ఉక్రెయిన్‌పై రష్యా దాడులు కొనసాగిస్తుంది. పలు కీలక నగరాలపై బాంబుల వర్షం కురిపించడమే కాకుండా.. మిస్సైల్ దాడులతో విధ్వంసం సృష్టిస్తోంది. అయితే జపోరిజ్జియా అణు విద్యుత్ ప్లాంట్‌పై (Zaporizhzhia nuclear power plant) రష్యా బలగాల దాడుల నేపథ్యంలో ఉక్రెయిన్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తుంది.
ఉక్రెయిన్‌పై రష్యా దాడులు కొనసాగిస్తుంది. పలు కీలక నగరాలపై బాంబుల వర్షం కురిపించడమే కాకుండా.. మిస్సైల్ దాడులతో విధ్వంసం సృష్టిస్తోంది. శుక్రవారం జపోరిజ్జియా అణు విద్యుత్ ప్లాంట్‌పై (Zaporizhzhia nuclear power plant) రష్యా సైనికుల దాడితో మంటలు చెలరేగాయని ఎనర్‌దోహర్ మేయర్ చెప్పారు. దీంతో ఎలాంటి విపత్తు ఎదుర్కొవాల్సి వస్తుందో అని ఉక్రెయిన్ ప్రజలలో తీవ్ర ఆందోళన నెలకొంది. ఈ అణు విద్యుత్ ప్లాంట్ యూరప్‌లో అతి పెద్దది. దీంతో ఈ పరిణామాలను ఇతర దేశాలు కూడా జాగ్రత్తగా గమనిస్తున్నాయి. తాజా పరిణామాలపై ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
జపోరిజ్జియా అణు విద్యుత్ కేంద్రంపై రష్యా సైనికులు అన్ని వైపుల నుంచి కాల్పులు జరిపినట్టుగా ఉక్రెయిన్ వర్గాలు తెలిపారు. అణు విద్యుత్ ప్లాంట్‌పై దాడులు ఆపాలని ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి డిమిట్రో కులేబా.. రష్యా సైనికకులను కోరారు. జపోరిజ్జియా అణువిద్యుత్ ప్లాంట్ పేలితే.. దీని ప్రభావం చెర్నోబిల్ కంటే 10 రెట్లు అధికంగా ఉంటుందని ఆందోళన వ్యక్తం చేశారు.
ఆగ్నేయ ఉక్రెయిన్‌లోని పారిశ్రామిక నగరమైన జపోరిజ్జియా వద్ద ఉన్న ఈ స్టేషన్ దేశం యొక్క అణుశక్తిలో 40 శాతం సరఫరా చేస్తుంది. 1986 చెర్నోబిల్ విపత్తు జరిగిన ప్రదేశంతో సహా ఉక్రెయిన్ అణు కేంద్రాలపై అన్ని చర్యలను నిలిపివేయాలని UN యొక్క అంతర్జాతీయ అణుశక్తి సంస్థ ఇప్పటికే రష్యాను కోరింది.
ఇక, ఉక్రెయిన్ పై రష్యా దాడి కొనసాగుతూనే ఉంది. రష్యా మరింత దూకుడుగా ప్రదర్శిస్తుండటంతో అంతర్జాతీయ సమాజం ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఈ క్రమంలోనే శాంతియుతంగా ఈ వివాదాన్ని పరిష్కరించుకోవాలని చాలా దేశాలు కోరుతున్నాయి. అయినప్పటికీ రష్యా ఏమాత్రం పట్టించుకోకుండా దూకుడుగా ముందుకు సాగుతూ.. ఉక్రెయిన్ పై బాంబుల వర్షం కురిపిస్తోంది. ఇప్పటికే పలు మార్లు ఆ దేశ నేతలు అణుబాంబు దాడులు గురించి ప్రస్తావించడం ఉక్రెయిన్ తో పాటు యావత్ ప్రపంచాన్ని ఆందోళనకు గురిచేస్తోంది.
