ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధాన్ని రచించిన పుతిన్ టీమ్ ఏది? పుతిన్ స్వయంగా యుద్ధానికి దిగాడా? ఆయన సన్నిహితులు ఎవరు? ఆయనకు సలహాలు ఇచ్చేది ఎవరు? ఆయనతో దగ్గరగా మెదిలే కోర్ టీమ్ ఏది? ఇవన్ని చాలా వరకు బయటి ప్రపంచానికి తెలియని విషయాలే. వాటిపై కొన్ని విశ్వసనీయ వర్గాల నుంచి వివరాలను పరిశీలిద్దాం.
న్యూఢిల్లీ: ఉక్రెయిన్‌పై యుద్ధం చేయాలని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కు సూచనలు ఇచ్చిన వారు ఎవరు? పుతిన్ ఎవరిని ఎక్కువగా విశ్వసిస్తాడు? ఎవరి విషయాలను పరిగణనలోకి తీసుకుంటాడు? ఆయన చుట్టూ ఉన్న అతి ముఖ్యమైన సన్నిహితులు ఎవరు? ఉక్రెయిన్‌పై యుద్ధ తంత్రాన్ని రచించింది ఎవరు? అనే అనుమానాలు రావడం సహజం. అయితే, రష్యా అధికార పీఠంలో చాలా తక్కువ మందే ఉంటారు. చాలా సార్లు నిర్ణయాలు స్వయంగా వ్లాదిమిర్ పుతిన్ తీసుకుంటూ ఉంటారు. అయితే, వ్లాదిమిర్ పుతిన్ చుట్టూ వేళ్లమీద లెక్కించదగిన కొందరు నేతలు ఉన్నారు. పుతిన్ ఏ నిర్ణయం తీసుకున్నా.. వారి ప్రమేయం అందులో కచ్చితంగా ఉండి తీరుతుందనేది నిపుణులు వాదన.
పుతిన్‌కు సూచనలు ఇచ్చే టాప్ కమిటీలో 30 సభ్యులతో కూడిన సెక్యూరిటీ కౌన్సిల్ ఆఫ్ రష్యా ఉంటుంది. వ్లాదిమిర్ పుతిన్ ఎక్కువగా ఈ కౌన్సిల్‌తో మాట్లాడుతుంటారు. అయితే, ఇటీవలి కాలంలో ఈ కౌన్సిల్‌తోనూ ఆయన చర్చలు తగ్గిపోయాయని తెలిసింది. జనవరి, ఫిబ్రవరి నెలల్లో పుతిన్ వారితో జరిపిన సంభాషణలకు సంబంధించిన ఫొటోలు ఈ విషయాన్ని ధ్రువపరుస్తున్నాయి. అయితే, పుతిన్ చుట్టూ ఐదారుగురు వ్యక్తులు ఉంటారని, వారే పుతిన్‌కు చెవులు, నోరుగా ఉంటారని మీడియా రిపోర్టులు చెబుతున్నాయి. అందులోనూ ముఖ్యంగా పుతిన్‌తో ముగ్గురు మరీ సాన్నిహిత్యంగా ఉంటారని వివరిస్తున్నాయి.
నికోలయ్ పత్రుషెవ్:
1970ల నుంచి పుతిన్ వెన్నంటే ఉండే ముగ్గురు వ్యక్తుల్లో అగ్రగణ్యుడు పత్రుషెవ్. విదేశీ వ్యవహారాలకు సంబంధించి పుతిన్‌కు కీలక సలహాలు ఈయన ఇస్తాడు. సోవియట్ యూనియన్ సమయంలో ఉన్న గూఢచార విభాగం కేజీబీలో పుతిన్ పని చేస్తున్నప్పుడు ఆయన కొలిగ్‌గా పత్రుషెవ్ ఉన్నాడు. కేజీబీ చీఫ్‌గా పుతిన్ తప్పుకున్న తర్వాత కేజీబీకి కొనసాగింపుగా వచ్చిన ఎఫ్ఎస్‌బీ చీఫ్‌గా పత్రుషెవ్ 1999 నుంచి 2008 వరకు సేవలు అందించాడు.
