ఉక్రెయిన్, రష్యా మధ్య జరుగుతున్న యుద్ధం ప్రపంచ దేశాలపై ప్రభావం చూపుతోెంది. అయితే ఈ ప్రభావం ఇప్పుడు బీజింగ్ పారాలింపిక్స్ పై కూడా పడింది. ఈ క్రీడల నుంచి రష్యా, బెలారస్ అథ్లెట్లను నిషేదించాలని అంతర్జాతీయ పారాలింపిక్ కమిటీ నిర్ణయించింది. 

ఉక్రెయిన్ (ukraine)కు, ర‌ష్యా (russia)కు జ‌రుగుతున్న యుద్ధంలో ఆయా దేశాల పాత్రల కారణంగా రష్యా, బెలారసియన్ అథ్లెట్లను వింటర్ పారాలింపిక్ గేమ్స్ నుంచి నిషేదించారు. ఈ మేర‌కు అంతర్జాతీయ పారాలింపిక్ కమిటీ (IPC) వివ‌రాలు వెల్ల‌డించింది. ‘‘ప్రత్యేక స‌మావేశం అనంత‌రం బీజింగ్ 2022 పారాలింపిక్ వింటర్ గేమ్స్ కోసం RPC, NPC బెలారస్ నుంచి అథ్లెట్ల ఎంట్రీలను తిరస్కరించాలని IPC పాలక మండలి నిర్ణయించింది’’ అని IPC ఒక ప్రకటన విడుద‌ల చేసింది. 

అంటే మార్చి 4, 2022న ప్రారంభమయ్యే ఈ గేమ్‌లలో ఆయా దేశాలకు చెందిన పారా అథ్లెట్‌లు పాల్గొనేందుకు ఇకపై అనుమ‌తి ఉండ‌దు. ఈ సమావేశం సంద‌ర్భంగా ఐపీసీ ప్రెసిడెంట్ ఆండ్రూ పార్సన్స్ (Andrew Parsons) మాట్లాడుతూ.. ‘‘ ఐపీసీలో క్రీడలు, రాజకీయాలు కలపకూడదని మేము చాలా గట్టిగా విశ్వసిస్తాం. అయితే ఈ సమ‌యంలో యుద్ధం వ‌చ్చింది. అయితే దీని తెరవెనుక అనేక ప్రభుత్వాలు ఉన్నాయి. ఇది మా ప్రతిష్టాత్మకమైన ఈవెంట్‌పై ప్రభావం చూపుతుంది. IPC అనేది సభ్యత్వ-ఆధారిత సంస్థ, మేము మా సభ్య సంస్థల అభిప్రాయాలను స్వీకరిస్తాము ’’ అని తెలిపారు. 

‘‘ నిన్న మా నిర్ణయం తీసుకోవడంలో మేము పారాలింపిక్ ఉద్యమం దీర్ఘకాలిక ఆరోగ్యం, మనుగడను చూశాము. ఏది ఏమైనప్పటికీ వేగంగా పెరుగుతున్న పరిస్థితి ఇప్పుడు మమ్మల్ని ఆటల ప్రారంభానికి చాలా దగ్గరగా ప్రత్యేకమైన, అసాధ్యమైన స్థితిలో ఉంచిందని స్పష్టంగా తెలుస్తుంది.’’ అని ఆండ్రూ పార్సన్స్ ఆయ‌న చెప్పారు. గత 12 గంటల్లో అధిక సంఖ్యలో సభ్యులు మాతో సన్నిహితంగా ఉన్నారని, దీనికి కృత‌జ్ఞ‌త‌లని ఆయ‌న తెలిపారు. అయితే తాము త‌మ నిర్ణ‌యాన్ని పునఃపరిశీలించుకోక‌పోతే అది బీజింగ్ 2022 పారాలింపిక్ వింటర్ గేమ్స్‌కు తీవ్ర పరిణామాలను క‌లిగిస్తుంద‌ని భావించాము. ప‌లు దేశాల అథెట్ల‌ను పోటీలో ఉంచ‌కూడ‌ద‌ని నిర్ణ‌యించామ‌ని అన్నారు. 

రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ద వాతావ‌ర‌ణ నేప‌థ్యంలో క్రీడా సోదరభావం దెబ్బ‌తినే అవ‌కాశం ఉంది. ఈ నేప‌థ్యంలోనే రష్యన్ గ్రాండ్ ప్రిక్స్‌తో సహా రష్యాలో అనేక ఈవెంట్‌ల‌ను రద్దు చేశారు. ఛాంపియన్స్ లీగ్ ఫైనల్ కూడా రష్యాలో నిర్వ‌హించ‌డం లేదు. దానిని పారిస్ లో నిర్వ‌హించాల‌ని నిర్ణ‌యించారు.