Asianet News TeluguAsianet News Telugu

బైడెన్ తో విమానంలో ప్రయాణించిన వైట్ హౌస్ ఉద్యోగికి కరోనా.. !

‘వైట్ హౌస్ లోని ఓ మధ్యస్థాయి ఉద్యోగికి సోమవారం ఉదయం కరోనా పాజిటివ్ గా తేలింది. ఆ ఉద్యోగి తరచూ అధ్యక్షుడికి కాంటాక్ట్ లో ఉండరు. కానీ మూడు రోజుల క్రితం డిసెంబర్ 17న అధ్యక్షుడు బైడెన్.. దక్షిణ కరోలినా నుంచి పెన్సుల్వేనియాలోని ఫిలడెల్ఫియాకు ప్రయాణించిన ఎయిర్ ఫోర్స్ వన్ లో ఆ ఉద్యోగి కూడా ఉన్నారు. ఆ సమయంలో సదరు ఉద్యోగి బైడెన్ వద్ద 30 నిమిషాలు ఉన్నారు’ అని శ్వేతసౌధం ప్రకటించింది. 

White House aide who was in close contact with Biden tests positive for COVID-19
Author
Hyderabad, First Published Dec 21, 2021, 12:09 PM IST

వాషింగ్టన్ : అగ్రరాజ్యం అమెరికా అధ్యక్ష భవనం White Houseలో మరోసారి corona virus కలకలం సృష్టించింది. అధ్యక్షుడుJoe Biden పాలనా యంత్రాంగంలో ఓ aideకి వైరస్ పాజిటివ్ గా నిర్థారణ అయ్యింది. సదరు వ్యక్తి మూడు రోజుల క్రితం బైడెన్ తో కలిసి ప్రయాణించినట్లు శ్వేతసౌధం అధికార ప్రతినిధి జెన్ సాకి ఓ ప్రకటనలో వెల్లడించారు.

‘వైట్ హౌస్ లోని ఓ మధ్యస్థాయి ఉద్యోగికి సోమవారం ఉదయం కరోనా పాజిటివ్ గా తేలింది. ఆ ఉద్యోగి తరచూ అధ్యక్షుడికి కాంటాక్ట్ లో ఉండరు. కానీ మూడు రోజుల క్రితం డిసెంబర్ 17న అధ్యక్షుడు బైడెన్.. దక్షిణ కరోలినా నుంచి పెన్సుల్వేనియాలోని ఫిలడెల్ఫియాకు ప్రయాణించిన ఎయిర్ ఫోర్స్ వన్ లో ఆ ఉద్యోగి కూడా ఉన్నారు. ఆ సమయంలో సదరు ఉద్యోగి బైడెన్ వద్ద 30 నిమిషాలు ఉన్నారు’ అని శ్వేతసౌధం ప్రకటించింది. 

సదరు ఉద్యోగికి కోవిడ్ పాజిటివ్ అని తేలగానే అప్రమత్తమైన వైద్యులు బైడెన్ కు ఆదివారం యాంటీజెన్, సోమవారం ఆర్ టీ-పీసీఆర్ పరీక్షలు నిర్వహించారు. రెండింటిలోనూ ఆయనకు నెగెటివ్ వచ్చినట్లు వైట్ హౌస్ ఆ ప్రకటనలో వెల్లడించింది. అధ్యక్షుడికి బుధవారం మరోసారి కరోనా పరీక్షలు నిర్వహించనున్నట్లు పేర్కొంది. 

అయితే సీడీసీ మార్గదర్శకాల ప్రకారం.. రెండు డోసులు తీసుకున్న వ్యక్తులు కరోనా బాధితులతో కాంటాక్ట్ అయినప్పటికీ క్వారంటైన్ లో ఉండాల్సిన అవసరం లేదని శ్వేతసౌధం ప్రతినిధి జెన్ సాకి తెలిపారు. అందువల్ల అధ్యక్షుడు తన రోజువారీ షెడ్యూల్ ను కొనసాగిస్తారని వెల్లడించారు. 

