ప్రేమగా పెంచుకుంటున్న కుక్కపిల్లకోసం తన ప్రాణాలు ఫణంగా పెట్టిందో మహిళ. కుక్కపిల్లను మింగేస్తున్న కొండచిలువ నోట్లోంచి దాన్ని లాగి రక్షించింది. ఈ క్రమంలో తనూ గాయలపాలైంది. ఈ ఘటన ఆస్ట్రేలియా, క్వీన్‌లాండ్‌లో జరిగింది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారుతోంది.

డైలీ మైల్‌ తెలిపిన వివరాల ప్రకారం పదివారల వయసుగల కుక్కపిల్ల 'వాలీ' ని ఇంట్లోకి దూరిన కొండ చిలువ నోట కరుచుకుంది. దీంతో వాలీ బాధతో, ప్రాణభయంతో గట్టిగా అరిచింది. 

ఆస్ట్రేలియా, క్వీన్‌లాండ్‌లోని సన్‌షైన్‌ కోస్ట్‌లో జరిగిన ఈ ఘటనలో వాలి అరుపులు వినగానే దాని యజమాని కెల్లీ మోరిస్‌ తన కుక్కపిల్ల మేడమీదినుండి పరుగున కిందికి వచ్చింది. ఆమెతో పాటు కుటుంబసభ్యులూ పరిగెత్తారు. 

అక్కడికి చేరుకునే సరికి ఒక కొండచిలువ కుక్కపిల్ల మెడను చుట్టుకొని ఉంది. ఇది గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే వాలీని కొండచిలువ నుంచి విడదీయగలిగారు. ఈ క్రమంలో కెల్లీకి కూడా గాయాలు అయినప్పటికీ ఆమె బాగానే ఉన్నారని 'సన్‌షైన్‌ స్నేక్‌ క్యాచర్స్‌‌ ఫేస్‌బుక్‌ పేజ్‌' తెలిపింది.

మేడమీదున్న మాకు భయంకరమైన అరుపు వినిపించింది. వాలికి ఏమైందోనని కంగారుగా పరిగెత్తుకొచ్చాం. అచ్చం ఓ హారర్ మూవీలాగే ఇంటినిండా రక్తం మరకలే. చివరికి తెలిసిందేంటంటే వాలి కొండ చిలువ కు చిక్కాడని. 

కుక్కుపిల్లని కాపాడిన తరువాత కొండచిలువను ఒక కవర్‌లో ఉంచామని కెల్లీ అన్నారు. తరువాత వాలీని వైద్యంకోసం పశువైద్యశాలకి తీసుకెళ్లామని, తీవ్రంగా గాయపడిన వాలీ ఊపిరితిత్తుల సమస్యతో బాధ పడుతుందని, వాలీకి పెయిన్‌ కిల్లర్స్‌ ఇచ్చారని తెలిపారు.