WikiLeaks: వికీలీక్స్ వ్యవస్థాపకుడు జూలియన్ అసాంజే తన ప్రేయసి స్టెల్లా మోరిస్‌ను వివాహమాడారు. బుధవారం లండన్‌లోని హై-సెక్యూరిటీ జైలులో వారి వివాహం జరిగినట్టు వికీలీక్స్ మీడియా బృందం తెలిపింది. టాప్ బ్రిటీష్ ఫ్యాషన్ డిజైనర్ వివియెన్ వెస్ట్‌వుడ్ మోరిస్ వివాహ దుస్తులను, అసాంజే కోసం కిల్ట్‌ను డిజైన్ చేస్తున్నట్లు పేర్కొంది.
WikiLeaks: వికీలీక్స్ వ్యవస్థాపకుడు జూలియన్ అసాంజే తన సహచరిణి, న్యాయవాది స్టెల్లా మోరిస్‌ను బుధవారం వివాహమాడారు. ప్రస్తుతం ఆయన ఉన్న ఆగ్నేయ లండన్‌లోని బెల్మార్ష్ జైల్లో భారీ భద్రత మధ్య ఉదయం విజిటింగ్ అవర్స్‌లో వీరి వివాహం జరిగింది. కేవలం నలుగురు అతిథులు, ఇద్దరు అధికారిక సాక్షులతోపాటు ఇద్దరు సెక్యూరిటీ గార్డుల మధ్య విజిటింగ్ హవర్స్ సమయంలో ఈ వేడుక జరిగింది. టాప్ బ్రిటీష్ ఫ్యాషన్ డిజైనర్ వివియెన్ వెస్ట్‌వుడ్.. మోరిస్ వెడ్డింగ్ గౌను, అస్సాంజ్ కిల్ట్‌ను డిజైన్ చేసినట్టు వికీలీక్స్ పేర్కొంది.
రాయబార కార్యాలయంలో నివసిస్తున్నప్పుడు అసాంజే తన న్యాయవాది మోరిస్‌తో కలిసి ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చాడు. 2011లో తన న్యాయ బృందంలో పని చేస్తున్నప్పుడు మోరిస్ను కలిశారు. 2015 నుంచి వాళ్లిద్దరూ రిలేషన్లో ఉన్నారు. వీరి నిశ్చితార్థం నవంబర్ 2021లో జరిగింది. కానీ పలు కారణాల వల్ల వారి పెళ్లి వాయిదా పడుతూ వస్తుంది. చివరికి గవర్నర్, జైలు అధికారుల ప్రత్యేక అనుమతితో వీరి పెళ్లి జరిగింది. వికీలీక్స్ ప్రకారం.. వందలాది మంది అసాంజే మద్దతుదారులు ఈ కార్యక్రమ సమయంలో జైలు వెలుపల చేరుకోనున్నారని తెలిపింది.
కాగా.. అసాంజే తన వికీలీక్స్ ద్వారా US మిలిటరీ డేటా, దౌత్య అంశాలను బహిర్గతం చేశారనే ఆరోపణలకు సంబంధించి విచారణను ఎదుర్కొంటున్నారు. 50 ఏళ్ల అసాంజే 2019 నుంచి బెల్మార్ష్ జైలులో ఉన్నారు. దీనికి ముందు లండన్‌లోని ఈక్వెడార్ రాయబార కార్యాలయంలో ఏడు సంవత్సరాలు ఉన్నారు.
ఇంతకీ మోరిస్ ఎవరు?
స్టెల్లా మోరిస్ జూలియన్ అసాంజే యొక్క న్యాయవాది. 1983లో దక్షిణాఫ్రికాలో జన్మించిన ఆమె దాదాపు 20 ఏళ్లు లండన్‌లో నివసించారు. ఆమె స్పానిష్ మరియు స్వీడిష్ సంతతికి చెందినది. మోరిస్ వ్యక్తిగత జీవితం ఎక్కువగా తెలియదు ఎందుకంటే ఆమె చాలా అరుదుగా బహిరంగంగా కనిపిస్తుంది. 2015లో అసాంజేతో ఆమె అనుబంధం బహిరంగమైన తర్వాత ఆమె మీడియా దృష్టిని ఆకర్షించింది. జూలియన్ అసాంజే యొక్క నిరంతర న్యాయపరమైన సమస్యల కారణంగా వారు ఆరేళ్లపాటు రహస్యంగా తమ బంధాన్ని ప్రారంభించారు.
అసాంజేను స్వీడన్‌కు అప్పగించడం, అనుచిత ప్రవర్తన, దుష్ప్రవర్తన ఆరోపణలను తప్పించుకోవడానికి రాయబార కార్యాలయంలో దాక్కొవడానికి ఆమె ఎంతోగానో కృషి చేసింది. జర్నలిస్ట్ ఆరోపణలను తిరస్కరించడంతో చివరికి అభియోగాలను ఉపసంహరించు కున్నారు. ఆమె తన భాగస్వామి చట్టపరమైన సవాళ్లతో పోరాడుతూనే ఉంది. అసాంజేను యునైటెడ్ స్టేట్స్‌కు అప్పగించడాన్ని గట్టిగా వ్యతిరేకించింది. గత నెలలో.. ఆమె లండన్ జైలులో అసాంజేను వివాహం చేసుకోవడానికి కూడా నమోదు చేసుకుంది.
