ సిబ్బంది అతడి పురుషాంగం నుంచి పెద్ద కత్తెర సాయంతో దాన్ని కత్తిరించారు. తర్వాత ఆ యువకుణ్ని సమీపంలోని హాస్పిటల్‌కు తరలించారు. అతడికి ప్రాణాపాయం లేదని, కోలుకుంటున్నాడని డాక్టర్లు తెలిపారు.

loader