Washington: ఏవియేష‌న్ సిస్ట‌మ్ లోని ప్రధాన వ్యవస్థ వైఫల్యం తరువాత అమెరికాలోని అన్ని విమాన స‌ర్వీసులు నిలిచిపోయాయి. ఎక్కడి విమానాలు అక్క‌డే ఎగ‌ర‌కుండా ఉండిపోయాయి. దీంతో యూఎస్ లో గంద‌ర‌గోళ ప‌రిస్థితి నెల‌కొంది. సాంకేతిక లోపం కార‌ణంగా యూఎస్ ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ దేశవ్యాప్తంగా విమానాలను నిలిపివేసింది. 

US Aviation system failure: కంప్యూటర్ వ్యవస్థతో సాంకేతిక లోపం కారణంగా అమెరికా అంతటా విమానాలు ప్రభావితమయ్యాయని అంత‌ర్జాతీయ మీడియా నివేదికలు బుధవారం తెలిపాయి. ఏవియేష‌న్ సిస్ట‌మ్ లోని ప్రధాన వ్యవస్థ వైఫల్యం తరువాత అమెరికాలోని అన్ని విమాన స‌ర్వీసులు నిలిచిపోయాయి. ఎక్కడి విమానాలు అక్క‌డే ఎగ‌ర‌కుండా ఉండిపోయాయి. దీంతో యూఎస్ లో గంద‌ర‌గోళ ప‌రిస్థితి నెల‌కొంది. సాంకేతిక లోపం కార‌ణంగా యూఎస్ ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ దేశవ్యాప్తంగా విమానాలను నిలిపివేసింది.

ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్ఏఏ) తన వెబ్ సైట్ లో నోటీస్ టు ఎయిర్ మిషన్స్ (నోటామ్) వ్యవస్థ స్థానిక కాలమానం ప్రకారం బుధవారం ఉదయం విఫలమైందని తెలిపింది. పైలట్లు, విమాన కార్యకలాపాల్లో పాల్గొన్న ఇతరులకు ముఖ్యమైన సమాచారాన్ని కమ్యూనికేట్ చేయడానికి నోటామ్ సహాయపడుతుంది. "ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్ఏఏ) కంప్యూటర్ లో స‌మ‌స్య‌ను ఎదుర్కొంటున్నందున యునైటెడ్ స్టేట్స్ అంతటా అన్ని విమానాలు నిలిపివేయబడ్డాయి. ఎఫ్ఎఎ తన నోటీసు టు ఎయిర్ మిషన్స్ సిస్టమ్ ను పునరుద్ధరించడానికి కృషి చేస్తోంది. మేము తుది ధ్రువీకరణ తనిఖీలు చేస్తున్నాము.. ఇప్పుడు సిస్టమ్ ను తిరిగి పునఃపరిశీలిస్తున్నాము. జాతీయ గగనతల వ్యవస్థ అంతటా కార్యకలాపాలు ప్రభావితమవుతాయి" అని అక్క‌డి ఎఫ్ఏఏ ఒక ప్ర‌క‌ట‌న‌లో తెలిపిన‌ట్టు స్కై న్యూస్ నివేదించింది. 


Scroll to load tweet…

Scroll to load tweet…