పాకిస్తాన్ ప్రధానమంత్రి పదవికి ఇమ్రాన్ ఖాన్ రాజీనామా ప్రకటించారు. ఈ ప్రకటనకు ముందు తాము నేషనల్ అసెంబ్లీలో ఆ దొంగలతో కలిసి కూర్చోబోమని అన్నారు. దేశాన్ని దోచుకున్నవారితో తాము అసెంబ్లీలో కూర్చునేది లేదని వివరించారు. ఇమ్రాన్ ఖాన్ అనంతరం ఇతర పార్టీ నేతలూ నేషనల్ అసెంబ్లీ నుంచి రాజీనామా చేశారు. 

న్యూఢిల్లీ: పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్.. ఆ దేశ జాతీయ అసెంబ్లీ సభ్యత్వానికి రాజీనామా ప్రకటించారు. మరికొద్ది సేపట్లో ప్రతిపక్షాలు నూతన ప్రధానిని ఎన్నుకుంటారనగా.. ఆయన తన రాజీనామాను ప్రకటించారు. ఆ దొంగలతో కలిసి తాను పాకిస్తాన్ నేషనల్ అసెంబ్లీలో కూర్చోలేనని పేర్కొన్నారు. తామంతా అసెంబ్లీలో ఆ దొంగలతో కలిసి కూర్చోబోమని వివరించారు. ఆయన పార్టీ పీటీఐ అధికారిక ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేసిన ఓ వీడియో ఆయన రాజీనామా ప్రకటనను పోస్టు చేసింది.

వందలు వేల కోట్ల పాకిస్తాన్ రూపాయల అవినీతి కేసులు ఎదుర్కొంటున్న వ్యక్తిని ప్రధానిగా ఎన్నుకోవడం దేశానికి అవమానం అని ఆయన ఆ వీడియోలో పేర్కొన్నారు. ఆ వ్యక్తిపై 16 బిలియన్ రూపాయల అవినీతి కేసు.. 8 బిలియన్ రూపాయల మరో అవినీతి కేసు ఉన్నదని ఇమ్రాన్ ఖాన్ తెలిపారు. అలాంటి వ్యక్తిని ప్రధానమంత్రిగా ఎన్నుకోవడం అంటే.. దేశానికి అంతకు మించిన దౌర్భాగం మరేమీ లేదన్నట్టేనని పేర్కొన్నారు. అందుకే తాము నేషనల్ అసెంబ్లీ నుంచి రాజీనామా చేస్తున్నామని ప్రకటించారు.

ఈ ప్రకటనను పాకిస్తాన్ మాజీ అంతర్గత వ్యవహారాల మంత్రి షేక్ రశీద్ ధ్రువీకరించారు. అదే అసెంబ్లీలో తాము కూర్చుని ఉండటం అంటే ప్రతిపక్షాలు ఎన్నుకునే ప్రధానమంత్రిని బలపరిచనట్టే అవుతుందని పేర్కొన్నారు. కాబట్టి, తామంతా నేషనల్ అసెంబ్లీ నుంచి రాజీనామా చేయాలని నిర్ణయం తీసుకున్నట్టు వివరించారు. పార్లమెంటరీపక్ష సమావేశం జరుగుతున్నప్పుడు ఇమ్రాన్ ఖాన్ తాను ఇచ్చిన సలహాను స్వీకరించాడని తెలిపారు. ఇకపై ప్రతి ఆదివారం విదేశీ కుట్రను వెలికి తీసే పిలుపును ఇమ్రాన్ ఖాన్ దేశ ప్రజలకు ఇస్తారని వివరించారు. పాకిస్తాన్ ప్రధానిగా ఆయన అర్ధంరతంగా దిగిపోవాల్సి వస్తున్నా.. తదుపరి పోరాటానికి ఆయన భూమిక సిద్ధం చేసుకున్నారు.

Scroll to load tweet…

పాకిస్తాన్ నూతన ప్రధానమంత్రి కోసం ప్రతిపక్షాల ఓటింగ్ సమయంలో తాము నేషనల్ అసెంబ్లీలో కూర్చునేది లేదని పీటీఐ అధినేత, మాజీ పీఎం ఇమ్రాన్ ఖాన్ ఈ ఓటింగ్‌కు ముందే స్పష్టం చేశారు. కొత్త ప్రధాని ఎన్నికను తాము బహిష్కరిస్తున్నామని తెలిపారు. అందుకే తాము అందరం పార్లమెంటు నుంచి రాజీనామా చేస్తున్నట్టు వెల్లడించారు. ఈ దొంగలతో తాను నేషనల్ అసెంబ్లీలో కూర్చోబోనని అన్నారు. అనంతరం, పాకిస్తాన్ నూతన ప్రధాని కోసం ఎన్నిక జరిగింది. అందులో పీఎంఎల్ఎన్ చీఫ్ షాబాజ్ షరీఫ్‌ నూతన ప్రధానిగా ఎన్నికయ్యారు. ఈ ఎన్నికలో షాబాజ్ షరీఫ్ 174 ఓట్లు గెలుచుకున్నారు. పాకిస్తాన్ నేషనల్ అసెంబ్లీ మొత్తం బలం 342. దీంతో ఆయన మెజార్టీ ఓట్లు పొందారు. ఆయన పాకిస్తాన్ 23వ ప్రధానిగా ఎన్నికయ్యారు.