Asianet News TeluguAsianet News Telugu

లేడీబాస్ పెద్ద మనసు.. ఉద్యోగులకు రూ. 80 లక్షలు క్రిస్మస్ బోనస్..

ఓ లేడీబాస్ పెద్ద మనసు చాటుకుంది. తన దగ్గర పనిచేసే ఉద్యోగులకు లక్ష డాలర్ల క్రిస్మస్ బోనస్ ఇచ్చింది. దీంతో వారి సంతోషానికి అవధులు లేకుండా పోయింది.

Woman boss surprises employees, gives Rs 80 lakh Christmas  bonus to staff
Author
First Published Dec 14, 2022, 8:40 AM IST

ఆస్ట్రేలియా : ఆస్ట్రేలియాలోని ఓ కంపెనీ తన ఉద్యోగులకు క్రిస్మస్ బోనస్ గా ఊహించని సర్ ప్రైజ్ ఇచ్చింది. ఉద్యోగుల ఒక్కొక్కరికి లక్ష డాలర్లు బోనస్గా ఇచ్చింది. వీటి విలువ అక్షరాలా 80 లక్షల రూపాయలకు పైనే.  కరోనా తర్వాత ప్రపంచవ్యాప్తంగా పలు కంపెనీలు కాస్ట్ కటింగ్ ను ఫాలో అవుతున్నాయి. ఉద్యోగులను తొలగించడం.. లేఆఫ్ ల పేరుతో భారాన్ని తగ్గించుకునే ప్రయత్నం చేస్తున్నాయి. దీంతో ఉద్యోగాలు ఎప్పుడు ఉడతాయో అన్న భయంతో ఉద్యోగులు టెన్షన్ పడుతున్నారు. ఈ సమయంలో ఆస్ట్రేలియాలోని మైనింగ్ మొఘల్ గా పేరొందిన జార్జినా హోప్ రెన్ హార్ట్ ఈ విధంగా పెద్ద మనసు చాటుకుంది. దీనికి సంబంధించిన వివరాల్లోకి వెళితే..

రెన్ హార్ట్…ఆస్ట్రేలియాలోని హాన్ కాక్ ప్రోస్పెక్టింగ్ అనే మైనింగ్, అగ్రికల్చరల్ కంపెనీకి ఎగ్జిక్యూటివ్ చైర్మన్, డైరెక్టర్ గా పనిచేస్తున్నారు. ఆస్ట్రేలియాలోని అత్యంత సంపన్నుల జాబితాలో ఆమె పేరు కూడా ఉంది. 34 బిలియన్ డాలర్ల సంపద ఆమె సొంతం. ఈ కంపెనీ ఆమె తండ్రి స్థాపించారు. రాయ్ హిల్ అనే సంస్థ ఉద్యోగులతో రెన్ హార్ట్ ఇటీవల సమావేశమయ్యారు.  అది హాన్ కాక్ ప్రోస్పెక్టింగ్ కే చెందిన మరో సంస్థ. వారితో మాట్లాడుతూ ఆమె ఒక పది మంది పేర్లు చదివారు.

పొరపాటున బ్యాంకు ఖాతాలోకి రూ. 4.6 కోట్లు.. అంతా ఊడ్చేసిన ఆ యువకుడు.. పోలీసులు ఏం చేశారంటే?

వీరికి లక్షల అమెరికన్ డాలర్లు క్రిస్మస్ బోనస్ గా ప్రకటించారు. దీంతో అందరూ ఆశ్చర్యంలో మునిగిపోయారు. ఆమె ప్రకటన విన్న సదరు ఉద్యోగులు సంతోషంతో నోట మాట రాకుండా అయ్యారు. బోనస్ అందుకున్న వారిలో మూడు నెలల క్రితమే కంపెనీలో చేరిన ఒక ఉద్యోగి కూడా ఉండడం గమనార్హం. గడిచిన 12 నెలల కాలంలో ఆ కంపెనీ లాభాలు 3.3 బిలియన్ డాలర్లు ఉన్నాయట. ఈ మేరకు ఆస్ట్రేలియా మీడియా వివరాలు వెల్లడించింది. 

Follow Us:
Download App:
  • android
  • ios