Coronavirus: కరోనాకు కొత్తగా మరో రెండు చికిత్సలు.. డబ్ల్యూహెచ్‌వో ఆమోదం !
Coronavirus: ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభిస్తోంది. కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వ్యాప్తి కారణంగా కొత్త కేసులు సైతం రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. పలు దేశాల్లో ఆస్పత్రులు రోగులతో నిండిపోతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ (World Health Organization-WHO) మరో రెండు కొత్త కోవిడ్-19 చికిత్సలకు ఆమోదం తెలిపింది.
Coronavirus: అన్ని దేశాల్లోనూ కరోనా వైరస్ ప్రభావం క్రమంగా పెరుగుతున్నది. Coronavirus కొత్త కేసులు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. పలు దేశాల్లో కరోనా మహమ్మారి విజృంభణ కారణంగా పరిస్థితులు మరింత దారుణంగా మారుతున్నాయి. అమెరికా,బ్రిటన్, ఫ్రాన్స్ సహా పలు యూరప్ దేశాల్లో అక్కడి ఆస్పత్రులన్నీకరోనా రోగులతో నిండిపోతున్నాయి. కరోనా కట్టడికి టీకాలు అందుబాటులోకి వచ్చినప్పటికీ.. అనేక మ్యుటేషన్లకు లోనై.. అత్యంత ప్రమాదకారిగా మారుతోంది కరోనా మహమ్మారి. ఇలాంటి పరిస్థితులు మరింతగా దిగజారకుండా అన్ని దేశాలు చర్యలను చేపట్టాయి. ఈ క్రమంలోనే ప్రపంచ ఆరోగ్య సంస్థ (World Health Organization) మరో రెండు కొత్త కోవిడ్ -19 చికిత్సలకు ఆమోదం తెలిపింది. తీవ్రమైన అనారోగ్యం బారినపడకుండా, మరణాలను అరికట్టడానికి టీకాలతో పాటు పలు ఔషధాలను ఇవ్వడానికి డబ్ల్యూహెచ్‌వో ఆమోదం తెలిపింది. కరోనా వైరస్ (Coronavirus) కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసులు ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య సంరక్షణ వ్యవస్థపై ఒత్తిడి తెచ్చినందున కరోనావైరస్ వ్యాధి (కోవిడ్ -19) కోసం రెండు కొత్త చికిత్సలను WHO ఆమోదించింది. కోవిడ్-19 నుండి తీవ్రమైన అనారోగ్యం మరియు మరణాన్ని అరికట్టడానికి WHO నిపుణులు ఆర్థరైటిస్ డ్రగ్ బారిసిటినిబ్, సింథటిక్ యాంటీబాడీ చికిత్స సోట్రోవిమాబ్‌ని సిఫార్సు చేసింది.
కొత్తగా రెండు ఔషధాలను డబ్ల్యూహెచ్ఓ సిఫార్సు చేసినట్టు బ్రిటిష్ మెడికల్ జర్నల్ బీఎంజీ పేర్కొంది. వైరస్ (Coronavirus) తీవ్రత ఎక్కువగా ఉన్న లేదా పరిస్థితి విషమంగా ఉన్న కోవిడ్ రోగులకు ఆర్థరైటీస్ ఔషధం బారిసిటినిబ్‌ను కార్టికోస్టెరాయిడ్స్‌తో కలిపి వినియోగించవచ్చని డబ్ల్యూహెచ్ఓ నిపుణులు పేర్కొన్నట్టు మెడికల్ జర్నల్ పేర్కొంది. ఈ రెండు చికిత్సల కారణంగా కరోనా బారినపడ్డవారిలో మరణాలు రేటుతో పాటు వెంటిలేటర్ అవసరం తగ్గుతుందని చెబుతున్నారు. అలాగే, వృద్ధులు, రోగనిరోధకశక్తి తక్కువగా ఉన్నవారు లేదా మధుమేహం వంటి దీర్ఘకాలిక వ్యాధులతో ఆస్పత్రిలో చేరే ప్రమాదం ఎక్కువగా ఉన్న నాన్-సీరియస్ కరోనా వైరస్ రోగులకు సింథటిక్ యాంటీబాడీ చికిత్స సోత్రోవిమాబ్‌ను సిఫార్సు చేసింది. Coronavirus తో ఆస్పత్రిలో చేరే అవసరం లేని వ్యక్తులకు Sotrovimab వల్ల ప్రయోజనం ఉంటుందని పేర్కొంది. అయితే, కొత్తగా దక్షిణాఫ్రికలో మొదటగా గుర్తించిన కరోనా వైరస్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ పై ప్రభావం ఎంతమేర ఉంటుందనేదానిపై స్పష్టమైన సమాచారం ఇంకా లేదని World Health Organization పేర్కొంది.
కాగా, కరోనా వైరస్ మహమ్మారి బారినపడ్డవారికి కోసం World Health Organization (డబ్య్లూహెచ్‌వో) ఇప్పటివరకు మూడు కరోనా చికిత్స విధానాలను సిఫార్సు చేసింది. కరోనా విజృంభణ ప్రారంభ సంత్సరమైన 2020లో కోవిడ్-19 తీవ్రత అధికంగా ఉన్న బాధితులకు కోర్టికొస్టెరాయిడ్‌ను వినియోగించవచ్చని డబ్ల్యూహెచ్‌వో (WHO) తెలిపింది. 2021లో కరోనా చికిత్సకు ఆమోదించిన ఆర్థరైటిస్ ఔషధం టోసిలిజుమాబ్, సరిలుమాబ్, IL-6 నిరోధకాలు. ఇవి కోవిడ్-19 ప్రభావాన్ని తగ్గిస్తాయి. ప్రస్తుతం Coronavirus కు మరో రెండు చికిత్సలకు ప్రపంచ ఆరోగ్యం సంస్థ ఆమోదం తెలుపుతూ.. ధరలను, రోగుల పరిస్థితులను అంచనా వేసుకుని ఆయా మందులను ఉపయోగించాని సూచించింది. ఇదిలావుండగా, ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు మొత్తం 321,139,786 కరోనా కేసులు, 5,540,856 మరణాలు సంభవించాయి.