తన మాజీ ప్రియుడిని ఇరికించడం కోసం ఓ మహిళ దారుణానికి పాల్పడింది. తన మాజీ ప్రియుడు తనను హింసించాడు అని నిరూపించాలనే తాపత్రయంతో తప్పుడు కేసు పెట్టింది. అది నిరూపించడం కోసం తన ప్రైవేటు పార్ట్స్ లో గ్లూ( జిగురులాంటి పదార్థం) పెట్టుకుంది. ఈ సంఘటన స్పెయిన్ లో చోటుచేసుకోగా.. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

స్పెయిన్ కి చెందిన ఓ మహిళ 2016లో తన బాయ్ ఫ్రెండ్ పై కేసు పెట్టింది. అర్థనగ్నంగా పోలీసు స్టేషన్ కి వచ్చి.. తన మాజీ ప్రియుడు తనను హింసించాడంటూ ఫిర్యాదు చేసింది. తన ప్రైవేటు పార్ట్స్ లో గ్లూ అంటించడాని ఆమె చెప్పింది.

తాను ఇంట్లో ఉండగా.. తన మాజీ ప్రియుడు వచ్చి బలవంతంగా తనను కారులో కిడ్నాప్ చేసి వేరే ప్రాంతానికి తీసుకువెళ్లాడని.. అక్కడ తన పై దాడి చేసి.. ప్రైవేట్ పార్ట్స్ లో గ్లూ పెట్టాడని చెప్పింది.

ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆమె మాజీ ప్రియుడుని అరెస్టు చేశారు. అయితే.. అతను తన తప్పేమీ లేదని.. తాను ఏ తప్పు చేయలేదని నెత్తీనోరు మొత్తుకోని చెప్పాడు.

అయితే.. ఈ కేసు దర్యాప్తులో పోలీసులకు విస్తుపోయే నిజాలు తెలిసాయి. సదరు యువతిని ఎలా కిడ్నాప్ చేశారనే విషయం తెలుసుకునేందుకు సీసీటీవీ కెమేరా లో రికార్డు అయిన వీడియోని చెక్ చేశారు.

అయితే.. ఆ వీడియోలో సదరు మహిళ.. ఓ దుకాణంలో షాపింగ్ చేస్తోంది. అక్కడ ఆమె.. కిడ్నాప్ చేయడానికి కావాలసిన పరికరాలు, గ్లూ కొనుగోలు చేయడం గమనార్హం. దీంతో.. కావాలనే యువతి.. ఆ యువకుడిని ఇరికించడానికి అలా చేసిందని దర్యాప్తులో తేలింది.

దీంతో.. రివర్స్ లో యువతిపైనే కేసు నమోదైంది. ఇటీవల ఆ కేసు కోర్టు ముందుకు రాగా... సదరు యువతికి 10సంవత్సరాలపాటు జైలు శిక్ష విధించారు. అంతేకాకుండా.. యువతికి జరిమానా కూడా విధించారు.