Asianet News TeluguAsianet News Telugu

Salman Rushdie : ఎవ‌రీ సల్మాన్ రష్దీ.. 33 ఏళ్ల కింద‌టే ఇరాన్ ఎందుకు ఫ‌త్వా జారీ చేసింది ?

సల్మాన్ రష్దీ రచించిన ’మిడ్ నైట్ చిల్డ్రన్స్’ అనే పుస్తకానికి బుకర్ ప్రైజ్ లభించింది. కానీ ఆయన మరో రచన ‘ది సాటానిక్ వెర్సె స్’ వివాస్పదం అయ్యింది. ముస్లిం నుంచి ఆయన తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొన్నారు. 

Who is Salman Rushdie? Why did Iran issue a fatwa less than 33 years ago?
Author
First Published Aug 13, 2022, 10:42 AM IST

స‌ల్మాన్ ర‌ష్దీ.. న్యూయార్క్ లో ఓ దుండ‌గుడి చేతిలో క‌త్తిపోటుకు గురై ప్ర‌స్తుతం వెంటిలేట‌ర్ పై చికిత్స పొందుతున్నారు. ఆయ‌న ఆరోగ్య ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగానే ఉంది. క‌న్ను కోల్పోయే ప్ర‌మాదం ఉంద‌ని, అలాగే కిడ్నీలు కూడా దెబ్బ తిన్నాయ‌ని నివేదిల‌కు వెల్ల‌డిస్తున్నారు. ఈ నేప‌థ్యంలో అస‌లు ఎవ‌రు ఆయ‌న ? ఎందుకు ఆయ‌న‌పై క‌త్తి దాడి జ‌రిగింద‌నే విష‌యాలు ప్ర‌స్తుతం అంద‌రి మ‌దిని తొలుస్తున్నాయి. 

భారత్ కు స్వాతంత్య్రం రాక రెండు నెలల ముందు అంటే 1947 జూన్ 19వ తేదీన సల్మా న్ రష్దీ ముంబైలో జ‌న్మించారు. ఆయ‌న గొప్ప ర‌చ‌యిత‌గా పేరు తెచ్చుకున్నారు. ఆయ‌న స్వా తంత్రం వ‌చ్చిన అర్ధరాత్రి జ‌న్మించిన పిల్ల‌ల‌పై ‘మిడ్ నైట్ చిల్డ్రన్స్ (Midnight's Children)’ అనే పుస్తకం రచించారు. ఈ నవ‌ల ఆయ‌న‌కు మంచి పేరు తెచ్చిపెట్టింది. ఈ పుస్త‌కం 1981లో బుకర్ అవార్డును గెలుచుకుంది.

ఆప్-బీజేపీల మ‌ధ్య కొన‌సాగుతున్న మాట‌ల యుద్ధం.. !

ర‌ష్దీపై ఇప్పుడు తీవ్ర‌మైన క‌త్తి దాడి జ‌రిగింది కానీ చాలా కాలంగా ఆయ‌న‌పై ఇలాంటి దాడులు, బెదిరింపులు వ‌స్తూనే ఉన్నాయి. ఆయ‌న చాలా ఏళ్ల నుంచి భ‌యాందోళ‌న మ‌ధ్య జీవ‌నం గడుపుతూనే ఉన్నారు. ఆయ‌న‌పై ఇప్ప‌టి వ‌ర‌కు 15 సార్లు కత్తులతో దాడి జ‌రిగింది. దీనికి ఆయ‌న ర‌చించిన ఓ పుస్త‌క‌మే కారణం. 1988 లో సల్మా న్ రష్దీ ‘ది సాటానిక్ వెర్సె స్ (the satanic verses)’ అనే పుస్తకాన్ని రచించారు. ఈ పుస్త‌కం తీవ్ర వివాదాల‌కు దారి తీసింది. ఈ పుస్త‌క‌తం ఇస్లామిక్ వ్యతిరేక, దైవ దూషణగా ప‌రిగ‌ణ‌లోకి వ‌చ్చింది. దీంతో అత‌డికి ఇరాన్ నుంచి హ‌త్యా బెదిరింపులు వ‌చ్చాయి. ఆ పుస్త‌కాన్ని 1988 సంవ‌త్స‌రంలో ఇరాన్ నిషేధించింది. అప్ప‌టి నుంచి ర‌ష్దీ తీవ్రవాదుల‌కు టార్గెట్ గా ఉన్నారు.

ఇరాన్ నుంచి సల్మా న్ రష్దీకి వ‌చ్చిన బెదిరింపు చిన్నదేమీ కాదు. అప్ప‌టి (33 ఏళ్ల కింద‌ట‌) ఇరాన్ సుప్రీం చీఫ్ అయతుల్లా రుహోల్లా ఖొమేనీ అత‌డి చంపాల‌ని ఫ‌త్వా జారీ చేశారు. అతడిని చంపిన వ్యక్తికిక్తి 3 మిలియన్ డాలర్ల రివార్డు ఇస్తానని ప్రకటించారు. అయితే త‌రువాత ఇరాన్ ప్ర‌భుత్వం అది ఆయ‌న వ్యక్తిగ‌త అభిప్రాయం అంటూ దానిని కొట్టిపారేసింది. అయితే 2012లో సల్మా న్ రష్దీకి ఇర్ నుంచి హ‌త్యా బెదిరింపులు వ‌చ్చాయి. ఇరాన్ కు చెందిన మ‌త సంస్థ ఆ రివార్డ్ మొత్తాన్ని 3.3 మిలియన్ డాల‌ర్ల‌కు పెంచింది. 

