Asianet News TeluguAsianet News Telugu

ఫైజర్ టీకా అత్యవసర వినియోగానికి డబ్ల్యూహెచ్ వో గ్రీన్ సిగ్నల్..

కొవిడ్ నిరోధానికి ఫైజర్ బయోఎన్ టెక్ రూపొందించిన టీకా అత్యవసర వినియోగానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ గురువారం అంగీకరించింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఈ టీకా దిగుమతి, పంపిణీకి మార్గం సుగమమైంది. అలాగే పేద దేశాలు సైతం దీన్ని త్వరలోనే అందిపుచ్చుకునేందుకు వీలు కలిగింది. ఇప్పటికే ఐరోపా, ఉత్తర అమెరికా దేశాల్లో ఈ టీకాను ప్రజలకు ఇవ్వడం ప్రారంభించిన విషయం తెలిసిందే.

WHO Grants "Emergency Validation" To Pfizer Covid Vaccine - bsb
Author
Hyderabad, First Published Jan 1, 2021, 10:20 AM IST

కొవిడ్ నిరోధానికి ఫైజర్ బయోఎన్ టెక్ రూపొందించిన టీకా అత్యవసర వినియోగానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ గురువారం అంగీకరించింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఈ టీకా దిగుమతి, పంపిణీకి మార్గం సుగమమైంది. అలాగే పేద దేశాలు సైతం దీన్ని త్వరలోనే అందిపుచ్చుకునేందుకు వీలు కలిగింది. ఇప్పటికే ఐరోపా, ఉత్తర అమెరికా దేశాల్లో ఈ టీకాను ప్రజలకు ఇవ్వడం ప్రారంభించిన విషయం తెలిసిందే.

అయితే ఆయా దేశాల్లో ఉండే ప్రత్యేక నియంత్రణా సంస్థలు సైతం ఈ టీకాకు ఆమోదం తెలపాల్సి ఉంటుంది. కానీ ఆరోగ్య వ్యవస్థలు అంత బలంగా లేని పేద దేశాలకు డబ్ల్యూహెచ్ వో ఆమోదమే కీలకంగా మారనుంది. 

తాము ఫైజర్ టీకా అత్యవసర వినియోగానికి అనుమతించడం ద్వారా ప్రపంచ దేశాలు తమ వ్యాక్సిన్ డోసుల కొనుగోలు, పంపిణీని వేగవంతం చేసుకునే వెసులుబాటు కలుగుతుందని డబ్ల్యూహెచ్ వో తెలిపింది. 

బ్రిటన్, అమెరికా సహా మరో డజన్ కు పైగా దేశాల్లో వినియోగంలోకి వచ్చిన ఈ వ్యాక్సిన్ అన్ని భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా ఉందని తమ సమీక్షలో తేలిందని స్పష్టం చేసింది. ఫైజర్ టీకాను అత్యంత శీతల వాతావరణంలో నిల్వ చేయాల్సి ఉంటుంది. 

ఈ నేపథ్యంలో ఈ వసతులు లేని పేద దేశాలకు ఈ టీకా అందిపుచ్చుకుని పంపిణీ చేయడం పెద్ద సవాల్ గా నిలవనుంది. అయితే, అలాంటి దేశాలకు తమ సహకారం అందిస్తామని డబ్ల్యూహెచ్ వో హామీ ఇచ్చింది. ఇప్పటికే దానికి సంబంధించిన ప్రణాళికల్ని రూపొందిస్తున్నట్లు తెలిపింది. 
 
Follow Us:
Download App:
  • android
  • ios