Asianet News TeluguAsianet News Telugu

రెండో పెళ్లి చేసుకుంటానన్న భర్త, చేతివేళ్లు విరగ్గొట్టిన భార్య.. జైలుశిక్ష, దేశబహిష్కరణ విధించిన కోర్టు...

భర్త తాను రెండో పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నట్లు భార్యతో చెప్పాడు అంతే ఆ మాట విన్న wife కోపంతో ఊగిపోయింది. భర్తపై attackకి దిగింది. చేతికి అందిన వాటితో భర్తపై దాడి చేసింది. ఆమె చర్యతో షాకైన husband తేరుకుని భార్యను అడ్డుకునే ప్రయత్నం చేశాడు. కానీ ఆమె ఆగలేదు సరికదా.. భర్తను ఇష్టానుసారంగా కొట్టింది. దీంతో భర్త కూడా ఆమెపై చేయి చేసుకున్నాడు.

wife breaks husbands fingers as he intends to marry again in dubai
Author
Hyderabad, First Published Jan 18, 2022, 12:20 PM IST

దుబాయ్ : couple మధ్య రెండో పెళ్లి విషయమై జరిగిన గొడవ కాస్తా కోర్టుకెక్కింది. దాంతో Dubai Court దంపతులకు ఆరు నెలల జైలు శిక్ష విధించింది. అలాగే శిక్ష కాలం పూర్తయిన వెంటనే దేశం నుంచి వెళ్లిపోవాలని తీర్పునిచ్చింది. వివరాల్లోకి వెళితే.. dubaiలో ఉండే ఆసియాకు చెందిన యువ దంపతుల మధ్య రెండో పెళ్లి విషయమై ఘర్షణ జరిగింది.

భర్త తాను రెండో పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నట్లు భార్యతో చెప్పాడు. అది విన్న భార్య ముందు షాక్ అయ్యింది. ఆ తరువాత కోపంతో ఊగిపోయింది. తనను పెళ్లి చేసుకుని ఇప్పుడు రెండో పెళ్లి అంటున్నాడని భర్తపై attackకి దిగింది. చేతికి అందిన వాటితో భర్తపై దాడి చేసింది. ఆమె చర్యతో షాకైన husband తేరుకుని భార్యను అడ్డుకునే ప్రయత్నం చేశాడు. కానీ ఆమె ఆగలేదు సరికదా.. భర్తను ఇష్టానుసారంగా కొట్టింది. దీంతో భర్త కూడా ఆమెపై చేయి చేసుకున్నాడు.

ఈ క్రమంలో భర్త నుంచి తప్పించుకునేందుకు భార్య అతడిని బలంగా వెనక్కి నెట్టేసింది. ఆ తోపుకు భర్త వెనక్క విరుచుకు పడ్డాడు. అయితే అతడు కింద పడే సమయంలో నేలకు గట్టిగా తాకాడు. ఆ సమయంలో దెబ్బ తగలకుండా ఉండేందుకు.. కుడిచేతిని నేలకు ఆనించాడు. దీంతో చేతిమీద బలం ఎక్కువ కావడంతో వేళ్లు విరిగిపోయాయి. ఇక భార్యపై భర్త చేసిన దాడిలో ఆమె చేవికి దెబ్బ తగిలింది. దాంతో ఆమెకు వినికిడి సమస్య ఏర్పడింది. 

ఈ నేపథ్యంలో దంపతులిద్దరూ ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకుని కోర్టు మెట్లు ఎక్కారు. తాజాగా దుబాయ్ కోర్టులో ఈ కేసు విచారణకు వచ్చింది.  విచారణ సందర్భంగా దంపతులిద్దరూ తమ వాదనలు వినిపించారు. ఇరువురి వాదనలు విన్న న్యాయస్థానం ఇద్దరిదీ  అంతే తప్పు ఉన్నట్లు నిర్ధారించింది. ఇద్దరికీ చెరో ఆరు నెలల జైలు శిక్ష విధించింది. అలాగే శిక్ష కాలం పూర్తయిన వెంటనే దేశం విడిచి పోవాలని తీర్పునిచ్చింది. 

ఇదిలా ఉండగా, నిరుడు ఏప్రిల్ లో భార్యభర్తల గొడవలో ఏ సంబంధమూ లేని వ్యక్తి ప్రాణాల మీదికి వచ్చింది. భార్యాభర్తల మధ్య గొడవ ఆపేందుకు వెళ్లిన వ్యక్తి అన్యాయంగా హత్యకు గురైన సంఘటన తమిళనాడులోని టీ.నగర్ లో కలకలం రేపింది.

సోమవారం తంజావూరు జిల్లాలో జరిగిన ఈ విషాద ఘటన వివరాల్లోకి వెడితే.. ఒరత్తనాడు పుదూరుకు చెందిన రాజేంద్రన్ (60) ప్రైవేట్ మిల్లులో పనిచేస్తున్నారు. అతనితో పాటు అమ్మాపేటకు చెందిన సూసైరాజ్ పనిచేస్తున్నాడు.

ఇలా ఉండగా సోమవారం రాత్రి మిల్లులో సూసైరాజ్, అతని భార్య మధ్య గొడవ జరిగింది. వారికి సర్దిచెప్పేందుకు రాజేంద్రన్ ప్రయత్నించాడు. ఈ క్రమంలో రాజేంద్రన్, సూసైరాజ్ గొడవ పడ్డారు. 

కోపానికొచ్చి సూసైరాజ్ కత్తితో రాజేంద్రన్ మీద దాడి చేశాడు. దీంతో సంఘటనా స్థలంలోనే రాజేంద్రన్ మృతి చెందాడు. సమాచారం అందుకన్న ఒరత్తనాడు పోలీసులు రాజేంద్రన్ మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం కోసం ప్రభుత్వ ఆస్పత్రికి పంపారు. సూసైరాజ్ ను అరెస్ట్ చేసి విచారణ జరుపుతున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios