బ్రిటన్‌ల

లండన్: బ్రిటన్ లో కరోనా స్ట్రెయిన్ కేసులు ఉధృతమౌతున్న తరుణంలో లాక్ డౌన్  ఆంక్షలను మరింత కఠినంగా అమలు చేస్తున్నారు. లాక్‌డౌన్ నిబంధనలను ఉల్లంఘించిన ఓ మహిళను పోలీసులు అరెస్ట్ చేశారు.

దేశంలో కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. దీంతో దేశంలో లాక్ డౌన్ విధించారు. లాక్ డౌన్ నిబంధనలను ఉల్లంఘించిన వారిపై కఠినంగా చర్యలు తీసుకోవాలని పోలీసులను ప్రభుత్వం ఆదేశించింది.

నిబంధనలు ఉల్లంఘించే వారిపై పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నారు. లాక్ డౌన్ నిబంధనలను ఉల్లంఘించినవారిని తొలుత హెచ్చరిస్తారు. హెచ్చరికలను ఖాతరు చేయని వారికి జరిమానా విధిస్తారు, అప్పటికి వినకపోతే   వారిని అరెస్ట్ చేస్తారు.

శనివారం నాడు సముద్రం దగ్గర బెంచీపై కూర్చొన్న మహిళను నలుగురు పోలీసులు అరెస్ట్ చేశారు. నిబంధనలను ఉల్లంఘించిన ఓ వ్యక్తికి 200 స్టైర్లింగ్ పౌండ్ల ఫైన్ విధించారు.  ఓ మహిళను హెచ్చరించి ఇంటి వద్ద వదిలారు.