ఆమె అతడిని ఎంతగానో ప్రేమించింది. అతనితోనే జీవితం పంచుకోవాలని ఆశపడింది. అప్పటికే వారిద్దరూ కలిసి సహజీవనం కూడా చేస్తున్నారు. అయితే.. అతను మాత్రం ఆమెను దారుణంగా మోసం చేయాలని అనుకున్నాడు. ప్రియురాలిని వదిలించుకొని.. వేరే యువతితో పెళ్లి కి సిద్ధపడ్డాడు.

ఈ విషయం కాస్త ప్రియురాలికి తెలిసిపోయింది. తనను ఇంత దారుణంగా మోసం చేయాలనుకున్న ప్రియుడిపై ఆమె పగపెంచుకుంది. అంతే.. ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించిన ప్రియుడినే అతి కిరాతకంగా హత్య చేసింది. అక్కడితో ఆగకుండా.. అతని ప్రైవేట్ పార్ట్స్ ని కత్తిరించి.. వాటితో ఏకంగా బిర్యానీ వండేసింది. ఈ సంఘటన ఉత్తర ఆఫ్రికాలో చోటుచేసుకోగా... ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

ఉత్తర ఆఫ్రికాలోని మొరాకోకు చెందిన 30 ఏళ్ల మహిళ ఏడేళ్లుగా ఓ వ్యక్తితో సహజీవనం చేస్తోంది. ఈ క్రమంలో అతడు మరో యువతితో సన్నిహితంగా ఉంటున్నట్లు ఆమె అనుమానించింది.

ఇదే విషయం ప్రియుడిని అడుగగా అతడు ఆ యువతిని పెళ్లి చేసుకుంటున్నట్లు చెప్పాడు. దీంతో ఆ మహిళ ప్రియుడితో గొడవపడింది. ఈ క్రమంలో అతడిని హత్య చేసింది. అయితే ఈ విషయం బయటరాకుండా ఉండేందుకు అతడి మృతదేహాన్ని మాయం చేయాలనుకుంది. దీంతో అతడి శరీరాన్ని ముక్కలుగా కోసి అతడి ప్రైవేటు భాగాలు(పురుషాంగం, వృషణాలు)తో బిర్యానీ వండింది. 

దానిని పక్కనే భవన నిర్మాణం పనులు చేస్తున్న కూలీలకు వడ్డించింది. ఆ తర్వాత మిగిలిన శరీరా భాగాలను కుక్కలకు వేసింది. అయితే ఆ వ్యక్తి ఎంతకి ఇంటికి రాకపోవడం, అతడి ఫోన్‌ కూడా స్విచ్చాఫ్‌ రావడంతో మృతుడి కుటుంబ సభ్యులు అనుమానించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అతడి ఆచూకి కనిపించకపోవడంతో సదరు మహిళపై కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేశారు. 

కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు సదరు మహిళ ఇంటిలో సోదాలు నిర్వహించారు. ఈ క్రమంలో పోలీసులు మిక్సీలో దంతాలు గుర్తించారు. వాటిని స్వాధీనం చేసుకుని పరీక్షించగా అవి మృతుడివే అని తేలడంతో పోలీసుల ఆమెను అదుపులోకి తీసుకున్నారు. విచారణలో నిందితురాలు చెప్పిన విషయాలకు పోలీసులు కూడా షాకయ్యారు. దీంతో సదరు మహిళపై కేసు నమోదు చేసి ఆమె మానసిక పరిస్థితి తెలుసుకునేందుకు పోలీసులు ఆస్పత్రికి తరలించారు.