ఫ్రాన్స్, నైస్‌లోని చర్చిలో గురువారం ఒ దుండగుడు, ఒక మహిళపై కత్తితో దాడిచేసి మెడనరికేశాడు. ఆమెతో పాటు మరో ఇద్దరు వ్యక్తులను కూడా  చంపినట్లు పోలీసులు తెలిపారు, ఇది ఉగ్రవాదుల పనే అని నగర మేయర్ అంటున్నాడు. 

నగరంలోని నోట్రే డేమ్ చర్చ్ సమీపంలో కత్తి దాడి జరిగిందని, దాడి చేసిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారని మేయర్ క్రిస్టియన్ ఎస్ట్రోసి ట్విట్టర్‌లో తెలిపారు. ఈ దాడిలో ముగ్గురు మరణించినట్లు నిర్ధారించామని, పలువురు గాయపడ్డారని పోలీసులు తెలిపారు.

మహిళ మెడకోసం హత్య చేశారనే విషయాన్ని ఫ్రెంచ్ రాజకీయ నాయకుడు మెరైన్ లే పెన్ కూడా నిర్థారించారు. ఈ దాడిపై దర్యాప్తు చేయమని కోరినట్లు ఫ్రెంచ్ యాంటీ టెర్రరిస్ట్ ప్రాసిక్యూటర్ విభాగం తెలిపింది.

ఈ ఘటన తరువాత నైస్ లోని జీన్ మెడెసిన్ అవెన్యూలోని చర్చి చుట్టూ పోలీసులు ఆయుధాలతో భద్రతా ఏర్పాట్లు చేశారు. సంఘటనా స్థలంలో అంబులెన్స్‌లు, ఫైర్‌ సర్వీస్‌ లు నిరంతరం పనిచేస్తున్నాయి.

ఈ నెల మొదట్లో పారిస్‌లోని ఫ్రెంచ్ మిడిల్ స్కూల్ టీచర్ శామ్యూల్ పాటీని చెచెన్ ఆరిజిన్ కు చెందిన వ్యక్తి శిరచ్ఛేదం జరిగింది. చారిత్ర పాఠాల్లో భాగంగా మహమ్మద్ ప్రవక్త చిత్రాలను విద్యార్థులకు చూపించాడన్న కారణంగా పాటీని శిక్షించడానికే ఈ దాడి చేశానని దాడి చేసిన వ్యక్తి తెలిపాడు.  అయితే నైస్ దాడి వెనుక ఉద్దేశ్యం ఏమిటో ఇంకా తెలియలేదు.