Asianet News TeluguAsianet News Telugu

భూమికి లక్ష అడుగుల ఎత్తులో.. నక్షత్రాల మధ్య, అంతరిక్షంలో పెళ్లి... ఖర్చెంతో తెలుసా?

ఆకాశమంత పందిరి కాదు.. ఇప్పుడు ఆకాశంలోనే పెళ్లి చేసుకోవచ్చు. భూమికి లక్ష అడుగుల ఎత్తుకు వెళ్లి అంతరిక్షంలో కొత్త జీవితానికి శుభారంభం పలకొచ్చు. ఆ అవకాశాన్ని కల్పిస్తోంది ఓ కంపెనీ.  

Wedding Vows In 100,000 Feet Above The Earth, Wedding in space... do you know the cost? - bsb
Author
First Published May 19, 2023, 10:20 AM IST

ప్రతి ఒక్కరి జీవితంలోనూ పెళ్లి అనేది ఎంతో ముఖ్యమైన ఘట్టం.  అందుకే దీనికోసం ఎన్నో కలలు, ఊహల్లో తేలిపోతుంటారు. ఈ అపూర్వ ఘట్టాన్ని.. జీవితకాలం ప్రత్యేకంగా గుర్తుండిపోయేలా  చేసుకోవాలని చూస్తారు. ఈ నేపథ్యంలోనే డెస్టినేషన్ వెడ్డింగ్ లు ఇప్పుడు సాధారణంగా మారిపోయాయి. తమ పెళ్లిని నలుగురు గుర్తు చేసుకోవాలని.. తమకు తోచిన రీతిలో అందులో ప్రత్యేకతను జోడిస్తుంటారు.

సముద్రపు అడుగున ఓ జంట పెళ్లి చేసుకుంటే…ఆకాశంలో మేఘాల మధ్య మరో జంట వివాహం చేసుకుంటుంది. ఈ క్రమంలోనే ఇటీవల కాలంలో అందమైన ప్రకృతి దృశ్యాల మధ్య.. కొత్త జీవితాన్ని ప్రారంభించడం ప్రస్తుతం నయా ట్రెండ్ గా మారింది. ఇక దీనినే ఓ కంపెనీ ఇంకాస్త ముందుకు తీసుకువెళ్లింది. తమ పెళ్లి వేడుకను  అత్యంత ప్రాముఖ్యంగల దానిగా తీర్చిదిద్దాలనుకునే కపుల్స్ కోసం అంతరిక్షంలో పెళ్లి చేసుకునే అవకాశాన్ని అందిస్తోంది. అయితే సింపుల్ గా మనిషికి రూ. కోటి మాత్రమే వసూలు చేస్తానంటోంది. 

స్పేస్ పర్ స్పెక్టివ్ అనే కంపెనీ జంటలకు అంతరిక్షంలో వివాహం చేసుకొని అవకాశాన్ని కల్పిస్తోంది. దీనికోసం స్పేస్ నెప్ట్యూన్ ఫ్లైట్  ఒకదాన్ని రూపొందించింది. స్పేస్ నెప్ట్యూన్  అనే ఈ కార్బన్ న్యూట్రల్ బెలూన్ లో.. వివాహం చేసుకోవాలనుకునే జంటలను.. కక్ష్యలోకి పంపుతాయి. తద్వారా జంటలకు అంతరిక్షంలో పెళ్లి చేసుకునే  అవకాశాన్ని కల్పిస్తామని ప్రకటించింది.

ఇంకా దీని గురించి నిర్వహకులు మాట్లాడుతూ స్పేస్ షిప్ నెప్ట్యూన్ ఫ్లైట్ 6 గంటలు ఉంటుంది అని.. ఇది అత్యంత అద్భుతంగా ఉంటుందని చెబుతున్నారు. భూమి నుంచి దాదాపు లక్ష అడుగుల ఎత్తులో అతిథులను పైకి తీసుకువెళ్లి వివాహ వేడుకను చూపిస్తుంది. ఆ తర్వాత మళ్లీ వెనక్కి తీసుకొస్తుంది. దీని కోసం ఎలాంటి రాకెట్లు  ఉపయోగించరు. కార్బన్ ప్రమేయం ఉండదు. కేవలం పునరుత్పాదక హైడ్రోజన్ సహాయంతో నడుపుతారట. దీనిని 2024 లో ప్రారంభించాలని నిర్వాహకులు అనుకుంటున్నారు. ఇప్పటికే వెయ్యి టికెట్లు అమ్మినట్లు చెబుతున్నారు. 

స్పేస్ షిప్ నెప్ట్యూన్ ఫ్లైట్ లో అత్యాధునిక సౌకర్యాలు ఉంటాయని.. అందుకే దీంట్లో ప్రయాణించేటప్పుడు చాలా ఎంజాయ్ చేయొచ్చని నిర్వాహకులు ఊరిస్తున్నారు. లక్ష అడుగుల ఎత్తులో క్యాప్సూల్ ఉంటుంది కాబట్టి.. భూమిని 360 డిగ్రీలలో భూమిని వీక్షించేందుకు పెద్ద పెద్ద అద్దాలు ఏర్పాటు ఉంటుందని చెబుతున్నారు. 

అయితే.. ఈ క్యాప్సూల్ లో రెస్ట్ రూం కూడా ఉంటుందని.. అన్ని సౌకర్యాలతో.. ఎంతో బాగుంటుందని తెలిపారు. వైఫై కనెక్షన్ అత్యధిక స్పీడ్ తో అందుబాటులో ఉంటుంది. దీనివల్ల చాట్ చేసుకునే అవకాశం ఉంటుందని తెలిపారు. నెఫ్ల్యూన్ స్పేస్ కొత్త జంటలకు ఒక చిరస్మరణీయమైన అనుభవాన్ని ఈ స్పేస్ఫ్ షిప్ అందిస్తుందని స్పేస్ పర్స్పెక్టివ్ సహ వ్యవస్థాపకుడు జాన్ పొయింటర్ అంటున్నారు. 

ఇప్పటికే దాదాపుగా ఇలా వివాహాలు చేసుకోవడానికి వేయి టికెట్లు అమ్ముడుపోయినట్లుగా చెబుతూ.. అంతరిక్షంలో నక్షత్రాల మధ్య వివాహం చేసుకోవడానికి చాలామంది ఉత్సాహంగా ఉన్నారని అన్నారు. ఈ జాబితా చాలా పెద్దదిగానే ఉందని.. అయితే, అంతరిక్షంలో  మొదటిసారిగా వివాహం చేసుకునే..మొదటి వ్యక్తి ఎవరో వేచి చూద్దాం’ అని కూల్ గా చెప్పుకొచ్చారు. ఇక ఈ స్పేస్ షిప్ క్యాప్సూల్ లో 8 మంది ప్రయాణికులు ఒక పైలెట్ ప్రయాణించేలా సౌకర్యమంతమైన ఏర్పాటు ఉందని చెప్పారు. డైనింగ్ రూమ్ టేబుల్ కూడా క్యాప్సుల్లో అందుబాటులో ఉంటుందని పోయెటర్ చెప్పుకొచ్చారు 
 

Follow Us:
Download App:
  • android
  • ios