Asianet News TeluguAsianet News Telugu

kabul bombers : ‘మా సైనికుల ప్రాణాలు తీసిన వారిని వెంటాడి, వేటాడి మట్టుబెడతాం..’ జో బైడెన్

మృతి చెందిన అమెరికా సైనికులను హీరోలుగా ఆయన అభివర్ణించారు. దాడికి పాల్పడింది తామేనని ఇప్పటికే ఇస్లామిక్ స్టేట్ ప్రకటించిన నేపథ్యంలో ఆ ఉగ్రవాద సంస్థ నాయకులను హతమార్చాలని తమ దేశ ఆర్మీని బైడెన్ ఆదేశించారు.

We Will Hunt You Down, Make You Pay Joe Biden Warns Kabul Bombers
Author
Hyderabad, First Published Aug 27, 2021, 9:51 AM IST

కాబూల్ : ఆఫ్గనిస్థాన్ రాజధాని కాబూల్ లో జరగిన పేలుళ్లపై అమెరికా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. దాడుల్లో అమెరికా సైనికుల మృతిపై ఆ దేశ అధ్యక్షుడు జో బైడెన్ స్పందించారు. తమ సైనికుల ప్రాణాలు తీసిన వారిని వదిలిపెట్టబోమని.. ప్రతీకారం తీర్చుకుంటామని హెచ్చరించారు.

మృతి చెందిన అమెరికా సైనికులను హీరోలుగా ఆయన అభివర్ణించారు. దాడికి పాల్పడింది తామేనని ఇప్పటికే ఇస్లామిక్ స్టేట్ ప్రకటించిన నేపథ్యంలో ఆ ఉగ్రవాద సంస్థ నాయకులను హతమార్చాలని తమ దేశ ఆర్మీని బైడెన్ ఆదేశించారు. ఈ నెల 31కల్లా అఫ్గాన్ నుంచి తమ సైనిక బలగాలను ఉపసంహరించుకుంటామని ఆయన పునరుద్థాటించారు.

గురువారం కాబూల్ విమాశ్రయం వద్ద జరిగిన ఆత్మాహుతి దాడుల్లో 72మంది మృత్యువాత పడ్డారు. వీరిలో అమెరికాకు చెందిన 11మంది సైనికులు, ఓ నేవీ వైద్యుడు ఉన్నారు. ఆ దేశానికి చెందిన మరో 12 మంది సైనికులు గాయపడ్డారు.

కాబూల్ ఎయిర్ పోర్ట్ మారణహోమంతో ప్రపంచం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఆఫ్గనిస్తాన్ లో తాలిబన్ల సహకారంతో అమెరికాకు తరలింపు ప్రక్రియ కొనసాగుతుండగా.. ఐసిస్  ఖోరసాన్ (కె) గ్రూపు మానవబాంబు దాడులతో విరుచుకుపడింది. ఈ దుర్ఘటనలో 60మంది చనిపాగా.. 150 మంది తీవ్రంగా గాయపడ్డారు. 

క్షతగాత్రుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశాలే కనిపిస్తున్నాయి. ఇక కాబూల్ ఎయిర్ పోర్ట్ జంట పేలుళ్ల మీద అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ భావోద్వేగంగా ప్రసంగించారు. గురువారం వైట్ హౌజ్ ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ.. బాధ్యులెవరైనా క్షమించే ప్రసక్తే లేదు. ఈ దాడిని అంత తేలికగా మేం మరిచిపోం... ఈ దాడితో ఉగ్రవాదం గెలిచినట్లే కాదు. వెంటాడి, వేటాడి ప్రతీకారం తీర్చుకుంటాం..’ అంటూ ఉద్రేకపూర్వకంగా ప్రసంగించారు. ఆఫ్గన్ గడ్డమీద అమెరికా దళాల సేవల్ని జ్ఞప్తి తెచ్చుకున్న ఆయన... మరణించిన వాళ్లకు సంఘీభావంగా కాసేపు మౌనంగా ఉండిపోయారు. జరిగిన నష్టానికి తానే బాధ్యత అని ప్రకటించుకున్న బైడెన్... సైన్యం తరలింపు ఆలస్యానికి తమ నిర్ణయాలే కారణమని స్పష్టం చేశారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios