Asianet News TeluguAsianet News Telugu

వయసు 28.. సంతానం 9... సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న అమెరికా మహిళ...

ఓ మహిళ 28 యేళ్లకే 9మందికి జన్మనిచ్చి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆమె ఫ్యామిలీ ప్లానింగ్ ప్రయత్నాలు విఫలం అవ్వడం వల్లే ఇలా జరిగిందట. 

Woman Gave Birth To 9 Kids By The Age Of 28 goes viral in social media - bsb
Author
First Published Mar 20, 2023, 10:13 AM IST

అమెరికా : ప్రస్తుతం అమెరికాకు చెందిన ఓ మహిళ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 28 ఏళ్ల వయసుకే 9 మందికి జన్మనిచ్చి అందరూ ముక్కున వేలేసుకునేలా చేసింది. ప్రస్తుతం 39 ఏళ్ల వయసున్న కోరా డ్యూక్ అనే మహిళ అమెరికాలోని నెవాడా రాష్ట్రంలో ఉంటుంది. ఆమెకు 9 మంది సంతానం. 2001లో ఆమెకు 17 ఏళ్ల వయసులో మొదటిసారిగా గర్భం దాల్చింది. 2012లో ఆమె తన చివరి సంతానమైన తొమ్మిదో బిడ్డకు జన్మనిచ్చింది. ప్రస్తుతం వీరిలో 8 మంది, తన భర్త  ఆండ్రే డ్యూక్ తో కలిసి ఉంటుంది. మూడో సంతానం పుట్టిన ఏడు రోజులకే కన్నుమూసిందట. 

ఇందులో ఆశ్చర్యం ఏముంది అనుకుంటున్నారా…?  భారత్ లో అయితే  మన అమ్మమ్మలు, తాతమ్మల కాలంలో ఇది మామూలే కదా? అనుకుంటున్నారా… కానీ అది జరిగింది అమెరికాలో.. ఒకరు లేదా ఇద్దరు చాలు అనుకునే నేటి కాలంలో.. ఎంతో అభివృద్ధి చెందిన  దేశంలో.. ఇలాంటి ఘటన వెలుగు చూడడంతో ప్రస్తుతం ఇది వైరల్ గా మారింది. ఇంతకీ ఇది ఎలా వెలుగులోకి వచ్చిందంటే.. ఇటీవల కోరా డ్యూక్ తన 8 మంది సంతానంతో కలిసి ఓ టిక్ టాక్ వీడియో చేసింది. అది సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ గా మారింది. 

కాలువలో పడ్డ బస్సు.. 16 మంది మృతి, 30 మందికి తీవ్ర గాయాలు

కుటుంబమంతా ఒకే రంగు డ్రెస్ వేసుకొని.. పిల్లలను వయసుల వారీగా నిల్చోబెట్టి.. వారిని ఒక్కొక్కరిని పరిచయం చేస్తూ ఆ వీడియో తీసింది.  అది నేటిజనులను విపరీతంగా ఆకర్షించింది. అయితే తాను కావాలని ఇంతమంది పిల్లలను కనలేదని చెప్పడం కొసమెరుపు. కుటుంబ నియంత్రణ కోసం తాము సంప్రదాయ పద్ధతులు పాటించామని.. కానీ అవి విఫలం అవడం వల్లే ఇన్నిసార్లు గర్భం ధరించాల్సి వచ్చిందని తెలిపింది. తొమ్మిదో బిడ్డ పుట్టిన తర్వాత.. కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకోవడం ద్వారా పుల్ స్టాప్ పెట్టినట్లుగా చెప్పుకొచ్చింది. 

Follow Us:
Download App:
  • android
  • ios