ఉక్రెయిన్‌పై పుతిన్ సైనిక చర్య ప్రకటించడానికి ముందు రష్యాను ముక్కులుగా విడగొట్టాలనే అజెండాతో అమెరికా పని చేస్తున్నదని పత్రుషెవ్ ఆయనకు చెప్పినట్టు తెలిసింది. ఆ సమావేశంలోనే ఉక్రెయిన్‌లోని వేర్పాటువాదలు ఆధీనంలోని ప్రాంతాలను గుర్తించాలనే నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం. ప్రపంచం మొత్తం వారిస్తున్నా ఉక్రెయిన్‌పై యుద్ధాన్ని నడిపే నిర్ణయాన్ని పుతిన్ తీసుకోవడం వెనుక పత్రుషెవ్ ఉన్నట్టు భావిస్తున్నారు.
అలెగ్జాండ్ బొర్ట్‌నికోవ్:
పత్రుషెవ్ తర్వాత ఎఫ్‌ఎస్‌బీ చీఫ్‌గా బోర్ట్‌నికోవ్ చేశాడు. ఈయన కూడా కేజీబీలో పని చేస్తున్నప్పుడే పుతిన్‌కు దగ్గరి పరిచయస్తుడు. బోర్ట్‌నికోవ్ నుంచి వచ్చే చాలా సమాచారాన్ని పుతిన్ విశ్వసిస్తాడు. పుతిన్ ఇచ్చిన నమ్మకంతోనే బోర్ట్‌నికోవ్ ఎఫ్‌ఎస్‌బీని పవర్‌ఫుల్ లా ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజెన్సీగా మార్చగలిగాడు. బోర్ట్‌నికోవ్, పత్రుషెవ్‌లలో ఎవరు పుతిన్‌కు సలహాలు ఇస్తారో.. ఎవరు నిర్ణయాలు తీసుకుంటారో? అనేది కూడా గుర్తించలేనంత దగ్గరితనం పుతిన్‌తో వీరికి ఉన్నది. సెర్జీ నారిష్కిన్:
67 ఏళ్ల నారిష్కిన్ రష్యన్ ఫారీన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ చీఫ్. కొన్ని దశాబ్దాలుగా ఈయన పుతిన్ వెంటే ఉంటున్నాడు. పశ్చిమ దేశాలకు ఒక అవకాశం ఇవ్వాలన్న సూచనతో పుతిన్ ఆగ్రహాన్ని ఎదుర్కొన్నాడు. పుతిన్ విమర్శకులు, వ్యతిరేకుల హత్యలు చేయడంలో ఈయన పాత్ర ఉన్నట్టు పలు ఆరోపణలు ఈయన ఎదుర్కొంటున్నాడు.
సెర్జీ షోయిగు:
పుతిన్ డిఫెన్స్ మినిస్టర్ ఈయన, క్లోజ్ ఫ్రెండ్ కూడా. 2014లో క్రిమియాను ఆక్రమించుకోవడంలో ఈయన పాత్ర కీలకమైనదని పేరున్నది. ప్రస్తుతం ఉక్రెయిన్‌పై యుద్ధాన్నీ ఈయనే ముందుండి నడిపిస్తున్నాడు. ఈయన రష్యా మిలిటరీ ఇంటెలిజెన్స్ ఏజెన్సీకి చీఫ్‌గా కూడా వ్యవహరిస్తున్నాడు.
వాలెరీ జెరాసిమోవ్:
రష్యా మిలిటరీ చీఫ్, పుతిన్‌తో దగ్గరి సంబంధాలు ఉన్నవాడు. రష్యా గౌరవాన్ని మళ్లీ పునస్థాపించాలని బలంగా కోరుకునే మనిషి. ఇప్పుడు బెలారస్‌లో మిలిటరీ డ్రిల్స్ ఈయన సారథ్యంలోనే జరిగాయి. ఆ డ్రిల్స్ జరిగిన ప్రాంతం నుంచి ఉక్రెయిన్‌పై ఆయుధ దాడులు కూడా జరిగాయి.
సెర్జీ లావరోవ్:
పుతిన్ క్యాబినెట్‌లో దీర్ఘకాలం నుంచి ఉంటున్న వ్యక్తి సెర్జీ లావరోవ్. పుతిన్‌కు గొంతు లాంటి వాడు. రష్యా అధ్యక్షుడిగానూ చేశాడు.
