తాను అందరి ముందు ప్యాంట్ మార్చుకున్న తర్వాత లోపలికి అనుమతించారని చెప్పడం గమనార్హం. ఈ విషయాన్ని ఆమె ట్విట్టర్ లో షేర్ చేసి అమెరికన్ ఎయిర్ ఎయిర్ లైన్స్ ని ట్యాగ్ చేశారు.

విమాన ప్రయాణం చేయడానికి వెళ్లిన ఓ మహిళకు చేదు అనుభవం ఎదురైంది. తనను అందరి ముందు ప్యాంట్ ఇప్పాలంటూ ఎయిర్ లైన్స్ సిబ్బంది తనపై బలవంతం చేశారంటూ ఓ మహిళ ఆరోపించడం గమనార్హం. వారి కారణంగా తాను ఎయిర్ పోర్టులో ప్యాంట్ మార్చుకోవాల్సి వచ్చిందని చెప్పడం గమనార్హం.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

హాస్యనటి క్రిస్సీ మేయర్ తన స్నేహితురాలు కీను థాంప్సన్‌తో కలిసి అమెరికన్ ఎయిర్‌లో ప్రయాణిస్తున్నారు. అయితే వారు ఫ్లైట్ ఎక్కే ముందు, ఎయిర్‌పోర్ట్ సిబ్బంది మెంబర్‌ని డీసెంట్ బాటమ్ వేర్‌గా మార్చమని అడిగడం విశేషం. ఆమె ధరించిన ప్యాంట్ బాలేదని, మరోటి వేసుకోవాలని వారు చెప్పారట. తాను అందరి ముందు ప్యాంట్ మార్చుకున్న తర్వాత లోపలికి అనుమతించారని చెప్పడం గమనార్హం. ఈ విషయాన్ని ఆమె ట్విట్టర్ లో షేర్ చేసి అమెరికన్ ఎయిర్ ఎయిర్ లైన్స్ ని ట్యాగ్ చేశారు. తాను ప్యాంట్ మార్చుకోవడానికి ముందు ధరించిన ప్యాంట్ తో ఉన్న ఫోటోలను కూడా ఆమె షేర్ చేశారు.

Scroll to load tweet…

వాళ్లు అలా చేయడం తనకు చాలా అవమానకరంగా అనిపించిందని ఆమె తన బాధను వ్యక్తం చేశారు. బాటమ్ వేర్ మార్చడానికి ముందు, తర్వాత ఫోటోలను ఆమె షేర్ చేశారు. కాగా క్రిస్పీ మేయర్ ట్వీట్ కి సదరు ఎయిర్ లైన్స్ సిబ్బంది స్పందించారు. ఆమె ఎదుర్కొన్న సంఘటన చాలా బాధకరమని చెప్పారు. అయితే.. తనకు ఎదురైన సందర్భాన్ని తమ ఎయిర్ లైన్స్ కి డైరెక్ట్ మెసేజ్ చేయాలని వారు ఆమెను కోరడం విశేషం.