ఇంటర్నేషనల్ టేబుల్ టెన్నిస్ ప్లేయర్ కు ఆకతాయిల వేధింపులు.. పోలీసులకు ఫిర్యాదు...

సల్మా న్ రష్దీ ర‌చించిన ది సాటానిక్ వెర్సె స్ పుస్త‌కం ఇండియాలో కూడా నిషేధంలో ఉంది. 1989లో ఇరాన్ అతడిపై ఫత్వా జారీ చేసిన కొద్ది రోజులకే ముంబైలో అల్ల‌ర్లు జ‌రిగాయి. ఈ అల్ల‌ర్ల‌లో 12 మంది మరణించారు. ఈ పుస్త‌కానికి వ్య‌తిరేకంగా ఇంగ్లాడ్ వీధుల్లో రష్దీ బొమ్మ‌లు ద‌హ‌నం చేశారు. అలాగే ఆ పుస్తకానికి సంబంధించిన కాపీల‌ను కూడా ద‌హ‌నం చేశారు. ఒక నెల తర్వాత ఇస్లామాబాద్‌లోని US సమాచార కేంద్రంపై 1000 మంది పాకిస్థానీయులు దాడి చేశారు. ఐరోపాలో కూడా నిరసనలు జరిగాయి.  లండన్ టెహ్రాన్ దాదాపు రెండు సంవత్సరాల పాటు దౌత్య సంబంధాలను తెంచుకున్నాయి.

యునైటెడ్ స్టేట్స్‌లో, సుసాన్ సోంటాగ్ మరియు టామ్ వోల్ఫ్ వంటి రచయితలు రష్దీకి సహాయం చేయడానికి బహిరంగ ఉపన్యాసాలు నిర్వహించారు. ర‌ష్దీ 1990లో ‘‘ఇన్ గుడ్ ఫెయిత్’’ అనే వ్యాసంలో తనను తాను విశదీకరించుకోవడానికి ప్రయత్నించారు. కానీ చాలా మంది ముస్లింలు శాంతించలేదు. ఈ ప‌రిణామాల నేప‌థ్యంలో అత‌డు ఒక ద‌శాబ్దానికి పైగా ‘సేఫ్ హౌస్’ లో గడిపారు. దాదాపు 13 సంవత్సరాల పాటు ఆయ‌న జోసెఫ్ అంటోన్ అనే మారు పేరు తో గ‌డిపాడు. మొదటి ఆరు నెలల్లోనే 56 ప్ర‌దేశాలు మార్చాయి. అత‌డి భాగ‌స్వామి, అమెరికన్ నవలా రచయిత్రి అయిన మరియాన్ విగ్గిన్స్‌తో కూడా క‌లిసి ఉండ‌లేక‌పోయారు. దీంతో ఆయ‌న ఒంట‌రిత‌నం అనుభ‌వించారు.

Delhi police: ఉగ్ర కుట్ర భ‌గ్నం.. 2 వేల‌ తూటాలు స్వాధీనం చేసుకున్న ఢిల్లీ పోలీసులు

కొంత కాలం త‌రువాత ఆయ‌న తిరిగి సాధారణ జీవితాన్ని గడపడం ప్రారంభించాడు. పార్టీలు, ఫంక్షన్లలో క‌నిపించారు. త‌న ఇంటిపేరు కూడా మార్చుకున్నారు. కాగా.. గతంలో ఇరాన్ జారీ చేసిన ఫ‌త్వాను అమ‌లు చేయ‌బోమ‌ని 1998లో ఇరాన్ సంస్కరణవాద అధ్యక్షుడు మొహమ్మద్ ఖతామీ ఫెడరల్ ప్రభుత్వం బ్రిటన్‌కు హామీ ఇచ్చింది. కానీ ఖొమేనీ వారసుడు అయతోల్లా అలీ ఖమేనీ మాత్రం 2005లో రష్దీ మతభ్రష్టుడని తాము న‌మ్ముతున్నామ‌ని పేర్కొన్నాడు. 

సాహిత్యాన్ని అందించినందుకు క్వీన్ ఎలిజబెత్ II రష్దీకి 2007లో నైట్ బిరుదును అందించారు. దీంతో చాలా మంది ముస్లింలు ఉలిక్కిపడ్డారు. దీంతో ఇరాన్ బ్రిటన్‌ను ఇస్లామోఫోబియా అంటూ ఆరోపించింది. అప్ప‌టి నుంచి ఫ‌త్వా అలాగే కొన‌సాగింది. దీనిపై పాకిస్థాన్ లో ప‌లు సంద‌ర్భాల్లో నిర‌స‌న‌లు కొన‌సాగుతూనే ఉన్నాయి. అయితే రష్దీ 1990 చివ‌రి నుంచి న్యూయార్క్‌లో జీవిస్తున్నారు. అజ్ఞాతం నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చిన త‌రువాత ఆయ‌న ఒక సామాజిక వ్యక్తిగా ఎదిగారు. పాశ్చాత్య దేశాలలో చాలా మంది ఆయ‌న‌ను స్వేచ్ఛా వాక్ స్వాతంత్రం ఉన్న హీరోగా చూశారు. ఈ క్ర‌మంలో ఓ కార్య‌క్ర‌మానికి హాజ‌రైన ఆయ‌న‌పై క‌త్తి దాడి జ‌రిగింది. 
 

Follow Us:
Download App:
  • android
  • ios