Asianet News TeluguAsianet News Telugu

నువ్వు దేవుడివి స్వామి..స్వచ్ఛంద సంస్థకు వారెన్ బఫెట్  రూ.6,150 కోట్ల విరాళం!

వారెన్ బఫెట్ విరాళాలు అందించడంలో అందరి కన్నా ముందు వరుసలో ఉంటాయని ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పని లేదు. ప్రపంచ కుబేరుల్లో ఒకరిగా ఉంటూ వస్తున్న వారెన్‌ బఫెట్‌ ఆయన సంపదలో చాలా భాగాన్ని సమాజ శ్రేయస్సు కోసం ఖర్చు చేస్తున్నారు. చాలా సార్లు చాలా మొత్తాన్ని విరాళంగా ఇచ్చారు. తాజాగా ఇప్పుడు కూడా ఇలాంటి నిర్ణయమే ఒకటి తీసుకున్నారు. తన కుటుంబ సభ్యులు నడిపే నాలుగు ఫౌండేషన్లకు 75 కోట్ల డాలర్లు (సుమారు రూ.6,150 కోట్లు) విరాళంగా ఇచ్చారు. 

Warren Buffett donates more than $750 million to family charities
Author
First Published Nov 25, 2022, 12:36 PM IST

ప్రపంచ అపర కుబేరుడు వారెన్‌ బఫెట్‌.. విరాళాలు అందించడంలో అందరి కన్నా ముందు వరుసలో ఉంటాయని ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పని లేదు. 92 ఏళ్ల వారెన్ బఫెట్ తన దాతృత్వాన్ని  చాలా సార్లు చాటుకున్నారు. ఎప్పటికప్పుడు.. అతను తన సంపదలో ఎక్కువ భాగాన్ని స్వచ్ఛంద సంస్థకు (వారెన్ బఫెట్ ఛారిటీ) విరాళంగా ఇస్తారు. తాజాగా మరోసారి వారెన్ బఫెట్‌ తన స్వచ్ఛంద సేవా కార్యక్రమాలతో మరోసారి వార్తల్లో నిలిచారు. 

వారెన్ బఫెట్ తన కంపెనీ బెర్క్‌షైర్ హాత్వే నుంచి  అతని కుటుంబం నిర్వహిస్తున్న నాలుగు ఫౌండేషన్‌లకు మొత్తం 75 కోట్ల డాలర్లు అంటే.. రూ. 6,125 కోట్లు విరాళంగా అందజేశారు. విశేషమేమిటంటే.. వారెన్ బఫెట్ ప్రతి సంవత్సరం  తన సంపద నుండి స్వచ్ఛంద సంస్థకు ఐదుసార్లు విరాళంగా ఇస్తారు. రెగ్యులేటరీ ఫైలింగ్ సమయంలో సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమీషన్ విషయాన్ని వెల్లడించింది.  అయితే ఈసారి వారి నుంచి విరాళాలు అందుకున్న ఫౌండేషన్లలో బిల్ & మెలిండా గేట్స్ ఫౌండేషన్ పేరు లేకపోవడం గమన్హారం. 

2006 నుండి  విరాళాలు 

ప్రపంచంలోని ప్రముఖ వ్యాపారవేత్తల జాబితాలో చేరిన వారెన్ బఫెట్ 2006 నుండి స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. అతను తన డబ్బును సంవత్సరానికి ఐదుసార్లు విరాళంగా ఇస్తాడు. సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమిషన్‌కు దాఖలు చేసిన సమాచారం ప్రకారం.. వారెన్ బఫెట్ మొత్తం 1.5 మిలియన్ స్టాక్‌లను నెబ్రాస్కా గ్రూప్‌కు ఇచ్చాడు. తన కుటుంబసభ్యుల పేరిట ఏటా కోట్లాది రూపాయలను విరాళంగా ఇస్తున్నాడు.

వారెన్ బఫెట్ విరాళంగా ఇచ్చిన రూ. 6,125 కోట్లు 2022 సంవత్సరంలో రెండవ అతిపెద్ద విరాళంగా పరిగణిస్తారు.ఇంతకుముందు.. బిల్ అండ్ మెలిండా గేట్స్ ఫౌండేషన్ 2022 సంవత్సరంలో అతిపెద్ద విరాళాన్ని అందించింది. ఇందులో వారెన్ 11 మిలియన్ డాలర్ల విలువైన క్లాస్ B షేర్లను, 1.1 మిలియన్ డాలర్ల విలువైన B షేర్లను సుసాన్ థాంప్సన్ బఫెట్ ఫౌండేషన్‌కు విరాళంగా ఇచ్చాడు. దీనితో పాటు.. వారెన్ బఫెట్ కూడా ఎప్పటికప్పుడు బిల్ & మెలిండా గేట్స్ ఫౌండేషన్‌కు విరాళం ఇస్తారు. 

వారెన్ బఫెట్ తన కుటుంబం నడుపుతున్న ఫౌండేషన్ ద్వారా పిల్లల విద్య, రైతులకు సహాయం చేయడం, ప్రపంచవ్యాప్తంగా ఉన్న మహిళల ఆర్థిక,శారీరక అభివృద్ధి మొదలైన వాటి కోసం పనిచేస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న పిల్లల విద్యను మెరుగుపరచడానికి అతను నిరంతరం డబ్బును విరాళంగా ఇస్తాడు. దీనితో పాటు.. మహిళల అభివృద్ధి కోసం బఫెట్ కుటుంబం పెద్ద మొత్తంలో దాతృత్వం చేస్తుంది.

Follow Us:
Download App:
  • android
  • ios