శ్వేతసౌధంలోని సిబ్బంది ఇప్పటికే రెండు డోసుల వ్యాక్సిన్ తో పాటు బూస్టర్ డోసులు కూడా తీసుకున్నట్లు ఆమె తెలిపారు. ఇదిలా ఉండగా.. అమెరికాలో కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వణుకుపుట్టిస్తోంది. కేవలం వారం వ్యవధిలోనే అక్కడ కేసులు అమాంతం పెరిగిపోయాయి. 

ఇదిలా ఉండగా, క‌రోనా ఫోర్త్ వేవ్ కార‌ణ‌మైన ఒమిక్రాన్.. ప్ర‌స్తుతం అమెరికా స‌హా  బ్రిట‌న్‌, ఫ్రాన్స్ వంటి యూర‌ప్ దేశాల్లో పంజా విసురుతోంది. బ్రిట‌న్ లో అయితే, ఒమిక్రాన్ వ్యాప్తి అసాధార‌ణ రీతిలో కొన‌సాగుతోంది. దీంతో అక్క‌డి ప‌రిస్థితులు ఆందోళ‌న‌క‌రంగా మారుతున్నాయి. మ‌రోసారి బ్రిట‌న్ లాక్ డౌన్ లోకి వెళ్లే ప‌రిస్థితులు క‌నిపిస్తున్నాయి. కేవ‌లం ఒక్క‌రోజులోనే ఒమిక్రాన్ కేసులు మూడు రెట్లు పెర‌గ‌డం అక్క‌డి ప‌రిస్థితికి అద్దం ప‌డుతున్నాయి. 

Omicron: ఒక ఈవెంట్ కంటే జీవితం ఎంతో ముఖ్యం.. ఒమిక్రాన్ నేప‌థ్యంలో WHO వ్యాఖ్యలు

బ్రిట‌న్ అధికారులు వెల్ల‌డించిన వివ‌రాల ప్ర‌కారం... బ్రిట‌న‌ల్ లో ఒక్క‌రోజే మొత్తం 90,418 క‌ర‌నా వైర‌స్ ఇన్‌ఫెక్షన్‌లు న‌మోద‌య్యాయి. అలాగే,  UKలో COVID-19 రోజువారీ మరణాల సంఖ్య 125కి చేరుకుంది. కొత్త క‌రోనా వైర‌స్ కేసులు 90 వేల‌కు పైగా ఉండ‌గా, అందులో 10 వేల‌కు పైగా ఒమిక్రాన్ కేసులు నివేదించ‌బ‌డ‌టం ఆందోళ‌న క‌లిగిస్తోంది. ఒక్క‌రోజులోనే అక్క‌డ ఒమిక్రాన్ కేసుల న‌మోదులో మూడు రెట్లు పెరుగుద‌ల చోటుచేసుకుంది.

బ్రిట‌న్ లో ఒమిక్రాన్ వేరియంట్ కార‌ణంగా మార‌ణాలు సైతం పెరుగుతున్నాయి. మొట్ట‌మొద‌టి ఒమిక్రాన్ మ‌ర‌ణాన్ని నివేదించిన బ్రిట‌న్‌లో ఈ వేరియంట్ కార‌ణంగా చ‌నిపోయిన వారి సంఖ్య 7కు పెరిగింది. Omicron వేరియంట్ ను ఎదుర్కొవ‌డానికి ప్ర‌భుత్వంతో క‌లిసి అన్ని చ‌ర్య‌లు తీసుకుంటున్నామ‌ని UK ఆరోగ్య కార్యదర్శి సాజిద్ జావిద్ అన్నారు. క‌ర‌నా వైర‌స్ వ్యాప్తి క‌ట్ట‌డి కోసం మ‌రిన్ని క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవాల్సిన అవ‌స‌ర‌ముంద‌ని ఆయ‌న పేర్కొంటున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios