Asianet News TeluguAsianet News Telugu

నీటిలో పడిన ఐఫోన్.. ఆరు నెలల తర్వాత బయటకు తీయగా...

ఫ్రీడైవర్ జంట ఈ సరస్సు అడుగున ఉన్న చెత్తను క్లీన్ చేస్తుంటారు. ఇటీవల వారు చెత్తను క్లీన్ చేస్తుండగా వారికి రెండు ఫోన్లు దొరికాయి

Working iPhone 11 returned to owner nearly 6 months after it fell in a lake
Author
Hyderabad, First Published Mar 9, 2021, 8:50 AM IST


ఫోన్ ఒక్కసారి వాటర్ లో పడిపోతే.. ఇక అది పనిచేస్తుందనుకోవడం మన భ్రమే అవుతుంది. ఈ మధ్యకాలంలో వాటర్ ప్రూఫ్ స్మార్ట్ ఫోన్స్ వస్తున్నాయి. అయితే..  దాదాపు ఆరు నెలలపాటు నీటిలో ఉంటే.. వాటర్ ప్రూఫ్ అయితే మాత్రం పనిచేస్తుందా..? ఐఫోన్ అయితే మాత్రం కచ్చితంగా పనిచేస్తుంది. తాజాగా చోటుచేసుకున్న ఓ సంఘటనే దీనికి నిదర్శనం.

వివరాల్లోకి వెళ్తే.. చిల్లివాక్ నగరంలో గతేడాది సెప్టెంబర్‌లో ఓ యువతి చేతిలో నుంచి ఐఫోన్ 11 మోడల్ అనుకోకుండా హ్యారిసన్ సరస్సులో పడిపోయింది. చేసేదేం లేక యువతి అక్కడి నుంచి వెళ్లిపోయింది. ఫ్రీడైవర్ జంట ఈ సరస్సు అడుగున ఉన్న చెత్తను క్లీన్ చేస్తుంటారు. ఇటీవల వారు చెత్తను క్లీన్ చేస్తుండగా వారికి రెండు ఫోన్లు దొరికాయి

రెండు ఫోన్లలో ఒక ఫోన్ స్విచ్‌ఆన్ అవలేదని, యాపిల్ సంస్థకు చెందిన ఐఫోన్ మాత్రం వెంటనే స్విచాన్ అయినట్టు జంట తెలిపింది. ఆ ఫోన్ యజమాని వ్యాంకోవర్‌కు చెందిన యువతి అని తెలుసుకుని ఫోన్‌ను ఆమెకు అప్పగించారు. తన ఫోన్ మళ్లీ తన వద్దకు వస్తుందని అనుకోలేదంటూ యువతి ఆనందం వ్యక్తం చేసింది. కాగా.. ఐఫోన్ 11 మోడల్‌కు ఐపీ68(ఇంగ్రెస్ ప్రొటెక్షన్) రేటింగ్ ఉంది. అంటే.. ఈ మోడల్ ఫోన్ నీటిలో(రెండు మీటర్ల లోతు) పడినా అరగంట వరకు ఎటువంటి డ్యామేజ్ కాదు. కానీ తాజాగా దొరికిన ఫోన్ ఆరు నెలలు గడిచినా స్విచాన్ అవడం ప్రతి ఒక్కరిని ఆశ్చర్యానికి గురిచేసింది.

Follow Us:
Download App:
  • android
  • ios