ఏ  కష్టం వచ్చిందో లేక ఉన్మాదిగా మారిందో కానీ తన ముగ్గురు ఆడబిడ్డలను హతమార్చి, అనంతరం తానూ ఆత్మహత్యకు యత్నించింది.  నా ముగ్గురు బిడ్డలను చంపేసా.. నేను కూడా చావబోతున్నానంటూ వచ్చిన ఫోన్ కాల్‌తో పోలీసులు షాక్‌కు గురైన ఉదంతం ఆస్ట్రియాలో జరిగింది.

వివరాల్లోకి వెళితే.. రాజధాని వియన్నాలోని డొనాస్టడ్‌ జిల్లాకు చెందిన మహిళకు తొమ్మిది, మూడేళ్ల వయస్సు గల ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. ఎనిమిది నెలల క్రితం ఆమె మరో ఆడశిశువుకు జన్మనిచ్చింది. 

ఈ క్రమంలో శనివారం ఉదయం ఐదున్నర గంటల సమయంలో పోలీసులకు ఫోన్‌ చేసి తమ ఇంటికి రావాల్సిందిగా కోరింది. తన కుమార్తెలను చంపేశానని, తాను కూడా ఆత్మహత్య చేసుకోబోతున్నట్లు వారికి చెప్పింది.

వెంటనే అప్రమత్తమైన పోలీసులు నిందితురాలి ఇంటికి బయల్దేరారు. రక్తపు మడుగులో పడి ఉన్న బాలికల మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటన నిందితురాలికి కూడా గాయాలు అయ్యాయని, ఆమె కోలుకున్న తర్వాతే విచారణ జరుపుతామని పేర్కొన్నారు.