Asianet News TeluguAsianet News Telugu

ముద్దులు, లైంగికచర్యకోసం అడిగాడని బాస్ పై తప్పుడు ఆరోపణలు.. మహిళ కేసు కొట్టేసిన కోర్టు.. జరిమానా ఎంతంటే..

ఒక ఐటి ఉద్యోగి తన బాస్ మెయిల్ ను తప్పుగా అర్థం చేసుకుంది. లైంగికంగా వేధిస్తున్నాడంటూ కోర్టు కెక్కింది. కానీ కోర్టు ఆమె కేసును కొట్టేసింది.. కారణమేంటంటే..  

Woman Mistaking Her Boss And Sues his Mails For Kisses, court dismissed the case - bsb
Author
First Published May 19, 2023, 12:23 PM IST

లండన్ : బాస్, ఎంప్లాయిస్ మధ్య ఘర్షణ మామూలే. అది లేకపోతే పని సాఫీగా సాగదు. ఇక కొంతమంది బాస్ లు మహిళా ఉద్యోగులను లైంగికంగా వేధించడమూ సాధారణంగా కనిపిస్తుంటుంది. అయితే, తన బాస్ చేసిన మెయిల్ ను అలాంటి భావనతోనే అని పొరపడిన ఓ ఉద్యోగిని కోర్టు కెక్కింది. బాస్ మీద కేసు వేసింది. తనకు పంపిన అధికారిక మెయిల్ లో బాస్.. ‘XX’,  ‘YY’అంటూ లైంగిక పరమైన భాష వాడాడని ఆరోపించింది. 

దీనికి సంబంధించిన వివరాల్లోకి వెడితే..  "పేపర్‌లెస్ ట్రేడ్ సొల్యూషన్స్" అందించే సంస్థ essDOCS లండన్ కార్యాలయంలో ఐటీ ఉద్యోగి, ప్రాజెక్ట్ మేనేజర్‌గా పనిచేస్తున్న కరీనా గ్యాస్‌పరోవా, తన బాస్ అలెగ్జాండర్ గౌలాండ్రిస్‌పై ఈ మెయిల్‌ లో తనను లైంగికంగా వేధించాడని దావా వేసింది. ఈ మేరకు సంస్థ మీద ఎంప్లాయ్ మెంట్  ట్రిబ్యునల్ కు వెళ్లింది. లైంగిక వేధింపులు, వివక్ష, అన్యాయమైన తొలగింపు అంటూ దావా వేసింది.

భూమికి లక్ష అడుగుల ఎత్తులో.. నక్షత్రాల మధ్య, అంతరిక్షంలో పెళ్లి... ఖర్చెంతో తెలుసా?

ఈ కేసులో సాక్ష్యంగా ఎంప్లాయ్ మెంట్ ట్రిబ్యునల్‌కు తనకు బాస్ రాసిన ఈ మెయిల్ ను జత చేసింది. అందులో ఏముందంటే.. 

"దయచేసి మీరు ఈ క్రింది వాటిని పూర్తి చేయగలరా:

మనం ప్రస్తుతం xx అగ్రిస్ కంపెనీలు, yy బార్జ్ లైన్‌ల ద్వారా సౌత్-నార్త్ ఫ్లోలలో మొక్కజొన్న కార్గోలను ఉపయోగిస్తున్నామా ???? జలమార్గాల ద్వారా.

దీంతోపాటు, రోల్‌అవుట్, బ్యాలెన్స్ , సుమారుగా ఎంత ఉంటుందో కరెక్ట్ టైమింగ్ తో సమా తెలుపగలరా..

ధన్యవాదాలు"

అనేది ఈ ఈమెయిల్ సారాంశం.. అయితే ఇందులో దీన్ని వివరించేటప్పుడు, గ్యాస్పరోవా "xx" అక్షరాలు ముద్దులని, "yy" లైంగిక సంపర్కానికి సంకేతం అని..  "????" లైంగిక చర్యలకు "ఆమె ఎప్పుడు సిద్ధంగా ఉంటుంది"  అని కోరుతూ మర్మగర్భంగా వేసిన ప్రశ్న అని పేర్కొన్నారు.

గ్యాస్పరోవా ట్రిబ్యునల్ న్యాయమూర్తుల ముందు మాట్లాడుతూ, తన బాస్ రాసిన ఈ ఈమెయిల్ ను, అతని కోరికను తాను తప్పుపట్టానని తన మీద అరిచాడని.. తాను నమ్ముతున్నానని చెప్పింది. అయితే, లండన్ సెంట్రల్ కోర్ట్‌లోని ఎంప్లాయిమెంట్ ట్రిబ్యునల్ మొత్తం కేసును విన్న తర్వాత, ఆమె అందించిన సాక్ష్యాలను సమీక్షించిన తర్వాత సంఘటనల గురించి కరీనా గ్యాస్పరోవా అవగాహన "వక్రంగా" ఉందని నిర్ధారించింది.

ఎంప్లాయ్‌మెంట్ జడ్జి ఎమ్మా బర్న్స్‌ మాట్లాడుతూ.. తమ సంస్థలో రోజువారీ జరిగే అంశాల పట్ల ఆమెకు అవగాహన తక్కువగా ఉందని.. విషయాలను ఆమె తప్పుగా చూసిందని.. అందుకే ఆమె దావాను కొట్టేసినట్లుగా చెప్పారు. "సాక్ష్యాలు లేకుండా అసాధారణ ఆరోపణలు చేసే ధోరణి కనిపించింది. తన జ్ఞాపకశక్తి సరిగా లేకపోవడం అనే తప్పును ఆమె ఒప్పుకోవడం లేదు’ 

గ్యాస్పరోవా పని-సంబంధిత ప్రవర్తనలో పూర్తి అవగాహన లేకుండా ఉంది. దీంతో పాటు బాస్ మీద చెడు ఉద్దేశం కలిగి ఉంది. దీనివల్లే ఇలా జరిగిందని తేల్చింది. ఆమెకు ఐదువేల పౌండ్ల జరిమానా అంటే రూ.5,13,012 ఆదేశించింది. 

Follow Us:
Download App:
  • android
  • ios