విమానంలో ఓ మహిళకు ఘోరమైన అవమానం జరిగింది. మూత్ర విసర్జనకు టాయ్ లెట్ లోకి వెళ్లనివ్వకుండా మహిళను విమానం సిబ్బంది అడ్డుకున్నారు. ఈ సంఘటన కొలంబియాలో చోటుచేసుకుంది. 

పూర్తి వివరాల్లోకి వెళితే... గత నెలలో ఐర్లాండ్‌లోని డబ్లిన్‌ వెళ్లేందుకు ఓ 26 ఏళ్ల మహిళ కొలంబియా విమానాశ్రయంలో ఎయిర్ కెనడా విమానం ఎక్కారు. అయితే సాంకేతిక లోపం వల్ల ఆ విమానం రెండు గంటల పాటు నిలిచిపోయింది. ఈ క్రమంలో విమానంలో ఉన్న మహిళ మూత్ర విసర్జన కోసం టాయిలెట్‌కు వెళ్లబోయారు. విమాన సిబ్బంది టాయిలెట్‌లోకి అనుమతించలేదు. తనకు ఇబ్బందిగా ఉందని, త్వరగా టాయిలెట్‌కు వెళ్లాలని సిబ్బందిని ప్రాధేయపడినా కనికరించలేదు. టాయిలెట్‌లోకి వెళ్లేందుకు వెళ్లిన ప్రతిసారి ఆమెను అడ్డుకున్నారు.

దీంతో చేసేది ఏమిలేక తాను కూర్చున సీటులోనే మూత్ర విసర్జన చేశారు. అయినప్పటికీ సిబ్బంది కనికరించకుండా ఆమెను అదే సిటులో కూర్చొబెట్టి 7గంటల ప్రయాణం చేయించారు. ఆమె కెనాడియన్‌ సీటీకి వెళ్లాక ఓ హోటల్‌కి వెళ్లి స్నానం చేసి దుస్తులు మార్చుకున్నారు. అనంతరం విమానాశ్రయానికి వెళ్లి సిబ్బందిపై ఫిర్యాదు చేశారు. తనను ఘోరంగా వేధించారని, వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.