నిన్న పోగొట్టుకున్న వస్తువే మళ్లీ దొరకదు.  ఒక్కసారి పోయిన వస్తువు మళ్లీ దొరకడం అంటే అదృష్టం ఉండాల్సిందే. అయితే.. ఓ మహిళ... ఏకంగా  46 సంవత్సరాల క్రితం పోగొట్టుకున్న  ఉంగరాన్ని.. మళ్లీ దక్కించుకోగలిగింది. ఈ సంఘటన అమెరికాలో చోటుచేసుకోగా... ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

మిచిగాన్ ప్రాంతానికి చెందిన మేరీ గజల్ అనే మహిళ.. 1975 లో అనుకోకుండా తన ఉంగరాన్ని పోగొట్టుకుంది. మళ్లీ ఆ ఉంగరం దొరుకుతుందని ఆమె అస్సలు ఊహించలేదు. ఆ ఉంగరం పోయిందని చాలా బాధపడింది. కానీ.. ఇటీవల ఆమెకు ఫేస్ బుక్ లో వచ్చిన ఓ మెసేజ్ చూసిన తర్వాత  ఆమెకు పోయిన ప్రాణం మళ్లీ దొరికినట్లు అనిపించింది.

ఎందుకంటే..  ఆమె 46ఏళ్ల క్రితం పోగొట్టుకున్న ఉంగరం తిరిగి ఇవ్వాలని అనుకుంటన్నట్లు క్రిస్ నార్డ్ అనే మహిళ ఆమెకు మెసేజ్ చేసింది. అది చూసి ఆమె ఆనందంతో పొంగిపోయింది. ముందు అసలు ఆ మెసేజ్ చూసి ఆమె షాక్ అయ్యింది.

‘ మీకు సంబంధించిన ఓ వస్తువు నా దగ్గర ఉంది’ అంటూ మెసేజ్  రావడం చూసి షాకైంది. ముందుగా అది ఏదైనా స్పామ్ ఏమో అని అనుకుంది. కానీ.. తర్వాత ఓపెన్ చేసిన తర్వాత  స్పామ్ కాదని తెలిసింది.

ఆ తర్వాత ఆ ఉంగరం ఫోటోని సదరు మహిళ ఆమెకు పంపింది. చివరకు.. 46ఏళ్ల క్రితం పోగొట్టుకున్న ఉంగరం తిరిగి ఆమెకు దక్కింది. దీంతో.. ఈ విషయాన్ని ఆమె స్థానిక మీడియాకు తెలపడంతో విషయం వైరల్ అయ్యింది.